బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 ఇప్పుడిప్పుడే ఊపందుకుంటుంది. మొదటి వారానికి గాను నామినేషన్స్ ప్రక్రియ ముగిసింది. 6 మంది కంటెస్టెంట్స్ నామినేషన్స్ లో ఉన్నారు. విష్ణుప్రియ, బెజవాడ బేబక్క, శేఖర్ బాషా, నాగ మణికంఠ, పృథ్విరాజ్, సోనియా ఆకుల నామినేటైన కంటెస్టెంట్స్. వీరిలో ఒకరు వచ్చే ఆదివారం ఇంటిని వీడనున్నారు.
విష్ణుప్రియ టాప్ సెలబ్రిటీ. కాబట్టి ఆమె ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ లేదు. స్టార్ మా ఛానల్ సీరియల్ బ్యాచ్ పృథ్విరాజ్ సైతం కొన్ని వారాల హామీతోనే హౌస్లో అడుగుపెట్టి ఉంటాడు. కాబట్టి పృథ్విరాజ్ ఫస్ట్ వీక్ ఎలిమినేట్ కాకపోవచ్చు. శేఖర్ బాషాకు సైతం బుల్లితెర ప్రేక్షకుల్లో కొంత ఫేమ్ ఉంది.