వందకు పైగా చిత్రాలకు దర్శకత్వం వహించిన దాసరి నారాయణరావు తెలుగు సినిమాకు దశాబ్దాల పాటు సేవలు చేశారు. ఆయన లెజెండరీ దర్శకుడు అనడంలో సందేహం లేదు. దాసరి గొప్ప నటుడు కూడాను. అనేక చిత్రాల్లో కీలక రోల్స్ చేశారు. దాసరి రాజకీయాల్లో కూడా రాణించారు. కేంద్ర మంత్రిగా బాధ్యతలు నెరవేర్చారు.
నాలుగు తరాల హీరోలతో పని చేసిన దాసరి... ఇండస్ట్రీ పెద్దగా వెలుగొందారు. ముఖ్యంగా చిన్న సినిమాలకు, నిర్మాతలకు సమస్య ఎదురైతే ఆయన ముందుండేవారు. చిన్న సినిమాను బ్రతికించుకున్నప్పుడే ఇండస్ట్రీ మనుగడ సాధ్యం. మీడియం, లో బడ్జెట్ చిత్రాలను ప్రోత్సహించాలి. సదరు చిత్రాల విడుదలకు అడ్డంకులు లేకుండా వెసులుబాటు కల్పించాలి. థియేటర్స్ కేటాయించాలని దాసరి డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన కొన్ని ప్రతిపాదనలు తెరపైకి తేవడం జరిగింది.
Chiranjeevi and Dasari
నాలుగు కుటుంబాల గుప్పెట్లో తెలుగు సినిమా నలిగిపోతుంది. వారి ఆధిపత్యం కారణంగా చిన్న సినిమాలు, నటులు నష్టపోతున్నారు. నలిగిపోతున్నారని పలు వేదికలపై దాసరి బహిరంగంగానే విమర్శలు చేశారు. దాసరి విమర్శలు గుప్పించిన ఆ నాలుగు కుటుంబాల్లో చిరంజీవి ఫ్యామిలీ కూడా ఒకటనే వాదన ఉంది. నెపోటిజం కారణంగా అవుట్ సైడర్స్ కి అన్యాయం జరుగుతుందని కూడా దాసరి అభిప్రాయపడ్డారు.
Chiranjeevi and Dasari
దాసరి కామెంట్స్ తో చిరంజీవి నొచ్చుకున్నారు. దాసరి-చిరంజీవి మధ్య మనస్పర్థలు తలెత్తాయి. దూరం పెరిగిందంటూ అప్పట్లో కథనాలు వెలువడ్డాయి ఈ పుకార్లపై ఓ సందర్భంలో దాసరి స్పందించారు. చిరంజీవితో తనకు విబేధాలు లేవంటూ ఖండించారు. చిరంజీవితో నాకు ఎందుకు గొడవలు ఉంటాయి. అసలు చిరంజీవి నాకు బంధువు అవుతాడు. మీకు ఆ విషయం తెలియదు. మా మేనల్లుడు చిరంజీవి బంధువును పెళ్లాడు... అని దాసరి అన్నారు.
Chiranjeevi and Dasari
దాసరి సొంత మేనల్లుడు చిరంజీవికి పిన్నమ్మ అయ్యే అమ్మాయిని పెళ్లాడాడు అట. ఆ విధంగా చిరంజీవి కుటుంబంతో దాసరి కుటుంబానికి బంధుత్వం ఏర్పడిందట. ఇక పరోక్షంగా తనపై దాసరి చేసిన విమర్శలపై చిరంజీవి ఓ సందర్భంలో స్పందించారు. నేను రాజకీయాల్లోకి వస్తుస్తున్నానన్న విషయం దాసరితో చెప్పలేదు. ఆయన తనకు చెప్పి ఉండాల్సిందని భావించి ఉండొచ్చు. ఆయనంటే నాకు ఎప్పుడూ గౌరవం ఉంది. ఆయన్ని తరచుగా కలుస్తూనే ఉన్నాను. అయితే అందరినీ మనం సంతృప్తి పరచలేము, అన్నారు.
Chiranjeevi and Dasari
దాసరి నారాయణరావు ప్రధాన పాత్రలో నటించిన మేస్త్రి మూవీ 2009లో విడుదలైంది. ఈ చిత్రంలో చిరంజీవి పొలిటికల్ కెరీర్ మీద దాసరి సెటైర్స్ వేశారనే వాదన ఉంది. ఇక చిరంజీవి, దాసరి కాంబోలో లంకేశ్వరుడు టైటిల్ తో ఒక మూవీ తెరకెక్కింది. ఇది డిజాస్టర్ కావడం విశేషం.
Chiranjeevi and Dasari
కాగా దాసరి నారాయణరావు 2017లో కన్నుమూశారు. అనంతరం యన గౌరవార్థం 2018 లో తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎదుట విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. అలాగే దాసరి నారాయణరావు సొంతూరు పాలకొల్లులో కూడా విగ్రహాన్ని ఆవిష్కరించారు.