విజయ్ దళపతి చేయాల్సిన గేమ్ ఛేంజర్ మూవీ రామ్ చరణ్ కు ఎలా వెళ్లింది.

First Published | Jan 3, 2025, 4:16 PM IST

రామ్ చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ మూవీని ముందుగా విజయ్ తో చేయాలి అనుకున్నాడట శంకర్. కాని విజయ్ ఈసినిమా చేయకపోవడానికి కారణం ఏంటో తెలుసా..? 

గేమ్ ఛేంజర్ కోసం విజయ్

ఇండియన్ 2 డిజాస్టర్ తరువాత డైరెక్టర్ శంకర్ ఆశలన్నీ గేమ్ ఛేంజర్ మీదనే పెట్టుకున్నాడు.  కియారా అద్వానీ హీరోయిన్‌గా నటించిన ఈసినిమాలో సముద్రఖని, ఎస్.జె.సూర్య, అంజలి వంటి స్టార్స్  నటించారు.  దిల్ రాజు నిర్మించిన ఈసినిమాకు  తమన్ సంగీతం అందించారు. 

గేమ్ ఛేంజర్

గేమ్ ఛేంజర్ మూవీ శంకర్ డైరెక్ట్ చేసినా..  కథ మాత్రం కార్తీక్ సుబ్బరాజుది. కరోనా సమయంలో దర్శకుల వాట్సాప్ గ్రూప్‌లో కార్తీక్ ఈ కథ చెప్పగా, శంకర్ బాగుందన్నారట. దాంతో దీన్ని సినిమా చేయాలని చెప్పారట. 


శంకర్, రాంచరణ్

కథ నచ్చిన శంకర్  సినిమా చేయాలని అనుకున్నార. ఆ సినిమానే రామ్ చరణ్ హీరోగా తెరకెక్కించిన గేమ్ ఛేంజర్. సంక్రాంతి కానుకగా ఈమూవీ  జనవరి 10న విడుదల కానున్న ఈ సినిమా ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి.

గేమ్ ఛేంజర్

ఈ సినిమాలో మొదట విజయ్ నటించాల్సి ఉండగా, ఆయన వదులుకున్నారనే వార్త ఆశ్చర్యం కలిగిస్తోంది. కథ విజయ్‌కి నచ్చినా, శంకర్ ఒకటిన్నర సంవత్సరాలు కాల్షీట్లు అడగడంతో విజయ్ వదులుకున్నారట. తర్వాత దిల్ రాజు విజయ్‌తో వారసుడు సినిమా నిర్మించారు.

శంకర్, విజయ్

రాజకీయాల కారణంగా విజయ్ కాల్షీట్లు ఇవ్వలేకపోయారని వెబ్‌పేచ్చు బిస్మి చెప్పారు. విజయ్ శంకర్ దర్శకత్వంలో నన్బన్ సినిమాలో నటించారు. దాంతో ఈ స్టోరీని రామ్ చరణ్ తో సినిమా తెరకెక్కించారు శంకర్. ఇక పాన్ ఇండియా వ్యాప్తంగా ఈసినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. మరి మూవీ రిజల్ట్ ఎలా ఉంటుందో చూడాలి. 

Latest Videos

click me!