అది మరొకరు ఇచ్చేది కాదు.. లవర్స్ డే నాడు దీప్తి సెన్సేషనల్ పోస్ట్... షణ్ముఖ్ తో కొనసాగుతున్న కోల్డ్ వార్

Published : Feb 14, 2022, 04:47 PM IST

అన్నీ బాగుంటే దీప్తి సునైన-షణ్ముఖ్ లకు నేడు చాలా స్పెషల్ డే అయ్యేది. బ్రేకప్ తర్వాత మొదటి లవర్స్ డే (Valentines day 2022) ఇది. ప్రేమికులుగా విడిపోయిన దీప్తి-షణ్ముఖ్ మధ్య మానసిక యుద్ధం నడుస్తూనే ఉంది. వాళ్ళ సోషల్ మీడియా పోస్ట్స్ దీనికి నిదర్శనం. 

PREV
17
అది మరొకరు ఇచ్చేది కాదు.. లవర్స్ డే నాడు దీప్తి సెన్సేషనల్ పోస్ట్... షణ్ముఖ్ తో కొనసాగుతున్న కోల్డ్ వార్

బిగ్ బాస్ సీజన్ 5 (Bigg Boss telugu 5) షణ్ముఖ్-దీప్తిల ప్రేమకు చిచ్చు పెట్టింది. హౌస్ లో తోటి కంటెస్టెంట్ సిరితో షణ్ముఖ్ సన్నిహితంగా ఉండడం చూసి దీప్తి తట్టుకోలేకపోయింది. షో ముగిసే వరకు మౌనం వహించిన దీప్తి మెల్లగా తన అసహనాన్ని బయటపెట్టింది. పరోక్షంగా సోషల్ మీడియా పోస్ట్స్ ద్వారా తన ఆవేదన, ఆక్రోశం బయటపెట్టే ప్రయత్నం చేసింది.

27

దీప్తి(Deepthi Sunaina), షణ్ముఖ్ విడిపోతున్నారనే ఊహాగానాలు మొదలైన కొద్దిరోజులకు దీప్తి అధికారిక ప్రకటన చేశారు. షణ్ముఖ్ తో విడిపోతున్నట్లు వెల్లడించారు. ఈ విషయంపై సోషల్ మీడియాలో ఫ్యాన్స్ తో నేరుగా డిస్కస్ చేసిన దీప్తి, ఇకపై పూర్తిగా కెరీర్ మీద ఫోకస్ చేయనున్నట్లు చెప్పారు.

37


దాదాపు ఐదేళ్లుగా ప్రేమించుకుంటున్న ఈ జంట అనూహ్యంగా విడిపోయారు. యూట్యూబ్ స్టార్స్ గా కలిసి అనేక సాంగ్స్, షార్ట్ ఫిలిమ్స్, సిరీస్లు చేశారు. బ్రేకప్ కారణంగా ఎంతో కొంత ఆర్ధికంగా కూడా నష్టపోయారు. వీరిద్దిరి కాంబినేషన్ కి మంచి క్రేజ్ ఉన్న నేపథ్యంలో సిరీస్లకు మంచి డిమాండ్ ఏర్పడింది. 

47

ఒకపక్క ఎవరి కెరీర్ వాళ్ళు చూసుకుంటూ బిజీగా ఉన్న దీప్తి, షణ్ముఖ్(Shanmuk Jaswanth) సోషల్ మీడియా వార్ మాత్రం ఆపడం లేదు. ఒకరికొకరు పరోక్షంగా కౌంటర్లు వేసుకుంటున్నారు. దీప్తి సునైనా ఇంగ్లీష్ కోట్స్ పోస్ట్స్ చేస్తుంది. షణ్ముఖ్ కొద్దిరోజుల క్రితం.. అల్లు అర్జున్ ''మై లవ్ ఈజ్ గాన్'' సాంగ్ కి డాన్స్ చేసిన వీడియో పోస్ట్ చేశారు.

57

ఇక నేడు వాలెంటైన్స్ డే కాగా దీప్తి సునైన ఓ సంచలన పోస్ట్ చేశారు. తన ఒంటిపై ఉన్న టాటూలు కనిపించేలా శాడ్ ఫేస్ తో కూడిన ఫోటో పోస్ట్ చేసిన సునైనా... ఆనందం అనేది మనకు మనం సమకూర్చుకోవాల్సిన బాధ్యత, వేరొక మనిషి నీకు అది తీసుకురారు'' అంటూ కామెంట్ పెట్టారు.

67


ఇది ఖచ్చితంగా షణ్ముఖ్ ని ఉద్దేశించే అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఎవరో మన జీవితాలు ఆనందంగా మార్చేస్తారు అనుకోవడం పొరపాటు. మనల్ని సంతోషంగా ఉంచుకోవాల్సిన బాధ్యత మనదే అని ఆమె తెలిపారు. షణ్ముఖ్ తన సంతోషాన్ని దూరం చేశాడని పరోక్షంగా దీప్తి చెబుతుంది. 
 

77

ఇక దీప్తి ప్రతి పోస్ట్ కి షణ్ముఖ్ కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. మరి దీప్తి కామెంట్ కి అతడు ఎలాంటి వీడియో పోస్ట్ చేస్తాడో? ఏవిధమైన కామెంట్ ఇస్తాడో చూడాలి. వీరి సోషల్ మీడియా వార్ ని బయట నుండి వారి అభిమానులు, సోషల్ మీడియా జనాలు పరిశీలిస్తున్నారు.  

click me!

Recommended Stories