ఈ మాత్రానికే కంగారు పడటం ఎందుకు వంటింట్లోకి వెళ్లిన తర్వాత వీడియో కాల్ చెయ్యు నేను చెప్పింది ఫాలో అయిపో అంటూ సలహా ఇస్తుంది తులసి. మంచి ఐడియా అంటూ ఆనంద పడిపోతుంది దివ్య. మరోవైపు నందు దగ్గరికి వచ్చిన లాస్య ఈమధ్య నువ్వు బాగా మారిపోయావు, నా పక్కన కూర్చొని ప్రేమగా మాట్లాడి ఎన్ని రోజులు అయిందో తెలుసా అంటుంది. ఈమధ్య నేను పనిలో ఎంత బిజీగా ఉన్నానో మీకు కూడా తెలుసు కదా అంటాడు నందు. ఇదంతా మన మధ్య ఎప్పుడూ ఉండేదే కానీ ఎల్లుండి మన బ్రాంచ్ ఎస్టాబ్లిష్మెంట్ గురించి మాట్లాడటానికి ఇంజనీర్ వస్తున్నాడు ఆ వర్క్ అంత నువ్వే చూసుకో, అతను అడ్వాన్స్గా 10,00,000 అడుగుతున్నాడు.