OM Movie Story: ధనుష్ హీరోగా నటించిన ఓం సినిమా ట్రైలర్ రిలీజ్ కావడంతో, ఆ సినిమా కథ ఏంటో దాదాపుగా తెలిసిపోయింది. దీనితో ఈ సినిమా కథపై కొత్త వివాదం మొదలైంది. అదేంటో తెలుసుకుందాం.
ధనుష్, మమ్ముట్టి కాంబినేషన్లో వస్తున్న 'ఓం' సినిమా ట్రైలర్ రిలీజైంది. సినిమాలోని ముఖ్య పాత్రలను పరిచయం చేస్తూ కట్ చేసిన ఈ ట్రైలర్, సినిమా పక్కా ఎంటర్‌టైనర్ అని చెబుతోంది. అడవుల నేపథ్యంలో అధికారం, ఘర్షణ, నేరం, ప్రతీకారం చుట్టూ తిరిగే యాక్షన్ డ్రామాగా ఈ సినిమా ఉండబోతోందని ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. రాజ్‌కుమార్ పెరియసామి డైరెక్ట్ చేసిన ఈ సినిమా నవంబర్ 20న థియేటర్లలోకి రానుంది.
25
అండర్ వరల్డ్ డాన్
ధనుష్ తన కెరీర్‌లోనే బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడని ట్రైలర్ చూస్తే తెలుస్తోంది. మమ్ముట్టి బర్మా కార్తికేయన్ అనే అండర్ వరల్డ్ డాన్ పాత్రలో కనిపిస్తున్నాడు. సాయి పల్లవి క్యారెక్టర్ కూడా ఈ సినిమాలో కీలకం కానుంది. సాయి పల్లవి సీబీఐ ఆఫీసర్ నిత్యా రెడ్డిగా నటిస్తోంది. సాయి పల్లవితో పాటు శ్రీలీల కూడా ఈ సినిమాలో మరో హీరోయిన్‌గా చేస్తోంది. శ్రీలీల రోజా అనే పాత్రలో నటిస్తోంది. ఓం సినిమా ట్రైలర్‌లోనే దాదాపుగా కథను చెప్పేశారు.
35
ఎర్ర చందనం స్మగ్లింగ్
స్పెషల్ ఫోర్స్‌లో పనిచేసే ధనుష్, ఐపీఎస్ ఆఫీసర్ సాయి పల్లవి ఆర్డర్స్‌తో ఎర్ర చందనం స్మగ్లింగ్ ముఠాలోకి అండర్ కవర్ ఆపరేషన్‌పై వెళ్తాడు. స్మగ్లింగ్ డాన్ మమ్ముట్టి గ్యాంగ్‌లో చేరి, వాళ్ల ప్లాన్స్ గురించి పోలీసులకు సమాచారం ఇస్తుంటాడు. కానీ, పోలీసుల అరాచకాలను, క్రూరత్వాన్ని కళ్లారా చూసిన ధనుష్, ఒక దశలో పోలీసులకు ఎదురుతిరుగుతాడు. ఆ తర్వాత మమ్ముట్టి గ్యాంగ్‌తో చేతులు కలిపి ట్విస్ట్ ఇస్తాడు. ఆ తర్వాత ఏమైందన్నదే ఈ సినిమా కథ.
ఈ కథ వింటుంటే ఎక్కడో విన్నట్టు అనిపిస్తుంది కదా. శింబు నటించిన 'పత్తు తల' సినిమా కథ కూడా దాదాపు ఇదే. అది కన్నడలో హిట్టైన 'మఫ్టీ'కి రీమేక్. శివరాజ్‌కుమార్ హీరోగా వచ్చిన మఫ్టీ సినిమా కథ, ఓం సినిమా కథ ఒకేలా ఉన్నాయని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. కొందరైతే ఇది పుష్ప రేంజ్‌లో ఉందని అంటున్నారు. సినిమా రిలీజ్ అయ్యాకే రెండు ఒకే కథనా లేదా వేరే కథనా అనేది తెలుస్తుంది.
55
సాయి అభ్యంకర్ మ్యూజిక్
ధనుష్, మమ్ముట్టి, సాయి పల్లవి, శ్రీలీలతో పాటు నసీరుద్దీన్ షా, ఇంద్రన్స్ ఈ సినిమాలో ముఖ్య పాత్రలు పోషించారు. మలయాళ, తమిళ సినీ ప్రేక్షకులను ఆకర్షించేలా భారీ స్టార్ కాస్ట్ ఈ సినిమాలో ఉంది. 'అమరన్' లాంటి హిట్ సినిమా తీసిన రాజ్‌కుమార్ పెరియసామి ఈ సినిమాకు కథ అందించి, డైరెక్ట్ చేశాడు. సాయి అభ్యంకర్ మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇస్తున్నాడు. ఎళిల్ అరసు సినిమాటోగ్రఫీ, ఆర్.కలైవానన్ ఎడిటింగ్ చేస్తున్నారు. యానిక్ బెన్, కెచా కంపాక్డీ యాక్షన్ సీక్వెన్సులు కంపోజ్ చేశారు.