ఈరోజు ఎపిసోడ్ ప్రారంభంలోనే శారదమ్మ, ఆర్య అను ని తీసుకువస్తాడు కదా అని అడుగుతుంది. ఇంతలో ఆర్య వాళ్ళు బాధపడుతూ వస్తారు. అను దొరకలేదు తన జాడ కూడా తెలియడం లేదు అని బాధపడతాడు ఆర్య. ఎందుకు అను ఇలా చేస్తుంది. తప్పుడు జాతకాలు అన్ని నమ్మి తన జీవితాన్ని తనే నాశనం చేసుకుంటుంది. నా కోడల్ని మనవల్ని చూసి అదృష్టం నాకు లేదా అని బాధపడుతూ ఉంటుంది శారదమ్మ. అప్పుడు ఆర్య దేవుడు నా కూతుర్ని నాకు దగ్గర చేయడానికి చాలా రకాలుగా సహాయం చేశారు కానీ నేనే గుర్తించలేదు.