ముసలోడికి దసరా పండగ... టిల్లు స్క్వేర్ లో ఆ సీన్స్ చూస్తూ ఓ పెద్దాయన చేసిన పనికి అందరూ షాక్!

First Published Apr 2, 2024, 7:14 AM IST

టిల్లు స్క్వేర్ మూవీ అంచనాలకు మించి ఆదరణ దక్కించుకుంటుంది. కాగా ఈ చిత్రానికి ఓ పెద్దాయన వెళ్ళాడు. అనుపమ పరమేశ్వరన్-సిద్ధూ జొన్నలగడ్డ మధ్య వచ్చే రొమాంటిక్ సీన్స్ తెగ ఎంజాయ్ చేశాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది. 
 

2022లో విడుదలైన డీజే టిల్లు బ్లాక్ బస్టర్ హిట్. తక్కువ బడ్జెట్ తో తెరకెక్కి ఎక్కువ లాభాలు పంచింది. దానికి సీక్వెల్ గా టిల్లు స్క్వేర్ తెరకెక్కింది. సిద్ధూ జొన్నలగడ్డకు జంటగా అనుపమ పరమేశ్వరన్ నటించింది. ఈ చిత్రంలో రొమాన్స్ డోసు కొంచెం శృతి మించి ఉంది. 

అనుపమ  తన హోమ్లీ ఇమేజ్ బ్రేక్ చేస్తూ గ్లామరస్ రోల్ చేసింది. లిప్ లాక్ సన్నివేశాల్లో నటించింది. అనుపమ పరమేశ్వరన్ తీరుపై కొందరు ఫ్యాన్స్ అసహనం వ్యక్తం చేశారు. ఓ అభిమాని అయితే.. అనుపమ ఇలాంటి సన్నివేశాల్లో నటించడం చాలా బాధను కలిగిస్తుంది అన్నాడు. ఇకపై టిల్లు స్క్వేర్ తరహా చిత్రాలు చేయవద్దంటూ వీడియో విడుదల చేశాడు. 
 

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరు గెలిచే అవకాశాలున్నాయో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మీ అభిప్రాయాన్ని ఇక్కడ షేర్ చేయండి.

అయితే ఎప్పుడూ ఒకే తరహా పాత్రలు చేయడం వలన బోర్ కొట్టేస్తుంది. అందుకే టిల్లు స్క్వేర్ లో లిల్లీ పాత్ర చేశాను. టిల్లు స్క్వేర్ లోని లిల్లీ పాత్ర రిజెక్ట్ చేస్తే అంతకంత అమాయకత్వం మరొకటి ఉండదు. అరుదుగా ఇలాంటి పాత్రలు చేసే అవకాశం వస్తుందని అనుపమ పరమేశ్వరన్ అన్నారు. 

కాగా థియేటర్లో ఓ ముసలాయన అనుపమ-సిద్ధూ జొన్నలగడ్డ మధ్య వచ్చే రొమాంటిక్ సీన్స్ ని తెగ ఎంజాయ్ చేశాడు. కారులో సిద్ధూ, అనుపమ రొమాన్స్ చేస్తారు. ఈ సీన్స్ చూస్తున్న ఓ పెద్దాయన ముఖంలో ఎక్స్ప్రెషన్స్ కెమెరాలో బంధించారు. ఆయన నవ్వుతూ తెగ ఎంజాయ్ చేస్తున్నాడు. 

Tillu Square

ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే కాపీ రైట్స్ వైలేషన్ రీత్యా ఆ వీడియో తర్వాత డిలీట్ చేశారు. యూత్ నే కాకుండా పెద్దవారికి కూడా టిల్లు స్క్వేర్ నచ్చేస్తుంది సదరు వీడియో ద్వారా అర్థం అవుతుంది. 

టిల్లు స్క్వేర్ మూవీ ఇప్పటికే రూ 50 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసినట్లు సమాచారం. మాలిక్ రామ్ ఈ చిత్ర దర్శకుడు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో సూర్యదేవర నాగవంశీ నిర్మించాడు. టిల్లు స్క్వేర్ మూవీతో సిద్ధూ జొన్నలగడ్డ మరో హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు. 
 

click me!