రెచ్చగొట్టే చూపులకు తోడు గుండెలు గల్లంతయ్యే కామెంట్స్ చేస్తుంది అనసూయ. బ్లాక్ టాప్, రెడ్ ఫ్రాక్ ధరించి స్టైలిష్ గా కనిపించిన స్టార్ లేడీ సోషల్ మీడియాను ఊపేస్తున్నారు.
అనసూయ తన లేటెస్ట్ ఫోటో షూట్ ఇంస్టాగ్రామ్ లో షేర్ చేశారు. తన ఫోటోలకు ఆమె క్రేజీ కామెంట్స్ పోస్ట్ చేశారు. '' శుభ సూచనలు, కొత్త భావనలు, పాత కోరికలు, అదే హృదయం'' అని పోస్ట్ పెట్టారు.
210
Anasuya Bharadwaj
అనసూయకు వస్తున్న కొత్త ఆలోచనలు ఏంటని ఫ్యాన్స్ వాపోతున్నారు. ఇక అనసూయ ఫోటోలు చూసి తమ ఫీలింగ్స్ కామెంట్స్ రూపంలో తెలియజేస్తున్నారు. అనసూయ ట్రెండీ లుక్ వైరల్ అవుతుంది.
310
Anasuya Bharadwaj
సిల్వర్ స్క్రీన్ పై అనసూయ ఫుల్ బిజీ అయ్యారు. ఆమెకు ఆఫర్స్ క్యూ కడుతున్నాయి. విశేషం ఏమిటంటే ఎక్కువగా నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలు ఆమె తలుపు తడుతున్నాయి.
410
Anasuya Bharadwaj
పుష్ప, ఖిలాడి, దర్జా చిత్రాల్లో వరుసగా ఆమె నెగిటివ్ రోల్స్ చేశారు. సందీప్ కిషన్ పాన్ ఇండియా మూవీ మైఖేల్ లో అనసూయ ఓ కీలక రోల్ చేస్తున్నారు.
510
Anasuya Bharadwaj
ట్రైలర్ చూశాక అనసూయ మైఖేల్ లో కూడా నెగిటివ్ రోల్ చేస్తున్నారనే సందేహం కలుగుతుంది. పుష్ప 2లో మరోసారి ఆమె దాక్షాయణిగా విలన్ గా కనిపించనున్నారు.
610
Anasuya Bharadwaj
కాగా అనసూయ యాంకరింగ్ కి గుడ్ బై చెప్పేశారు. మొదట జబర్దస్త్ వదిలేసిన అనసూయ... మెల్లగా మిగతా షోస్ నుండి కూడా తప్పుకున్నారు. అనసూయ యాంకర్ గా ఒక్క ప్రోగ్రాం టెలికాస్ట్ కావడం లేదు. బుల్లితెర ఆడియన్స్ ఆమెను మిస్ అవుతున్నారు.
710
Anasuya Bharadwaj
అనసూయ పూర్తి దృష్టి నటనపై పెట్టారు. నటిగా ఆమెకు వరుస ఆఫర్స్ వస్తున్న నేపథ్యంలో ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. అనసూయకు ఇతర భాషల్లో కూడా ఆఫర్స్ రావడం విశేషం. గత ఏడాది అనసూయ ఒక తమిళ, మలయాళ చిత్రం చేశారు.
810
Anasuya Bharadwaj
యాంకర్ గా వచ్చే ఆదాయంతో పోల్చితే నటిగా పెద్ద మొత్తం రాబట్టవచ్చు. అనసూయ నిర్ణయానికి ఇది కూడా కారణం. షోలలో గంటల తరబడి గొంతు చించుకుంటే ఏమొస్తుంది చెప్పండి. నటిగా సక్సెస్ అయితే ఒక సినిమాకు కోట్లు అందుకోవచ్చు.
910
Anasuya Bharadwaj
ప్రస్తుతం అనసూయ కాల్షీట్ కి రూ. 3 లక్షలకు పైనే తీసుకుంటున్నారట. రోజుకు రెండు షిఫ్ట్స్ పనిచేసినా ఆరు లక్షలకు పైనే సంపాదించవచ్చు. జీవితంలో ఎవరైనా బెటర్మెంట్ కోరుకుంటారు కదా. అనసూయ కూడా అధిక ఫేమ్, మనీ వచ్చే యాక్టింగ్ కి మొదటి ప్రాధాన్యత ఇస్తున్నారు.
1010
Anasuya Bharadwaj
ఇక అల్లు అర్జున్-సుకుమార్ ల యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ పుష్ప 2 భారీ ఎత్తున తెరకెక్కించనున్నారు. ఇక దర్శకుడు కృష్ణవంశీ తెరకెక్కిస్తున్న రంగమార్తాండ మూవీలో కీలక రోల్ చేశారు. రంగమార్తాండ విడుదలకు సిద్ధమైంది.