
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం టాలీవుడ్ టాప్ హీరోల్లో ఒకరిగా ఉన్నారు. ఎంత మంది యంగ్ హీరోలు పాన్ ఇండియా సినిమాలతో ఆకట్టుకుంటున్నా, కలెక్షన్లతో దుమ్ములేపుతున్నా మెగాస్టార్ స్టేజ్‌ని చేరుకునే స్థాయిలో లేరనే చెప్పాలి. ఆ స్థానం ఆయనదే అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ప్రస్తుతం మూడు సినిమాల లైనప్‌తో బిజీగా ఉన్న చిరంజీవి కెరీర్‌లో ఓ మూవీ విడుదలకు నోచుకోలేదు. షూటింగ్ పూర్తి చేసుకుని ఫైనల్ కాపీ రెడీ అయిన తర్వాత రిలీజ్ ఆపేవారు. దానికి కారణం నిర్మాత అల్లు అరవింద్ కావడం గమనార్హం. ఆ కథేంటో చూద్దాం.
చిరంజీవి 1980లో స్టార్‌గా పీక్‌లో ఉన్నారు. `ఖైదీ` బ్లాక్ బస్టర్ తర్వాత ఆయన రేంజ్ మారిపోయింది. ఆయనతో సినిమాలు చేసేందుకు వరుసగా దర్శక, నిర్మాతలు క్యూ కట్టారు. ఆ సమయంలో ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వెళ్లడంతో ఆయన స్థానం ఖాళీ అయ్యింది. ఆ స్థానాన్ని చిరు భర్తీ చేశారు. వరుసగా కమర్షియల్ సినిమాలతో టాలీవుడ్‌కి కాసుల వర్షం కురిపించారు. చిరంజీవితో సినిమా చేస్తే మినిమమ్ గ్యారంటీ అనేది పడింది. సినిమా బాగుందంటే లాభాల పంటే. ఇతర సినిమాలతో నష్టపోయిన నిర్మాతలు చిరంజీవితో సినిమాలు చేసిన లాభాల్లోకి రావడం విశేషం.
1980-20 మధ్య చిరంజీవి కెరీర్ పరుగులు పెట్టింది. అలాంటి సమయంలో ఓ విభిన్నమైన కథాంశంతో సినిమా చేశారు చిరంజీవి. అదే `శాంతి నివాసం`. బాబు దర్శకత్వం వహించిన ఈ మూవీ షూటింగ్ పూర్తి చేసుకుంది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కంప్లీట్ చేసుకుని రిలీజ్‌కి రెడీ అయ్యింది. ఆ సమయంలోనే నిర్మాత కన్నుమూశారు. దీంతో ఒక్కసారిగా అంతా డౌన్ అయిపోయారు. కొంత గ్యాప్ తర్వాత మళ్లీ సినిమాని రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. చిరంజీవినే స్వయంగా తాను టేకోవర్ చేసుకుని రిలీజ్ చేయాలని భావించారు. ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేశారు.
అంతలోనే నిర్మాత అల్లు అరవింద్ ఎంటరయ్యారు. అప్పట్లో చిరంజీవి సినిమాలకు సంబంధించి అల్లు అరవింద్ బ్యాక్ బోన్‌గా ఉండేవారు. డేట్స్ నుంచి స్క్రిప్ట్ ల వరకు అరవింద్ దగ్గరుండి చూసుకునే వారు. ఈ క్రమంలోనే `శాంతి నివాసం` సినిమా చూశాడట అరవింద్. ఆయనకు మూవీ నచ్చలేదు. ఈ మూవీ రిలీజ్ చేస్తే ఆడదని ఆయనకు అర్థమయ్యింది. అదే విషయాన్ని చిరంజీవికి చెప్పారు. ప్రమోషన్స్ డబ్బులు కూడా వేస్ట్ అని చెప్పారట. దీంతో మెగాస్టార్ ఈ మూవీని పక్కన పెట్టేశారు. తానే స్వయంగా రిలీజ్ చేయాలనుకున్న నిర్ణయాన్ని విరమించుకున్నారు. ఇలా చిరు కెరీర్‌లో షూటింగ్ పూర్తి చేసుకుని ఫైనల్ కాపీ కూడా రెడీ అయ్యాక విడుదలకు నోచుకోని మూవీగా `శాంతి నివాసం` నిలిచింది. ఇందులో మెగాస్టార్ సరసన మాధవి హీరోయిన్‌గా నటించడం విశేషం.
ఇక చిరంజీవి ప్రస్తుతం `విశ్వంభర` చిత్రంలో నటిస్తున్నారు. వశిష్ట దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీ సోషియో ఫాంటసీగా రూపొందుతుంది. ఏడులోకాల కథ ఇంట్రెస్టింగ్‌గా ఉండబోతుందట. త్రిష హీరోయిన్‌గా నటిస్తోంది. యూవీ క్రియేషన్స్ నిర్మిస్తోంది. ఈ సినిమాని త్వరలోనే ఆడియెన్స్ ముందుకు తీసుకురావడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇంకోవైపు అనిల్ రావిపూడి దర్శకత్వంలో మరో మూవీలో నటిస్తున్నారు చిరు. ఇది ఆద్యంతం కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతుంది. వచ్చే సంక్రాంతికి విడుదల కాబోతుంది. అలాగే శ్రీకాంత్ ఓడెల దర్శకత్వంలో ఓ సినిమా చేయాల్సి ఉంది.