అబ్బాయికి ఝలక్‌ ఇచ్చిన బాబాయ్‌.. `ఓజీ` రిలీజ్‌ డేట్‌ ఫిక్స్.. ఓవర్సీస్‌, ఆడియో రైట్స్ లెక్కలు..?

First Published | Jan 30, 2024, 3:41 PM IST

పవన్‌ కళ్యాణ్‌ నటిస్తున్న `ఓజీ` మూవీ రిలీజ్‌ డేట్‌కి సంబంధించిన ఓ క్లారిటీ వచ్చింది. అలాగే సినిమా ఓవర్సీస్‌రైట్స్, ఆడియో రైట్స్ లెక్కలు ఆసక్తికరంగా మారుతున్నాయి. 
 

Pawan kalyan OG Glimpse

పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ నటిస్తున్న లేటెస్ట్ మూవీ `ఓజీ`. ఆయన ప్రస్తుతం మూడు సినిమాల్లో నటిస్తుండగా, అందులో మొదటగా రాబోతుంది ఈ సినిమానే. నిజానికి ఈ సినిమా గతేడాదిలోనే రావాల్సింది. కానీ పవన్‌ కళ్యాణ్‌ షూటింగ్‌కి రాకపోవడంతో వాయిదా పడుతూ వస్తోంది. కేవలం పవన్‌ 15రోజుల డేట్స్ ఇస్తే ఈ మూవీ షూటింగ్‌ వర్క్ పూర్తవుతుందట.  
 

Pawan kalyan OG Glimpse

కానీ పవన్‌ డేట్స్ ఇవ్వలేదు. ఇప్పుడు ఇచ్చే పరిస్థితి కనిపించడం లేదు. ఏపీ ఎన్నికలు పూర్తయ్యేంత వరకు పవన్‌ సినిమాల్లో నటించడం కుదరదు. దీంతో ఆయనతో కమిట్‌ అయిన దర్శకులు ఇతర సినిమాలకు షిఫ్ట్ అవుతున్నారు. హరీష్‌ శంకర్‌ ఇప్పటికే రవితేజ తో `మిస్టర్‌ బచ్చన్‌` మూవీ చేస్తున్నారు. మరోవైపు `ఓజీ` ఫేమ్‌ సుజీత్‌ కూడా మరో సినిమాకి కమిట్‌ అయ్యారట. కానీ `ఓజీ` తర్వాతే అది ఉంటుందని సమాచారం. 


Pawan kalyan OG Glimpse

ఇదిలా ఉంటే తాజాగా `ఓజీ` నుంచి అదిరిపోయే అప్‌డేట్లు వచ్చాయి. రిలీజ్‌ డేట్‌ క్లారిటీ వచ్చింది. తాజాగా ఫిల్మ్ నగర్‌ నుంచి అందుతున్న సమాచారం మేరకు ఈ మూవీ రిలజీ్‌ డేట్‌ని లాక్‌ చేసిందట యూనిట్‌. సెప్టెంబర్‌లో విడుదల తేదీని ఫిక్స్ చేసిందట. సెప్టెంబర్‌ 27న రాబోతున్నట్టు తెలుస్తుంది. లాంగ్‌ వీకెండ్‌ ఉన్న నేపథ్యంలో ఈ డేట్‌ని ఫిక్స్ చేశారట. త్వరలోనే దీనికి సంబంధించిన ప్రకటన ఉండబోతుందని తెలుస్తుంది. ఏపీ ఎన్నికలు పూర్తయిన వెంటనే ఈ మూవీని కంప్లీట్‌ చేసి రిలీజ్‌ చేయాలని టీమ్‌ భావిస్తుంది. 
 

Game Changer

ఇదిలా ఉంటే ముందుగా సెప్టెంబర్‌ 27న రామ్‌ చరణ్‌ నటించిన `గేమ్‌ ఛేంజర్‌` మూవీ వస్తుందని భావించారు. నిర్మాత దిల్‌ రాజు కూడా సెప్టెంబర్‌లో వస్తున్నట్టు చెప్పారు. కానీ ఈ డేట్‌కి బాబాయ్‌ పవన్‌ కళ్యాణ్‌ మూవీని ఫిక్స్ చేశారు. దీంతో అబ్బాయి రామ్‌చరణ్‌కి ఇది పెద్ద షాక్‌ అని అంటున్నారు నెటిజన్లు. ఇది ఓ రకంగా అబ్బాయికి బాబాయ్‌ ఝలక్‌ అనేలా మారిపోయింది. 

Pawan kalyan OG Glimpse

ఇదిలా ఉంటే ఈ మూవీకి బిజినెస్‌ లెక్కలు ఆశ్చర్యపరుస్తున్నాయి. ఓవర్సీస్‌లో ఈ మూవీ చాలా తక్కువగా పలికిందట. అక్కడ ఇది కేవలం 17కోట్లకే అమ్ముడు పోయిందని తెలుస్తుంది. అంతేకాదు ఆడియె రైట్స్ కూడా తక్కువగానే పోయాయి. సుమారు 20కోట్లకు ఆడియో రైట్స్ అమ్ముడు పోయాయని, సోనీ సంస్థ దక్కించుకుందని తెలుస్తుంది. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది. 
 

Pawan kalyan OG Glimpse

గ్యాంగ్‌స్టర్‌ ప్రధానంగా ఈ మూవీ సాగుతుంది. పీరియాడికల్‌ యాక్షన్‌ డ్రామాగా తెరకెక్కిస్తున్నారు. ఇందులో ఎమోషన్స్ హైలైట్‌గా నిలుస్తాయని, ముఖ్యంగా మహిళలకు సంబంధించిన సెంటిమెంట్లు ఆకట్టుకునేలా ఉంటాయని తెలుస్తుంది. ఇందులో శ్రియా రెడ్డి కీలక పాత్ర పోషిస్తుంది. పవన్‌ కి జోడీగా ప్రియాంక అరుల్‌ మోహన్‌ నటిస్తుంది. ఇమ్రాన్‌ హష్మీ ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. అర్జున్‌ దాస్‌ కీ రోల్‌లో మెరవనున్నారు. 
 

Latest Videos

click me!