‘దేవర’లో జాన్వీ ఇలాంటి పెర్ఫామెన్స్ ఇస్తే.. థియేటర్లలో గోలగోలే.. ఆ ఎనర్జీ చూశారా!

Published : Jan 30, 2024, 02:51 PM IST

యంగ్ బ్యూటీ జాన్వీ కపూర్ ‘దేవర’ Devaraలో నటిస్తున్న విషయం తెలిసిందే. తొలిసారిగా ఈ చిత్రంతో తెలుగు ప్రేక్షకులను అలరించబోతుండటం ఆసక్తికరంగా మారింది. జాన్వీ ఎలా ఆకట్టుకుంటుందని ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు.   

PREV
16
‘దేవర’లో జాన్వీ ఇలాంటి పెర్ఫామెన్స్ ఇస్తే.. థియేటర్లలో గోలగోలే.. ఆ ఎనర్జీ చూశారా!

అతిలోక సుందరి, దివంగత శ్రీదేవి కూతురుగా జాన్వీ కపూర్ Janhvi Kapoor తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయమే. అందంలో తల్లికి ఏమాత్రం తీసిపోదు ఈ ముద్దుగుమ్మ. సోషల్ మీడియాలో తరుచూ తన ఫొటోలతో ఆకట్టుకుంటూనే ఉంటుంది. 

26

బాలీవుడ్ వరుస చిత్రాలతో అలరిస్తున్న జాన్వీ కపూర్ త్వరలో టాలీవుడ్ లోకి కూడా ఎంట్రీ ఇవ్వబోతోంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ NTR ‘దేవర’తో తెలుగు ప్రేక్షకులను పరిచయం చేసుకోబోతోంది. 
 

36

ఈ క్రమంలో తన నటన, అందచందాలతో ఏమేరకు ఆకట్టుకోబోతుందనేది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. జాన్వీ కూడా సెట్స్ లో ఎప్పుడో జాయిన్ అయ్యింది. తన ఫస్ట్ లుక్ కూడా ఆకట్టుకుంది.

46

ఇదిలా ఉంటే.. జాన్వీ కపూర్ తాజాగా అహ్మదాబాద్ లో నిర్వహించిన 69వ ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ 2024 (69th Filmfare Awards 2024) ఈవెంట్ లో సందడి చేసింది. స్టన్నింగ్ అవుట్ ఫిట్లలో అందరి చూపు తనపైనే పడేలా చేసింది. 

56

మరోవైపు వేదికపై అద్భుతమైన డాన్స్ పెర్ఫామెన్స్ తో అదరగొట్టింది. మాస్ స్టెప్పులతో ఉర్రూతలూగించింది. దీంతో జాన్వీని అభిమానులు, నెటిజన్లు అభినందిస్తున్నారు. ఈ క్రమంలో ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా స్పందిస్తున్నారు. 

66

ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ లో అదరగొట్టినట్టుగానే  ‘దేవర’లో జూ.ఎన్టీఆర్ Jr.NTR సరసన పెర్ఫామ్ చేస్తే... థియేటర్లలో గోలగోల ఉంటుందంటున్నారు. జాన్వీ నుంచి ఓ రేంజ్ పెర్పామెన్స్ అయితే ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. ఇక కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ 5, 2024న విడుదల కానుంది. సైఫ్ అలీఖాన్ విలన్. అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు. 

Read more Photos on
click me!

Recommended Stories