వాళ్లు రావడం రావడం.. పంచమిని ఆమె మొగుడు వదిలేశాడు అంట కదా అని అడుగుతారు.అలాంటిదేమీ లేదని.. తన అల్లుడు బంగారం అని చెబుతుంది. రెండు రోజులు ఆడపిల్ల పుట్టింటికి కూడా రాకూడదా అని అడుగుతుంది. అంటే.. మొగుడు లేకుండా వచ్చిందంటే ఆ మాత్రం అనుమానం ఉంటుంది కదా అని ఆ ఆడాళ్లు అంటారు. ఆ తర్వాత..పంచమి మరో అబ్బాయితో మాట్లాడుతుందని ఫణీంద్ర గురించి ఆరా తీస్తారు. ఆ అబ్బాయి మా చుట్టాలబ్బాయి అని చెప్పడంతో.. మేము కూడా అదే అనుకున్నాం అని అక్కడి నుంచి వెళ్లిపోతారు.
తర్వాత పంచమి తల్లి.. ఈ అవమానాలన్నీనీకు అవసరమా తల్లి.. నువ్వు నీ నాగలోకానికి వెళ్లిపో అని వాళ్ల అమ్మ చెబుతుంది. అయితే.. తనకు భూలోకం మీద చేయాల్సిన పనులు కొన్ని ఉన్నాయని అవి పూర్తి చేసిన తర్వాత.. ఇక్కడి నుంచి నాగలోకానికి వెళ్లిపోతాను అని చెబుతుంది.