సుజీత్ ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తున్నారట. సినిమాలో పవన్ స్వాగ్ నెక్ట్స్ లెవల్‌లో ఉంటుందట. ఆయన గెటప్, పాత్ర తీరుతెన్నులు, యాక్షన్, ఎమోషన్స్ వేరే లెవల్ అని తెలిపింది. `సలార్` ని మించి ఉంటుందట. సినిమా హైలీ యాక్షన్ ఎమోషనల్ మూవీ అని తెలిపింది. 50శాతం యాక్షన్, మరో 50 శాతం ఎమోషన్స్ ఉంటాయట. `సలార్`ని మించిన యాక్షన్, దాన్ని మించిన ఎమోషన్స్ ఉంటాయని శ్రియా రెడ్డి వెల్లడించింది. తన పాత్ర కూడా `సలార్` సినిమాల కంటే ఇంకా పవర్ ఫుల్‌గా ఉంటుందట.