కరోనా దెబ్బకి అనకున్న షూటింగ్, సినిమా రిలీజ్ లు అన్నీ పోస్ట్ పోన్ అయ్యాయి. దీంతో ఆడియన్స్ ముందుకు తొందరగా వద్దామనుకున్న వాళ్లు అంతకంతకూ డిలే అవతూ లేట్ అవుతున్నారు. ప్రభాస్(Prabhas) అయితే లాస్ట్ 9 ఇయర్స్ లో మూడే మూడు సినిమాలు రిలీజ్ చేశారంటే .. ఎంత గ్యాప్ తీసుకుంటున్నారో అర్దం చేసుకో వచ్చు. ప్రభాస్ ప్రేక్షకుల ముందుకు 2019 ఆగస్ట్ లో సాహో సినిమాతో వచ్చారు. సాహో అవ్వకముందే రాధేశ్యామ్(Radhe Shyam) సినిమాను స్టార్ట్ చెయ్యడంతో 2020 లోనే రెబల్ స్టార్ సినిమా రిలీజ్ అవుతుందని ఎక్స్ పెక్ట్ చేశారు ఫ్యాన్స్.కానీ ఈ సినిమా స్టార్ట్ చేసినదగ్గరనుంచి రకరకాల కారణాలతో సినిమా పోస్ట్ పోన్ అవ్వడంతో మూడేళ్ల తర్వాత సినిమా ఫైనల్లీ ఈ మార్చి 11న రిలీజ్ కాబోతోంది.