Janhvi Kapoor birthday special: అమ్మ శ్రీదేవితో జాన్వీ అరుదైన చిత్రాలు..

Published : Mar 06, 2022, 04:02 PM IST

బాలీవుడ్ యంగ్ బ్యూటీ జాన్వీ కపూర్ పుట్టినరోజు(Janhvi Kapoor birthday ) నేడు. 1997 మార్చి 6వ తేదీన జన్మించిన జాన్వీ కపూర్ 25వ ఏట అడుగు పెట్టారు.  అతిలోక సుందరి శ్రీదేవి నట వారసురాలైన జాన్వీ అరుదైన ఫోటోలు ఆమె పుట్టినరోజు సందర్భంగా మీకోసం..

PREV
111
Janhvi Kapoor birthday special: అమ్మ శ్రీదేవితో జాన్వీ అరుదైన చిత్రాలు..

జాన్వీ టాలీవుడ్ ఎంట్రీ కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. శ్రీదేవి కూతురు కావడంతో ఆమెకు సౌత్ లో హైప్ వచ్చిపడింది. ఇక ఆమె తెలుగు చిత్రం చేస్తున్నారంటూ పలుమార్లు కథనాలు ఇప్పటికే వెలువడ్డాయి. తాజా సమాచారం ప్రకారం.. ఎన్టీఆర్ (NTR),మూవీతో ఆమె ఎంట్రీ ఖాయం అంటున్నారు. ఎన్టీఆర్ అప్ కమింగ్ మూవీలో జాన్వీ హీరోయిన్ గా నటిస్తున్నారంటూ పుకార్లు చక్కర్లు కొడుతున్నాయి.

211

టాలీవుడ్ హీరోలతో నటించడానికి జాన్వీ అంతగా ఇష్టపడటం లేదని కూడా ఓ వాదన ఉంది. తెలుగు దర్శక నిర్మాతలు పలుమార్లు ఆమెను సంప్రదించగా.. సున్నితంగా తిరస్కరించినట్లు సమాచారం. అందుకే జాన్వీ టాలీవుడ్ ఎంట్రీ లేటవుతుందంటున్నారు. కానీ ఇప్పుడు సినారియో పూర్తిగా మారిపోయింది. దేశంలోనే టాలీవుడ్ అగ్ర స్థానానికి చేరింది. తెలుగు హీరోలు ఇండియన్ బాక్సాఫీస్ షేక్ చేస్తున్నారు.

311

ఇక జాన్వీ కెరీర్ పరిశీలిస్తే అందానికి మారు పేరైన శ్రీదేవి (Sridevi) వారసురాలిగా జాన్వీ కపూర్.. అందం, ఆహార్యంలో అచ్చు అమ్మ పోలికే. చూడగానే మనసులు దోచే సోయగాలు ఆమె సొంతం. అయినప్పటికీ ట్రెండ్ కి తగ్గట్టుగా జాన్వీ తనని తాను మార్చుకుంటున్నారు.
 
411

అయితే హీరోయిన్ గా జాన్వీ కపూర్ కి సరైన బ్రేక్ దక్కలేదు. విడుదలైన చిత్రాలలో జాన్వీ నటనకు మంచి మార్కులు పడ్డాయి. అందుకే ఆఫర్స్ విషయంలో ఢోకా లేదు. దానికి తోడు కపూర్ ఫ్యామిలీ అమ్మాయి కావడంతో జాన్వీ స్టార్ హీరోయిన్ గా ఇండస్ట్రీని ఉపేయడం ఖాయం అంటున్నారు.
 
511

2018లో విడుదలైన ధఢక్ జాన్వీ మొదటి చిత్రం. రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ గా తెరకెక్కింది. కూతురును వెండి తెరపై చూసి మురిసిపోవాలని శ్రీదేవి అనుకున్నారు. కానీ ఆ సినిమా విడుదల కాకముందే ఆమె ప్రమాదవశాత్తు మరణించారు. ఆమె కన్నుమూసిన కొన్ని నెలల తర్వాత ధడక్ విడుదలైంది.

611

కెరీర్ బిగినింగ్ లోనే ఓ బయోపిక్ లో నటించి మెప్పించారు జాన్వీ. లేడీ వార్ పైలట్ గుంజన్ సక్సేనా బయోపిక్ లో జాన్వీ టైటిల్ రోల్ చేశారు. ఆ మూవీలో జాన్వీ నటనకు ప్రసంశలు దక్కాయి.ప్రస్తుతం జాన్వీ రెండు చిత్రాలలో నటిస్తున్నారు. దోస్తానా 2 మూవీలో జాన్వీ హీరోయిన్ గా చేస్తున్నారు. అలాగే గుడ్ లక్ జెర్రీ అనే చిత్రం చిత్రీకరణ జరుపుకుంటుంది.

711

ఇక బాలీవుడ్ హీరోయిన్స్ అంటేనే గ్లామర్ షో విషయంలో వెనుకాడకూడదు. జాన్వీ సైతం అదే పద్ధతి ఫాలో అవుతున్నారు. బికినీలు, పొట్టి డ్రెస్ లలో ఫోటో షూట్స్ చేస్తూ ఫ్యాన్స్ ని మెస్మరైజ్ చేస్తున్నారు.

811

బాలీవుడ్ యంగ్ బ్యూటీ జాన్వీ కపూర్ పుట్టినరోజు(Janhvi Kapoor birthday ) నేడు. 1997 మార్చి 6వ తేదీన జన్మించిన జాన్వీ కపూర్ 25వ ఏట అడుగు పెట్టారు.  అతిలోక సుందరి శ్రీదేవి నట వారసురాలైన జాన్వీ అరుదైన ఫోటోలు ఆమె పుట్టినరోజు సందర్భంగా మీకోసం..

911

1011

1111

Read more Photos on
click me!

Recommended Stories