ఇద్దరూ స్టార్ కిడ్సే, చరణ్ స్టార్ కావడానికి, చైతు కాకపోవడానికి కారణం తెలుసా? టాలెంట్ మేటర్ కాదు, తండ్రుల వలనే!

First Published | Oct 12, 2024, 8:04 AM IST

నాగార్జున స్టార్ గా సత్తా చాటాడు. ఆయన కుమారులు మాత్రం ఆ స్థాయిలో సక్సెస్ కాలేదు. అందుకు ఒక ప్రధాన కారణం ఉంది. చరణ్ కోసం చిరంజీవి చేస్తున్న ఒక పని, నాగార్జున తన కొడుకుల కోసం చేయడం లేదు. అదేమిటీ.. 
 

Chiranjeevi-Nagarjuna

పిల్లల కోసం పేరెంట్స్ ఏదైనా చేస్తారు. తమ జీవితం, సంపాదన, వారసత్వం వారికి ఇచ్చేస్తారు. సినిమా పరిశ్రమలో ఈ వారసత్వం అనేది బలమైన ఎమోషన్. అభిమానులు దీన్ని కోరుకుంటారు. ముఖ్యంగా ఓ స్టార్ హీరో కొడుకు హీరోగా ఎంట్రీ ఇవ్వాల్సిందే. లేదంటే ఫ్యాన్స్ ఒప్పుకోరు. 
 

ప్రస్తుతం టాలీవుడ్ ని శాసిస్తున్న వారందరు నెపో కిడ్సే. సినిమా నేపథ్యం ఉన్నవారే. అవుట్ సైడర్స్, గాడ్ ఫాదర్ లేనివాళ్లు టైర్ టు హీరోల జాబితాకు పరిమితం అయ్యారు. అయితే అక్కినేని నాగార్జున కొడుకులు మాత్రం స్టార్స్ కాలేకపోయారు. నాగ చైతన్య పరిశ్రమలో అడుగుపెట్టి దశాబ్దం దాటిపోయింది. ఆయన డెబ్యూ మూవీ జోష్ 2009లో విడుదలైంది. 

మాస్ కమర్షియల్ సబ్జక్ట్స్ ఎంచుకున్న ప్రతిసారి నాగ చైతన్యకు ప్లాప్స్ పడ్డాయి. రొమాంటిక్, లవ్, ఎమోషనల్ డ్రామాలు ఆయనకు విజయాలు అందించాయి. టైర్ టు హీరోల రేసులో కూడా ఆయన వెనుకబడ్డారు. నాని, విజయ్ దేవరకొండ.. నాగ చైతన్యను వెనక్కి నెట్టారు. లవ్ స్టోరీ అనంతరం నాగ చైతన్య నటించిన థాంక్యూ, కస్టడీ ఆడలేదు. 


అఖిల్ పరిస్థితి ఇంకా దారుణం. 2015లో హీరోగా ఎంట్రీ ఇచ్చిన అఖిల్ కి ఒక్క సాలిడ్ హిట్ పడలేదు. అఖిల్ కెరీర్ గందరగోళంగా ఉంది. ఈ క్రమంలో కొడుకుల కెరీర్ విషయంలో నాగార్జున ఏం చేస్తున్నారనే సందేహాలు మొదలయ్యాయి. చిరంజీవి చరణ్ కోసం చేసింది... తన పిల్లల కోసం ఆయన ఎందుకు చేయడం లేదు? 

రామ్ చరణ్ టాప్ స్టార్ గా ఎదగడంలో చిరంజీవి పాత్ర ఎంతగానో ఉంది. 2007లో చిరుత మూవీతో రామ్ చరణ్ పరిచయమయ్యాడు. అప్పటి నుండి చరణ్  చిత్రాల ఎంపిక విషయంలో చిరంజీవి ప్రమేయం ఉంటుంది. డెబ్యూ మూవీ చిరుత పర్లేదు అనిపించింది. అందుకే ఒక భారీ బ్లాక్ బస్టర్ కావాల్సిందే అని.. అపజయం ఎరుగని రాజమౌళితో చరణ్ కి ప్రాజెక్ట్ సెట్ చేశాడు. 

2009లో విడుదలైన మగధీర ఇండస్ట్రీ హిట్. దెబ్బకు రామ్ చరణ్ ఇమేజ్ మారిపోయింది. ఆయన మాస్ హీరోగా జనాల్లోకి వెళ్ళిపోయాడు. ప్రతిభ ఉన్న దర్శకులను ఇంటికి ఆహ్వానించి, లేదంటే నేరుగా కలిసి చరణ్ కోసం ఆయన ప్రాజెక్ట్స్ సెట్ చేస్తారట. ఈ వాదన పరిశ్రమలో ఉంది. 

ఆర్ ఆర్ ఆర్ మూవీలో రామ్ చరణ్ పాత్ర, ఎన్టీఆర్ పాత్రకు ఏ మాత్రం తగ్గకుండా ఉంటుంది. ఇంకా చెప్పాలంటే చరణ్ పాత్రకు కొన్ని సీన్స్ లో రాజమౌళి ప్రాధాన్యత ఇచ్చాడు. దీని వెనుక చిరంజీవి ఉన్నాడనడంలో ఎలాంటి సందేహం లేదు. చరణ్ కెరీర్ కోసం చిరంజీవి అంతలా జాగ్రత్తలు తీసుకుంటాడు. 

మహేష్ బాబు ఫారెన్ టూర్లపై ఎన్టీఆర్ సెటైర్లు.. తారక్ కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన సూపర్ స్టార్..

ఇలా నాగార్జున చేయరట. నాగ చైతన్య ఓ ఇంటర్వ్యూలో స్వయంగా చెప్పాడు. నాకు, అఖిల్ కి నాన్న సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది. మేము ఏదడిగినా ఆయన కాదనరు. నాన్న..  నాకు ఫలానా దర్శకుడు కావాలి. మంచి సబ్జెక్టు తో ఒక ప్రాజెక్ట్ సెట్ చేయమని అడిగితే... ఆ దర్శకుడు దగ్గరకు వెళ్లి మాట్లాడి, ప్రాజెక్ట్ ఓకే చేయించగలడు. కానీ మేము అలా అడగము. మాకు మేముగా ఎదగాలి అనేది, మా కోరిక.. అన్నారు. 

కాబట్టి ఫలానా దర్శకుడితో మూవీ కావాలని నాగ చైతన్య, అఖిల్ అడగరు... అదే సమయంలో నాగార్జున కూడా చొరవ తీసుకుని వాళ్ళ కోసం టాలెంటెడ్ దర్శకులను సంప్రదించరని ఒక స్పష్టత వచ్చింది. కాగా అఖిల్ కి గట్టి పునాది వేయాలని నాగార్జున భారీగా లాంచ్ చేశాడు. వివి వినాయక్ దర్శకత్వంలో అఖిల్ టైటిల్ తో ఓ సోషియో ఫాంటసీ, యాక్షన్ డ్రామా నిర్మించారు. 

అఖిల్ మూవీ బాక్సాఫీస్ వద్ద వర్క్ అవుట్ కాలేదు. ప్రస్తుతం నాగ చైతన్య చందూ మొండేటి దర్శకత్వంలో తండేల్ మూవీ చేస్తున్నాడు. ఇది ఎమోషనల్ లవ్ డ్రామా. సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తుంది. అఖిల్ కొత్త ప్రాజెక్ట్ పై ప్రకటన చేయాల్సి ఉంది. 

బిగ్ బాస్ హౌజ్ నుంచి ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఎవరు?

Latest Videos

click me!