'సర్కార్ సీతారాం' టైటిల్ తో బాలయ్య, ఫస్ట్ లుక్ ఈ రోజే

First Published | Oct 12, 2024, 6:52 AM IST

ఈ రోజు సర్కార్ సీతారంకు  సంబంధించి అధికారికంగా ప్రకటన వస్తుంది. ఈ టైటిల్ తో దసరా శుభాకాంక్షలు చెప్తూ పోస్టర్ వదులబోతున్నట్లు సమాచారం. 

Balakrishna, Sarkaar Sitharam, bobby

నందమూరి బాలకృష్ణ సినిమా అంటే టైటిల్ నుంచి అన్నీ పవర్ ఫుల్ గా ఉండేలా చూస్తారు. అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి చిత్రాలతో హ్యాట్రిక్ సాధించిన బాలయ్య మంచి జోరుమీద ఉన్నారు. వరస సినిమాలను లైన్ లో పెట్టారు. యంగ్ డైరక్టర్స్ తో దూసుకుపోతున్నారు.  వాళ్లు కూడా బాలయ్య ఇమేజ్ కు తగ్గ కథలు, టైటిల్స్ తో ముందుకు వస్తున్నారు. తాజాగా బాలయ్య కొత్త చిత్రానికి 'సర్కార్ సీతారాం' టైటిల్ ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. ఆ సినిమా మరేదో కాదు...

Balakrishna


ప్రస్తుతం నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా, డైరెక్టర్ బాబీ (కెఎస్‌ రవీంద్ర) దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. దీన్ని సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్యలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో ఊర్వశీ రౌతేలా, పాయల్‌ రాజ్‌పుత్‌ కీలకపాత్రలు పోషిస్తున్నారు. బాలీవుడ్ నటుడు బాబీ దేవోల్‌ విలన్ పాత్ర చేస్తున్నారు. యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో బాలకృష్ణ మాస్‌ స్టైలిష్‌ లుక్‌లో కనిపించనున్నారు. ఈ సినిమా తాజా అప్‌డేట్‌ కోసం ప్రేక్షకులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.
 



ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో చేస్తున్న చిత్రంలో బాలయ్య చాలా పవర్ ఫుల్ రోల్  చేస్తున్నారు.  ఈ సినిమాలో సూపర్ హీరోగా చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అందులో నిజమెంతో కానీ టైటిల్ మాత్రం ఫిక్స్ అయ్యిందని తెలిస్తోంది.  ఆ టైటిల్ మరేదో కాదు సర్కార్ సీతారం. ఈ రోజు అందుకు  సంబంధించి అధికారికంగా ప్రకటన వస్తుంది. ఈ టైటిల్ తో దసరా శుభాకాంక్షలు చెప్తూ పోస్టర్ వదులబోతున్నట్లు సమాచారం. 


ఇదిలా ఉంటే...2025 సంక్రాంతి కానుకగా బాలకృష్ణ-బాబీ సినిమా విడుదల కానున్నట్లు గత కొన్ని రోజులుగా సోషల్‌ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే అందులో ఏ నిజం లేదని అంటున్నారు. షూటింగ్‌ ఇప్పటికే చాలావరకూ పూర్తయిన నేపథ్యంలో లేటు  చేయకుండా.. డిసెంబర్‌ 2నే సినిమా విడుదల చేయాలని నిర్మాతలు భావిస్తున్నారట. అఖండ చిత్రం విడుదలైంది కూడా ఇదే రోజు కావడం తో సెంటిమెంట్‌గా డిసెంబర్‌ 2 బాగా కలిసొస్తుందని మేకర్స్‌ భావిస్తున్నారట. 
 

శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్ట్యూన్ ఫోర్ బ్యానర్స్ నుంచి నాగవంశీ, సౌజన్య ఈ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో బాలీవుడ్‌ స్టార్‌ బాబీ డియోల్‌ విలన్‌గా నటిస్తున్నాడు. 

ఈ సినిమాకు మ్యూజిక్‌ డైరెక్టర్‌గా థమన్‌ ఉన్నారు. గతేడాది మెగాస్టార్‌ చిరంజీవి వాల్తేరు వీరయ్య చిత్రంతో డైరెక్టర్‌ బాబీ హిట్‌ కొట్టాడు. అందులో స్పెషల్‌ సాంగ్‌లో మెరిసిన ఊర్వశి రౌటేలాకు డైరెక్టర్‌ బాబీ మరో ఛాన్స్‌ ఇచ్చాడు. NBK 109 చిత్రంలో ఆమె కూడా ఒక స్పెషల్‌ సాంగ్‌లో మెరవనుంది.  చాందిని చౌదరి కూడా ఇందులో కీలక పాత్రలో నటిస్తుంది.

Mokshagna, Nandamuri Legacy


మరో ప్రక్క బాలయ్య తనకు మరో ఇమేజ్ ను తీసుకువచ్చిన అన్ స్టాపబుల్ షో మూడో సీజన్ ను కూడా త్వరలోనే మన ముందుకు తీసుకురాబోతున్నారు. దీనికి అతిథిగా అల్లు అర్జున్ వచ్చారు. అనేక విషయాలను బహిరంగంగానే చెప్పినట్లు తెలుస్తోంది.

బిగ్ బాస్ హౌజ్ నుంచి ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఎవరు?
 

Latest Videos

click me!