బాక్సాఫీస్ దగ్గర సంచలనం సృష్టించిన 'అబ్సెషన్' సినిమా ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది. జూలై 14న ఈ సినిమా డీవీడీ, బ్లూ-రే, 4K UHD వెర్షన్లను కూడా రిలీజ్ చేయనున్నారు. అయితే ఇక్కడే ఓ ట్విస్ట్ ఉంది.
యూట్యూబర్ కరి బార్కర్ దర్శకత్వం వహించిన సూపర్‌న్యాచురల్ థ్రిల్లర్ 'అబ్సెషన్' బాక్సాఫీస్ దగ్గర పెద్ద సర్‌ప్రైజ్ ఇచ్చింది. ప్రపంచవ్యాప్తంగా 370 మిలియన్లకు పైగా వసూలు చేసి రికార్డు సృష్టించింది. ఇప్పుడు ఈ బ్లాక్‌బస్టర్ హారర్ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. ప్రైమ్ వీడియో, ఆపిల్ టీవీ ప్లాట్‌ఫామ్‌లలో మూవీ ఉంది. కానీ ట్విస్ట్ ఏంటంటే.. ఈ సినిమాను ఫ్రీగా చూసే అవకాశం లేదు. మూవీను అద్దెకు తీసుకోవచ్చు లేదా కొనుగోలు చేయొచ్చు.
25
అబ్సెషన్ మూవీని కొనాలంటే..?
ప్రముఖ మీడియా సంస్థ 'వెరైటీ' కథనం ప్రకారం, ఈ సినిమాను కొనుగోలు చేయాలంటే 24.99 (సుమారు 2,085 రూపాయలు) డాలర్లు అద్దెకు తీసుకోవాలంటే 19.99 డాలర్లు (సుమారు 1,670 రూపాయలు) చెల్లించాలి. ఈ డిజిటల్ రిలీజ్‌తో పాటు, సినిమా మేకింగ్ వీడియోలు, డైరెక్టర్ కరి బార్కర్ కామెంటరీ లాంటి బోనస్ కంటెంట్ కూడా అందిస్తున్నారు.
35
బాక్సాఫీస్ దగ్గర ఎంత వసూలు చేసిందంటే?
ఈ సినిమాకు సంబంధించిన డీవీడీ, బ్లూ-రే, 4K UHD వెర్షన్లను జూలై 14న మార్కెట్లోకి విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. అంతేకాకుండా, త్వరలోనే ఈ సినిమా 'పీకాక్' స్ట్రీమింగ్ సర్వీస్‌లో కూడా అందుబాటులోకి వస్తుందని అంచనా వేస్తున్నారు. 'ఫోకస్ ఫీచర్స్' సంస్థ మే 15న 'అబ్సెషన్' సినిమాను థియేటర్లలో రిలీజ్ చేసింది. ఇది ఊహించని విధంగా భారీ విజయం సాధించింది. ప్రపంచవ్యాప్తంగా $370 మిలియన్లకు పైగా కలెక్ట్ చేసి, 'ఫోకస్ ఫీచర్స్' చరిత్రలోనే అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా నిలిచింది.
26 ఏళ్ల అతి చిన్న వయసున్న యూట్యూబర్ అయిన కరి బార్కర్ ఈ సినిమాకు కథ రాసి, దర్శకత్వం వహించారు. బేర్ (మైకెల్ జాన్‌స్టన్) అనే కుర్రాడు, తాను ఇష్టపడే అమ్మాయి తనను ప్రేమించేలా చేయడానికి 'వన్ విష్ విల్లో' అనే ఓ మ్యాజికల్ వస్తువును వాడతాడు. కానీ, అతని కోరిక కాస్తా బెడిసికొట్టి, భయంకరమైన మలుపు తీసుకుంటుంది. అతని క్రష్ నిక్కీ (ఇండే నవరెట్టె) అతనికి ప్రమాదకరంగా అతుక్కుపోతుంది. ఆ తర్వాత ఏం జరిగిందనేదే సినిమా కథ అని 'వెరైటీ' వివరించింది. ఈ చిత్రంలో కూపర్ టామ్లిన్‌సన్, మేగన్, ఆండీ రిక్టర్ కూడా కీలక పాత్రల్లో నటించారు.
55
భారీ విజయానికి కారణం ఏంటి?
రిపోర్టుల ప్రకారం, ఈ సినిమాను కేవలం 750,000 డాలర్ల బడ్జెట్‌తో నిర్మించారు. టొరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లోని 'మిడ్‌నైట్' విభాగంలో సినిమాను ప్రదర్శించిన తర్వాత, 'ఫోకస్ ఫీచర్స్' సంస్థ 15 మిలియన్ డాలర్లకు పైగా చెల్లించి హక్కులను కొనుగోలు చేసిందని 'డెడ్‌లైన్' వెల్లడించింది. యూట్యూబ్ క్రియేటర్ కరి బార్కర్ తొలిసారి దర్శకత్వం వహించిన ఈ చిత్రం, SXSW సహా పలు ఫిలిం ఫెస్టివల్స్‌లో ప్రదర్శితమైంది. అక్కడి నుంచి వచ్చిన పాజిటివ్ టాక్‌తో సినిమాపై అంచనాలు పెరిగాయి. ముఖ్యంగా మౌత్ టాక్ బలంగా ఉండటంతో, అన్ని వయసుల ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కట్టారు.