సెల్ఫీ పిక్స్ తో మాలయాళీ భామ కవ్వింపు చర్యలు.. లిప్స్ అందాలతో మైమరిపిస్తున్న మాళవిక మోహనన్..

First Published | Apr 30, 2023, 1:58 PM IST

మలయాళీ భామ మాళవికా మోహనన్ (Malavika Mohanan) తన క్యూట్ సెల్ఫీలతో ఆకట్టుకుంటోంది. ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా కనిపించే ఈ ముద్దుగుమ్మ లేటెస్ట్ పిక్స్ తో ఆకట్టుకుంటోంది. 
 

తమిళ చిత్రాలతో మలయాళీ ముద్దుగుమ్మ మాళవికా మోహనన్ మంచి గుర్తింపు దక్కించుకుంది. తమిళ స్టార్ విజయ్ దళపతి సరసన ‘మాస్టర్’లో నటించి మెప్పించింది. ఈ చిత్రం తెలుగులోనూ డబ్డ్ వెర్షన్ లో రిలీజై ఆకట్టుకుంది. దీంతో మాళవికకు ఇక్కడాక్రేజ్ దక్కింది.
 

త్వరలో టాలీవుడ్ ఎంట్రీ కూడా ఇవ్వబోతున్నట్టు తెలుస్తోంది. గతంలో తన అభిమానులతో నెట్టింట చిట్ చాట్ చేసిన ఈ ముద్దుగుమ్మ తన మనస్సులోని మాటను వెళ్లడించిన విషయం తెలిసిందే.  తెలుగు స్టార్స్ సరసన నటించేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలియజేసింది.


ఈ క్రమంలో మాళవికా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సరసన నటించే ఛాన్స్ దక్కించుకున్నట్టు టాక్. ప్రభాస్ - మారుతీ కాంబోలో వస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ లో మాళవికకు అవకాశం దక్కిందని అంటున్నారు.  దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన ఇంకా రాలేదు. ఇదే నిజమైతే ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్ ఎంట్రీ అదిరిపోనుంది.

ఇదిలా ఉంటే.. మాళవికా ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా కనిపిస్తూనే ఉంటుంది. తన సినిమాల గురించి, వ్యక్తిగత విషయాల గురించి ఎప్పటికప్పుడు ఫ్యాన్స్ కు అప్డేట్స్ ఇస్తూ ఉంటుంది. ఈ క్రమంలో గ్లామర్ మెరుపులు కూడా మెరిపిస్తుంటుంది. తన అందంతో మైమరిపిస్తుంటుంది.

అదిరిపోయే అవుట్ ఫిట్లలో దర్శనమిస్తూ ఆకట్టుకునే మలయాళీ బ్యూటీ తాజాగా క్యూట్ సెల్ఫీలతో ఆకట్టుకుంది. క్యాజువల్ లుక్ లో మెరిసిన మాళవిక తన నేచురల్ బ్యూటీతో ఆకట్టుకుంది. క్లోజప్ లో మరింత అందంగా కనిపించి మంత్రముగ్దులను చేసింది. లిప్స్ అందాలతో మైమరిపించింది.

తాజాగా  మాళవికా పంచుకున్న ఫొటోలను  ఫ్యాన్స్ తో పాటు నెటిజన్లు లైక్స్, కామెంట్లతో వైరల్ చేస్తున్నారు.  నేచురల్ బ్యూటీ అంటూ కూడా కామెంట్లు పెడుతూ ఆకాశానికి ఎత్తుతున్నారు. ఇక మాళవికా ప్రస్తుతం తమిళ స్టార్ చియాన్ విక్రమ్ సరసన  ‘తంగలన్’లో నటిస్తోంది. అలాగే హిందీలో ‘యుద్ర చిత్రంతోనూ అలరించబోతోంది.  

Latest Videos

click me!