ఎన్టీఆర్ భార్య లక్ష్మి ప్రణతిని ఎంత గౌరవిస్తారో... ఎలాంటి గిఫ్ట్స్ తో సర్ ప్రైజ్ చేస్తారో తెలిసిందే. అయితే తన భార్యను ఎలా పిలుస్తారో చాలా మందికి తెలియదు. ఆ విషయం తాజాగా తెలిసిపోయింది.
ఎన్టీఆర్ - లక్ష్మి ప్రణతిల వివాహం 2011లో గ్రాండ్ గా జరిగిన విషయం తెలిసిందే. ఇండస్ట్రీలో వైభవంగా జరిగిన పెళ్లి వేడుకల్లో వీరిది కూడా ఒకటి. ఇద్దరు కొడుకులు అభయ్ రామ్, భార్గవ్ రామ్ ఉన్నారు.
36
ఇదిలా ఉంటే.. భార్య లక్ష్మి ప్రణతికి ఎన్టీఆర్ అప్పుడప్పుడు సర్ ప్రైజ్ లు ఇస్తూనే ఉంటారు. ఇక ఆమె పుట్టిన రోజు మాత్రం సాలిడ్ గా అప్డేట్స్, బిగ్ గిఫ్ట్స్ ఇస్తూ ఆశ్చర్యపరుస్తుంటారు. ఈ క్రమంలో మరో ఇంట్రెస్టింగ్ విషయాన్ని రివీల్ చేశారు.
46
ఇటీవల మార్చి 26న లక్ష్మి ప్రణతి పుట్టిన రోజు కాగా.. ఎన్టీఆర్ తన భార్యను విష్ చేశారు. అంతే కాదు ముద్దుగా ఏమని పిలుస్తారో కూడా చెప్పారు. ప్రణతిని ఎన్టీఆర్ క్యూట్ గా ‘అమ్ములు’ అని పిలుచుకుంటారంట. ఇంట్లో ఆమె ముద్దుపేరు ఇదేనని చెప్పడం ఆసక్తికరంగా మారింది.
56
తారక్ ఏమాత్రం సమయం దొరికినా ఫ్యామిలీతో గడుపుతుంటారు. ప్రస్తుతం ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో ‘దేవర’ (Devara), బాలీవుడ్ లో ‘వార్ 2’(War 2)లో నటిస్తూ బిజీగా ఉన్నాయి. అయినా వీలైనప్పుడల్లా కుటుంబంతో వేకేషన్ కు వెళ్తూనే ఉన్నారు.
66
ఇదిలా ఉంటే.. ఎన్టీఆర్ - కొరటాల శివ కాంబోలో వస్తున్న బిగ్ ప్రాజెక్ట్ Devara Part 1పై తారా స్థాయి అంచనాలు ఉన్నాయి. సెప్టెంబర్ 10న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కాబోతోంది. జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్ర పోషిస్తున్నారు. అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు.