నటుడు డేనియల్ బాలాజీ హఠాన్మరణం (Deniel Balaji Death) అందరినీ బాధిస్తోంది. అయితే ఆయన వ్యక్తిగత విషయాలు బయటికి వస్తున్నాయి. ఇప్పటికీ ఆయన పెళ్లి చేసుకోకపోవడం ఆసక్తికరంగా మారింది.
కోలీవుడ్ నటుడు, తెలుగు ప్రేక్షకుల్లో బాగా గుర్తింపు తెచ్చుకున్న డేనియల్ బాలాజీ (Daniel Balaji) కన్నుమూసిన విషయం తెలిసిందే. ఈ విషాద ఘటనతో సినీ ప్రముఖులు చింతిస్తున్నారు.
26
48 ఏళ్ల వయస్సులో మరణించడం అందరినీ బాధిస్తోంది. శుక్రవారం అర్ధరాత్రి గుండెపోటుకు గురయ్యారు. చెన్నైలోని ఓ ఆస్పత్రికి తరలించే క్రమంలోనే ఆయన కన్నుమూశారు.
36
ఆయన మరణ వార్తను కుటుంబ సభ్యులే ధృవీకరించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని అభిమానులు, సినీ ప్రముఖులు, కోలీవుడ్ సినీ లోకం సోషల్ మీడియాలో నివాళి అర్పిస్తోంది.
46
అయితే... ఆయన మరణం తర్వాత వ్యక్తిగత విషయాలను బయటికి వస్తున్నాయి. ఈ క్రమంలో ఇప్పటి వరకు డేనియల్ బాలాజీ పెళ్లి చేసుకోకపోవడం ఆసక్తికరంగా మారింది. ఇంతకీ ఆయన ఎందుకు పెళ్లి చేసుకోలేదో ఇప్పుడు బయటి పడింది.
56
25 ఏళ్ల వయస్సులో ఉన్నప్పుడే డేనియల్ పెళ్లి చేసుకోకూడదని నిర్ణయించుకున్నారంట. ఆయన కుటుంబంలో మొత్తం ఐదుగురు అన్నలు, ఐదుగురు అక్కాచెళ్లెలు ఉండటం.. వారు పెళ్లాయ్యా ఇబ్బందులు పడటమే దగ్గరుండి చూశారంట.
66
దాంతో ఆయన పెళ్లి చేసుకోకూడదని నిర్ణయించుకున్నారంట. 25 ఏళ్లప్పుడే వాళ్ల అమ్మకు కూడా డేనియల్ చెప్పారంట. చివరికి ఆ మాటమీదనే ఉన్నారాయన. ఇక డేనియల్ తెలుగులో ‘సాంబ’, ‘ఘర్షణ’, ‘చిరుత’, చివరిగా నాని ‘టక్ జగదీష్’ చిత్రంలో కనిపించారు.