యంగ్ ఎన్టీఆర్ ఎంత బిజీగా ఉన్నా తన ఫ్యామిలీకి సమయం కేటాయిస్తారు. భార్య, పిల్లలు అంటే తారక్ కి ప్రాణం. ఎన్టీఆర్ సతీమణి లక్ష్మి ప్రణతి పెద్దగా మీడియాకి కనిపించరు. కానీ ఎన్టీఆర్ బిజీగా ఉంటే పిల్లల బాధ్యత చూసుకునేది లక్ష్మీ ప్రణతే. ప్రణతి ఎన్టీఆర్ తో కలసి ఎప్పుడు కనిపించినా చాలా సింపుల్ గా ఉంటుంది. హంగులు ఆర్భాటాలు లేకుండా కనిపిస్తుంది.