`వార్‌ 2` తెలుగు హక్కులు నాగవంశీకి, ఎన్ని కోట్లకు తీసుకున్నారో తెలుసా? చాలా పెద్ద రిస్క్‌

Published : Jul 05, 2025, 01:39 PM IST

ఎన్టీఆర్, హృతిక్‌ రోషన్‌ కలిసి నటిస్తోన్న `వార్‌ 2` మూవీకి తెలుగు రైట్స్ ని నిర్మాత నాగవంశీ సొంతం చేసుకున్నారు. తాజాగా ఆయనే ఈ విషయాన్ని ప్రకటించారు. ఓ వీడియోని విడుదల చేశారు. 

PREV
15
ఎన్టీఆర్, హృతిక్‌లపై `వార్‌ 2` డాన్స్ షూటింగ్‌

ఎన్టీఆర్‌ బాలీవుడ్‌లోకి అడుగుపెడుతూ నటించిన తొలి చిత్రం `వార్‌ 2`. హృతిక్‌ రోషన్‌ మరో హీరోగా నటించిన ఈ మూవీ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్‌ వర్క్ జరుపుకుంటోంది. 

తాజాగా ఎన్టీఆర్‌, హృతిక్‌ రోషన్‌పై పాటని చిత్రీకరిస్తున్నారు. ముంబయిలో ఈ షూట్‌ జరుగుతుంది. ఈ పాట సినిమాకే హైలైట్‌గా నిలుస్తుందని, ఇందులో ఎన్టీఆర్‌తోపాటు హృతిక్‌ కూడా డాన్స్ చేస్తున్నారని తెలుస్తోంది. 

ఇప్పటి వరకు ఇండియన్‌ మూవీస్‌లోనే చూడనటువంటి పాట ఇది అని, `ఆర్‌ఆర్‌ఆర్‌`లోని నాటు నాటుని మించి ప్లాన్‌ దీన్ని చేస్తున్నట్టు సమాచారం. డాన్సులు హైలైట్‌గా నిలుస్తాయని అంటున్నారు.

25
టీజర్‌తో `వార్‌ 2`పై భారీ అంచనాలు

అయాన్‌ ముఖర్జీ దర్శకత్వంలో రూపొందుతున్న `వార్‌ 2` చిత్రాన్ని యష్‌ రాజ్‌ ఫిల్మ్స్ నిర్మిస్తోంది. భారీ బడ్జెట్‌తో దీన్ని తెరకెక్కిస్తున్నారు. యాష్‌రాజ్‌ స్పై యూనివర్స్ లో భాగంగా వస్తోన్న చిత్రమిది. 

ఇటీవలే ఎన్టీఆర్‌ పుట్టిన రోజు సందర్భంగా టీజర్‌ విడుదల చేశారు. భారీ యాక్షన్‌ అడ్వెంచరస్‌గా మూవీ రూపొందుతుందని ఈ టీజర్‌ చూస్తే అర్థమయ్యింది. ఇందులో `రా` ఏజెంట్‌గా ఎన్టీఆర్‌ కనిపిస్తున్నారు. 

హృతిక్‌ రోషన్‌ మాజీ ఏజెంట్‌గా కనిపించారు. హృతిక్‌ `రా`ని వదిలేసి నెగటివ్‌ యాక్టివిటీస్‌ చేస్తున్న నేపథ్యంలో  ఆయన్ని ఎదుర్కొనేందుకు ఎన్టీఆర్‌ రంగంలోకి దిగడం, వీరిద్దరి మధ్య పోరాటాలే మూవీ కథ అని తెలుస్తోంది.

35
`వార్‌ 2` తెలుగు థియేటర్‌ హక్కులు నాగవంశీకి

విడుదలైన `వార్‌ 2` టీజర్‌ అంచనాలను అమాంతం పెంచేసింది. యాక్షన్‌ ఎపిసోడ్లు అదిరిపోయాయి. తారక్‌, హృతిక్‌ ఢీ అంటే ఢీ అనే సీన్లు వాహ్‌ అనిపించాయి. దీంతో సినిమాపై అంచనాలు కూడా భారీగా ఏర్పడ్డాయి.

 అది సినిమా బిజినెస్‌పై భారీ హైప్‌ని పెంచేసింది. ఈ మూవీ బిజినెస్‌ లెక్కలు ఇప్పుడు షాకిస్తున్నాయి. ఈ క్రమంలో `వార్‌ 2` తెలుగు రైట్స్ నిర్మాత నాగవంశీ దక్కించుకోవడం విశేషం. 

తన సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై ఈ మూవీని విడుదల చేస్తున్నట్టు తాజాగా అధికారికంగా ప్రకటించారు. ఎన్టీఆర్‌ నటించిన మూడు సినిమాలను వరుసగా విడుదల చేయడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు నాగవంశీ. 

గతంలో `అరవింద సమేత`, ఆ తర్వాత `దేవర` చిత్రాన్ని ఆయనే విడుదల చేశారు. ఇప్పుడు `వార్‌ 2`ని తెలంగాణ, ఆంధ్రాలో ఆయనే విడుదల చేయబోతున్నారు. హ్యాట్రిక్‌ కొట్టబోతున్నట్టు తెలిపారు.

45
`వార్‌ 2` తెలుగు థియేట్రికల్‌ రైట్స్ భారీ రేటు

అయితే ఈ తెలుగు రైట్స్ ఇప్పుడు షాకిస్తున్నాయి. నాగవంశీ ఏకంగా రూ.80కోట్లు పెట్టి నైజాం, ఆంధ్రా థియేట్రికల్‌ రైట్స్‌ దక్కించుకున్నట్టు సమాచారం. 

యష్‌రాజ్‌ ఫిల్మ్స్ వాళ్లు వంద కోట్లు డిమాండ్‌ చేశారని, ఎనభై కోట్ల వరకు సెట్‌ చేసినట్టు ప్రచారం జరుగుతుంది. అయితే వాస్తవంగా ఈ అమౌంట్‌ కంటే ఎక్కువ రేట్‌కే నాగవంశీ `వార్‌ 2` తెలుగు రైట్స్ తీసుకున్నట్టు లేటెస్ట్ సమాచారం. 

మరి ఇందులో నిజమెంతా అనేది తెలియాల్సి ఉంది. ఎనబై కోట్లు అంటే ఇది ఏకంగా తెలుగులో రూ.160కోట్లు వసూలు చేయాలి. మరి అది సాధ్యమవుతుందా? అనేది బిగ్‌ క్వచ్చన్‌. నాగవంశీ చాలా పెద్ద రిస్కే చేస్తున్నారని చెప్పొచ్చు.

55
`వార్‌ 2` తెలుగు రైట్స్ తో నాగవంశీ భారీ రిస్క్

మన తెలుగు మార్కెట్‌లో బాలీవుడ్‌ చిత్రాలు ఎప్పుడూ భారీ వసూళ్లని రాబట్టలేదు. ఏ మూవీ ఇక్కడ పెద్దగా ఆడలేదు. ఇందులో ఎన్టీఆర్‌ ఉండటంతో అది కలిసి వచ్చే అంశం. దానివల్లే ఇంత డిమాండ్‌ అనేది అందరికి తెలిసిందే. 

కానీ సబ్జెక్ట్ పరంగా ఇది మన తెలుగు ఆడియెన్స్ ని ఆకట్టుకుంటుందా? ఇలాంటి యాక్షన్‌ మూవీస్‌ని మన ఆడియెన్స్ చూస్తారా? అనేది పెద్ద ప్రశ్న. దీనికితోడు సౌత్‌లో `కూలీ` మూవీ కూడా అదే రోజు విడుదల కానుంది.

రజనీకాంత్‌, నాగార్జున వంటి భారీ కాస్టింగ్‌ ఇందులో ఉంది. ఇది తెలుగుకి బాగా కనెక్ట్ అయ్యే సబ్జెక్ట్. కావున ఇంతటి పోటీ మధ్య `వార్‌ 2` తెలుగు హక్కులను ఇంతటి భారీ అమౌంట్‌కి కొనడం విషయంలోనే నాగవంశీ రిస్క్ చేశారని చెప్పొచ్చు. ఇక ఈ మూవీని స్వాతంత్య్ర దినోత్సవ కానుకగా ఆగస్ట్ 14న విడుదల కానుంది.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories