వెంకటేష్‌తో నటించిన `జయం మనదేరా` సినిమా షూటింగ్ కోసం స్విట్జర్లాండ్‌కి వెళ్లారట. అక్కడకి సౌందర్య అమ్మ రాలేదు. సెట్‌లో సీనియర్ నటి నిర్మల ఉన్నారు.
దీంతో ఆమెతో క్లోజ్‌గా మూవ్ అయ్యారట సౌందర్య. ఆ సమయంలోనే లోలోపల పాట పడుతూ జాలీగా కనిపించారట. ఏ దొంగ ఏదో రహస్యం దాస్తున్నారని అడగ్గా, అసలు విషయాన్ని బయటపెట్టిందట సౌందర్య.
అప్పుడు తన ప్రేమ విషయాన్ని బయటపెట్టిందట. తాను ప్రేమిస్తున్నది ఎవరో కాదు, తన మేనమామనే అని చెప్పిందట. అమ్మ తమ్ముడితోనే ప్రేమలో ఉందట.
అంతేకాదు సౌందర్యలో చాలా డ్రీమ్స్ ఉన్నాయట. పిల్లలు కనడం, లైఫ్ ని ఎలా లీడ్ చేయాలి వంటివన్నీ నటి నిర్మలతో సౌందర్య చర్చించిందట.
ఆమె జీవితంపై ఎన్నో ఆశలు పెట్టుకుందని, కానీ అంతలోనే విషాదం చోటు చేసుకుందని తెలిపింది నటి నిర్మల. ఐడ్రీమ్‌కిచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఈ విషయాన్ని పంచుకుంది.