ఎన్టీఆర్‌ రీమేక్‌ చేయాలనుకున్న అమితాబ్‌ మూవీస్‌ ఏంటో తెలుసా? టాలీవుడ్‌లో బిగ్‌ బీ అవ్వాలనుకుంటున్నాడా?

Published : May 12, 2025, 08:34 PM IST

ఎన్టీఆర్‌ రీమేక్‌ చేయాల్సి వస్తే అమితాబ్‌ బచ్చన్‌ నటించిన మూవీస్‌ రీమేక్‌ చేయాలని ఉందన్నారు. అంతేకాదు తాను తెలుగులో బిగ్‌ బీలా పేరు తెచ్చుకోవాలని ఉందని వెల్లడించారు.   

PREV
15
ఎన్టీఆర్‌ రీమేక్‌ చేయాలనుకున్న అమితాబ్‌ మూవీస్‌ ఏంటో తెలుసా? టాలీవుడ్‌లో బిగ్‌ బీ అవ్వాలనుకుంటున్నాడా?
NTR, SS Rajamouli, Devara

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ తన కెరీర్‌లో ఇప్పటి వరకు రీమేక్‌ చేయలేదు. కాకపోతే ఒకటి రెండు సినిమాల విషయంలో పోలికలు వినిపించాయి. ఓ రకంగా చెప్పాలంటే రీమేక్‌ చేయని హీరోగా ఎన్టీఆర్‌ నిలిచారు. చాలా వరకు స్ట్రెయిట్‌ మూవీస్‌తోనే రాణించారు. సక్సెస్‌ రేట్‌ యావరేజ్‌గా ఉన్నా తన ఇమేజ్‌ని పెంచడంలో ఆయా మూవీస్‌ దోహదపడ్డాయి. 

25

ఇదిలా ఉంటే ఎన్టీఆర్‌కి ఓ బాలీవుడ్‌ మూవీస్‌ రీమేక్‌ చేయాలని ఉందట. బాలీవుడ్‌ లో అమితాబ్‌ బచ్చన్‌ నటించిన చిత్రాన్ని తాను రీమేక్‌ చేయాలని ఉందని ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. అందులో అమితాబ్‌ మూడు పాత్రలు పోషించారు. అలాంటి సినిమా తాను చేయాలని ఉందని చెప్పారు తారక్‌. 

35
mahaan movie

మరి ఆ హిందీ మూవీ ఏంటనేది చూస్తే, బిగ్‌ బీ నటించిన సూపర్‌ హిట్‌ మూవీ `మహాన్‌`. 1983లో వచ్చిన ఈ యాక్షన్‌ థ్రిల్లర్‌ చిత్రానికి ఎస్‌ రామనాథన్‌ దర్శకత్వం వహించారు. ఇందులో పర్వీన్‌ బేబీ, జీనత్‌ అమన్‌ హీరోయిన్లుగా నటించారు. ఇందుతో తండ్రిగా కొడుకులుగా అమితాబ్‌ త్రిపాత్రాభినయం చేశారు. ఆడియెన్స్ ని ఉర్రూతలూగించారు. ఇందులో అమితాబ్‌ లా తాను కూడా త్రిపాత్రాభినయం చేయాలని ఉందన్నారు తారక్‌. 
 

45
deewaar movie

అంతేకాదు దీనితోపాటు మరో అమితాబ్‌ మూవీ `దీవార్‌`ని కూడా రీమేక్‌ చేయాలని ఉందని, తెలుగులో మరే హీరోతోనైనా ఈ మూవీ చేయడానికి తాను రెడీనే అన్నారు. తాను కూడా తెలుగులో అమితాబ్‌ లా పేరు తెచ్చుకోవాలని ఉందని వెల్లడించారు తారక్‌. రమ్యకృష్ణన్‌కి గతంలో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెల్లడించారు. `జై లవకుశ`లో ఎన్టీఆర్‌ త్రిపాత్రాభినయం చేసిన విషయం తెలిసిందే. 
 

55

ప్రస్తుతం తారక్‌.. ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో `డ్రాగన్‌` చిత్రంలో నటిస్తున్నారు. దీంతోపాటు హిందీలో నటించిన `వార్‌ 2` ఆగస్ట్ లో విడుదల కావాల్సి ఉంది. మరోవైపు త్వరలోనే `దేవర 2` చిత్రాన్ని ప్రారంభించే అవకాశం ఉంది. 
 

About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!