NTR with Balayya: బాలయ్య బాబాయ్‌తో మల్టీస్టారర్‌ చేస్తా .. రాజమౌళి ముందే ఓపెన్‌గా చెప్పిన ఎన్టీఆర్‌..

Published : Mar 15, 2022, 03:57 PM ISTUpdated : Mar 16, 2022, 09:17 AM IST

`ఆర్‌ఆర్‌ఆర్‌` స్టార్‌, యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ మల్టీస్టారర్లపై షాకింగ్‌ కామెంట్స్ చేశారు. బాలయ్య బాబాయ్‌తో మల్టీస్టారర్‌ మూవీపై స్పందించారు. అంతేకాదు ప్రభాస్‌, బన్నీ, చిరంజీవిలతో మల్టీస్టారర్‌లపై చేసిన వ్యాఖ్యలు వైరల్‌ అవుతున్నాయి.   

PREV
16
NTR with Balayya: బాలయ్య బాబాయ్‌తో మల్టీస్టారర్‌ చేస్తా .. రాజమౌళి ముందే ఓపెన్‌గా చెప్పిన ఎన్టీఆర్‌..

రాజమౌళి(Rajamouli) దర్శకత్వంలో ఎన్టీఆర్‌(NTR), రామ్‌చరణ్‌(Ram Charan) కలిసి నటించిన చిత్రం `ఆర్‌ఆర్‌ఆర్‌`(RRR Movie). ఈ భారీ మల్టీస్టారర్‌ మూవీ మార్చి 25న విడుదల కానుంది. ఇప్పటికే నాలుగు సార్లు వాయిదా పడ్డ ఈ సినిమా ఎట్టకేలకు ఈ నెల 25న ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల కాబోతుంది. సంక్రాంతికి సినిమా విడుదల కాబోందని అన్ని భాషల్లోనూ ప్రమోషన్‌ కార్యక్రమాలు చేశారు. కానీ ఊహించని విధంగా సినిమా వాయిదా పడింది. ఇప్పుడు మళ్లీ ప్రమోషన్‌ కార్యక్రమాలు షురూ చేశారు. 

26

తాజాగా ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌, రాజమౌళి మంగళవారం తెలుగు మీడియాతో ఇంటరాక్ట్ అయ్యారు. ఇందులో ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. అయితే ఎన్టీఆర్‌ మల్టీస్టారర్లపై రియాక్ట్ అయ్యారు. కాస్త ఆవేశానికి గురైన ఆయన మల్టీస్టారర్‌ చిత్రాలకు కొత్త అర్థాన్ని చెప్పారు. ఇకపై మల్టీస్టారర్‌ చిత్రాలు వరుసగా వస్తూనే ఉంటాయన్నారు. ఇలాంటి చిత్రాల్లో హీరోలు తమ పాత్రల నిడివి గురించి ఆలోచిండం లేదన్నారు. అభిమానులు కూడా నిడివిని పట్టించుకోవడం మానేశారని, ఇద్దరు హీరోలని చూడాలని ఫిక్స్ అయ్యారని చెప్పారు. 
 

36

మల్టీస్టారర్‌ చిత్రాల్లో హీరో పాత్ర ప్రయారిటీ, సీన్లు తేడాలు ఒకప్పుడు ఉండేవని, ఇప్పుడు వాటిని దాటుకుని ముందుకు వచ్చారని, సినిమా లెవల్‌ మారిపోయిందన్నారు. క్రాస్‌ ఓవర్‌ చిత్రాలు వస్తున్నాయని చెప్పారు. ఎవరు ఏ భాషలోనైనా చేయొచ్చన్నారు తారక్‌. హీరోల పాత్రలు ఇలానే ఉండాలి, ఇంతే ఉండాలనే లెక్కలు ఇప్పుడు ఎవరూ పట్టించుకోవడం లేదని తెలిపారు. 

46

`బాహుబలి`, `ఆర్‌ఆర్‌ఆర్‌` వంటి చిత్రాలతో మల్టీస్టారర్‌ చిత్రాల ట్రెండ్‌ ఊపందుకుందని, ఇకపై బోలెడు చిత్రాలొస్తాయన్నారు. ఇండస్ట్రీలో ఎవరితో మల్టీస్టారర్‌ చేయాలని ఉందన్న ప్రశ్నకి ఎన్టీఆర్‌ స్పందించారు. తాను బాలయ్య(Balakrishna) బాబాయ్‌తో చేయాలనుకుంటున్నట్టు చెప్పారు. ఆయనపై తన అభిమానాన్ని తెలియకుండానే వెల్లడించారు తారక్‌. అందరు హీరోలతో తాను మల్టీస్టారర్‌ చిత్రాలను చేయాలనుకుంటున్నట్టు చెప్పారు. 
 

56

బాలయ్య బాబాయ్‌తోపాటు మహేష్‌(mahesh), ప్రభాస్‌(Prabhas), అల్లు అర్జున్‌(Allu Arjun), చిరంజీవి, నాగార్జున వంటి వారితోనూ,  తాను మున్ముందు మల్టీస్టారర్‌ సినిమాలు చేస్తానని తెలిపారు. అంతేకాదు అందరం కలిసీ ఓ సినిమా చేయాలనుకుంటున్నట్టు చెప్పారు యంగ్‌ టైగర్‌. రాజమౌళి ముందే ఈ విషయాన్ని తారక్‌ వెల్లడించడం విశేషం. అలాగే రామ్‌చరణ్‌ సైతం ఇలాంటి అభిప్రాయాన్నే వెల్లడించారు. తాను కూడా అందరితో చేయాలనుకుంటున్నట్టు తెలిపారు. అయితే వీటన్నింటికి డైరెక్టర్‌ పేరు నాది అని రాజమౌళి విసిరిన పంచ్‌ నవ్వులు పూయించింది. 

66

ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ హీరోలుగా, అల్లూరి సీతారామరాజు, కొమురంభీమ్‌ పాత్రల ప్రధానంగా ఫిక్షన్‌ కథతో రాజమౌళి రూపొందించిన చిత్రం `ఆర్‌ఆర్‌ఆర్‌`. డివివి దానయ్య నిర్మించారు. అలియాభట్‌, బ్రిటీష్‌ నటి ఒలివియా మోర్రీస్‌ కథానాయికలుగా, అజయ్‌ దేవగన్‌, శ్రియా, సముద్రఖని కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా వచ్చే శుక్రవారం ఆడియెన్స్ ముందు సందడి చేయబోతుంది.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories