ఫ్యామిలీపై మళ్లీ రెచ్చిపోయిన మంచు మనోజ్‌.. తొక్కుదామనుకుంటున్నది వాళ్లేనా?

Published : Feb 14, 2025, 08:15 PM IST

Manchu Manoj Comments: మంచు మనోజ్‌ మరోసారి సంచలన కామెంట్స్ చేశారు. ఇటీవల తన ఫ్యామిలీ విషయంలో హాట్‌ కామెంట్స్ చేస్తూ వచ్చినా ఆయన తనని తొక్కేయాలని చూస్తున్నారంటూ షాకింగ్‌ కామెంట్స్ చేశారు.   

PREV
12
ఫ్యామిలీపై మళ్లీ రెచ్చిపోయిన మంచు మనోజ్‌.. తొక్కుదామనుకుంటున్నది వాళ్లేనా?
manchu manoj

Manchu Manoj Comments: మంచు ఫ్యామిలీ వివాదం ఆ మధ్య పెద్ద రచ్చ అయిన విషయం తెలిసిందే. టాలీవుడ్‌లో పెద్ద హాట్‌ టాపిక్‌గా మారింది. మంచు మనోజ్‌ ఒక వైపు.. మంచు విష్ణు, మోహన్‌ బాబు మరో వైపుగా గొడవలు పడుతున్నారు. మంచు మనోజ్‌ చేసే పనులు సరైనవి కావు అని, తాగి ఇంటికి వచ్చి గొడవ చేస్తున్నాడని, ఎంతో నమ్మానని, ఇలా చేయడం సరికాదని మోహన్‌బాబు అంటున్నారు.

మోహన్‌బాబు యూనివర్సిటీ, శ్రీ విద్యానికేతన్‌ ఎడ్యూకేషన్‌ ఇనిస్టిట్యూట్‌ వద్ద ఇతర స్టూడెంట్స్ ని మోహన్‌బాబు వాళ్లు ఇబ్బంది పెడుతున్నారని మనోజ్‌ గొడవ చేస్తున్నారు. వాటిలో అవకతవకలు జరుగుతున్నాయంటున్నారు.  

అంతేకాదు తన ఇంట్లోకి రావద్దని మోహన్‌బాబు అంటున్నారు. మనోజ్‌ మౌనికా రెడ్డిని పెళ్లి చేసుకోవడం వాళ్లకి నచ్చలేదని, అందుకే ఈ గొడవలకు కారణమనే పుకార్లు వినిపిస్తున్నాయి. మొత్తంగా ఈ వివాదం నడుస్తూనే ఉంది. అయితే ఇటీవల అందరు సైలెంట్‌ కావడంతో వివాదం సమసిపోయిందని భావిస్తున్న తరుణంలో మంచు మనోజ్‌ ఇప్పుడు మరోసారి రెచ్చిపోయారు.

అగ్గిరాజేశాడు. ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. తనని తొక్కేసేందుకు ప్రయత్నిస్తున్నారని, నాలుగు గోడల మధ్యకు రానివ్వడం లేదంటూ ఆరోపణలు చేశారు.

`నాకు జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా, ఎంత మంది తొక్కాలని చూసినా, బురద చల్లాలని చూసినా, ఆ నాలుగు గోడల మధ్యకు రానీవ్వకపోయినా, నన్ను ఏం చేసినా ప్రజల గుండెల్లో నుంచి నన్ను తీయలేరని నేను గట్టిగా నమ్ముతాను, మీరే నా దేవుళ్లు(అభిమానులు), మీరే నా కుటుంబం, మీరే నాకు అన్నీ. చెట్టు పేరు, జాతీ పేరు చెప్పుకొని మార్కెట్లో అమ్ముడుపోవడానిక నేను కాయో, పండునో కాదు, మీ మనోజ్‌ని.

నన్ను తొక్కుదామని చూస్తారా? నలపుదామని చూస్తారా? నన్ను తొక్కాలన్నా, లేపాలన్నా, అభిమానుల వల్లే అవుతుంది. ఎవడి వల్ల కాదు, ఈ ప్రపంచంలో ఓ కాజ్‌ కోసం నిలబడ్డప్పుడు, న్యాయం జరిగే వరకు అది వదిలిపెట్టేది లేదు. అది బయటివాళ్లైనా, నా వాళ్లైనా సరే, న్యాయం కోసం ఎంత దూరమైనా వెళ్తాను.

నా స్టూడెంట్స్ కోసం నిలబడ్డాను, నా ప్రాణం ఉన్నంత వరకు నిలడతాను, ఈ రోజుకాదు, నన్ను ఎప్పటికీ ఆపలేరు` అంటూ సంచలన కామెంట్స్ చేశారు మనోజ్‌. ప్రస్తుతం మనోజ్‌ వ్యాఖ్యలు వైరల్‌ అవుతున్నాయి. అయితే ఆయన తన ఫ్యామిలీని ఉద్దేశించే ఈ వ్యాఖ్యలు చేశారని అర్థమవుతుంది. 
 

22
manchu manoj

మనోజ్‌ `జగన్నాథ్‌` అనే సినిమా ఈవెంట్‌కి గెస్ట్ గా వెళ్లారు. భరత్‌ ఫిల్మ్ ఫ్యాక్టరీ పతాకంపై భరత్‌, సంతోష్‌ దర్శకత్వంలో పీలం పురుషోత్తమ్‌ ఈ సినిమాని నిర్మించారు. రాయలసీమ భరత్‌, ప్రీతి జంటగా ఇందులో నటించారు. ఈ మూవీ టీజర్‌, పోస్టర్‌ ని  గెస్ట్ గా వచ్చిన మనోజ్‌ విడుదల చేశారు. అన్నమయ్య జిల్లాలోని రాయచోటిలో ఈ వేడుక ఘనంగా జరిగింది. ఇందులో జబర్దస్త్ కమెడియన్లు అప్పారావు, వినోదిని, గడ్డం నవీన్‌ పాల్గొని ఎంటర్‌టైన్‌ చేశారు. 

సినిమా గురించి మంచు మనోజ్ మాట్లాడుతూ, 'జగన్నాథ్' మూవీ టీజ‌ర్ చాలా అద్భుతంగా ఉంది. త‌మ్ముడు 'రాయ‌ల‌సీమ' భర‌త్ చేసిన ఫ‌స్ట్  మూవీ అయిన‌ప్ప‌టికీ ఎంతో ప్రొఫెష‌న‌ల్‌గా చేశాడు. చిత్ర‌యూనిట్‌లో ప్ర‌తి ఒక్క‌రి క‌ష్టం క‌నిపిస్తోంది. భర‌త్ ఫ్రెండ్స్ అంతా ముందుకు వ‌చ్చి ఈ సినిమా నిర్మాణంలో పాలుపంచుకోవ‌డం చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది.

ఈ రోజుల్లో సినిమా తీయ‌డం అంత ఈజీ కాదు. అలాంటి ప‌రిస్థితుల్లో ఎంతో ఫ్యాష‌న్‌తో ఈ సినిమా తీశారు. కోటి రూపాయ‌ల‌తో తీసిన‌ సినిమా చిన్న‌ది, వెయ్యి కోట్ల‌తో తీసింది పెద్ద సినిమా అన‌డానికి లేదు. ఏదైనా సినిమానే. కాక‌పోతే, బాగుందా? బాగాలేదా? అనేదే ఉంటుంది. ఈ సినిమా 'జగన్నాథ్' మూవీ హిట్ కావాల‌ని మ‌న‌స్పూర్తిగా కోరుకుంటున్నా` అని చెప్పారు మనోజ్‌.
 
హీరో రాయ‌ల‌సీమ‌ భరత్ మాట్లాడుతూ, `మంచు మనోజ్ అన్న మంచి మ‌నసున్న వ్య‌క్తి.  'జగన్నాథ్' మూవీ వేడుక కోసం ఆయ‌న స్వ‌చ్ఛందంగా వ‌చ్చారు. నిజంగా గ్రేట్ ప‌ర్స‌న్. సినిమాల మీద ఇష్టంతో ఎంతో క‌ష్ట‌ప‌డి ఇండ‌స్ట్రీకి వ‌చ్చాను. నిరంత‌రం ప‌ని చేస్తూ 5 సంవ‌త్స‌రాల శ్ర‌మ‌తో 'జగన్నాథ్' మూవీని పూర్తి చేశాము. ఈ ఐదేళ్లు వెంకీ, చైతూ.. నా వెంటే ఉంటూ సొంత త‌మ్ముళ్ల మాదిరిగా క‌ష్టాలు పంచుకున్నారు. స‌పోర్టుగా నిలిచిన క‌దిరి భాష‌కు థ్యాంక్యూ. సినిమా బాగా వ‌చ్చింది` అని చెప్పారు.  

read more: సాయిపల్లవి కొరియోగ్రఫీ చేసిన సాంగ్స్ ఏంటో తెలుసా? కుర్రాళ్లని ఊపేసిన డాన్స్ అది.. అస్సలు ఊహించరు

also read: ఎన్టీఆర్‌ సినిమా డైరెక్టర్‌కి 50 కోట్ల పారితోషికం, లాభాల్లో షేర్‌, నిర్మాతలు అడ్వాన్స్ చెక్‌.. ఎవరా దర్శకుడు ?

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories