యంగ్ టైగర్ ఎన్టీఆర్ టాలెంట్స్ గురించి చెప్పాలంటే పెద్ద లిస్టే ఉంది. ఆయన సింగర్, డాన్సర్, హోస్ట్ అన్నిటికి మించి గొప్ప నటుడు. టీనేజ్ పూర్తయ్యే నాటికే స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న ఎన్టీఆర్ 19ఏళ్ల కెరీర్ లో అనేక భిన్నమైన రోల్స్ చేశారు.
యమదొంగ సినిమాలో ఎన్టీఆర్ చేసిన యంగ్ యమ రోల్ అద్భుతం అని చెప్పాలి. కుర్ర యముడిగాఎన్టీఆర్ పర్ఫెక్ట్ గా సరిపోయారు. ఇక ఆ మూవీలో యముడిగా ఎన్టీఆర్ చెప్పిన సుదీర్ఘమైన డైలాగ్తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.
మాస్ హీరోగాగుర్తింపు తెచ్చుకున్నఎన్టీఆర్ అనేక మార్లు ద్విపాత్రాభినయం చేశారు. ఈ జనరేషన్ స్టార్ హీరోల్లోడ్యూయల్ రోల్ ఎక్కువ సార్లు చేసిన రికార్డు ఎన్టీఆర్ దే. ఆంధ్రావాలా, శక్తి, అదుర్స్చిత్రాలలో ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ చేయడం జరిగింది.
ఈ తరం స్టార్ హీరోల్లో ట్రిపుల్ రోల్ చేసిన ఏకైక హీరో ఎన్టీఆర్. 2017లో విడుదలైన జైలవకుశ చిత్రంలో ఎన్టీఆర్ ట్రిపుల్ రోల్ చేశారు. బ్యాంకు మేనేజర్ గా, దొంగగా, మాఫియా లీడర్ గా మూడు భిన్న పాత్రలు చేసి ఎన్టీఆర్ మెప్పించారు.
ముఖ్యంగా మాఫియా లీడర్ రోల్ లో ఎన్టీఆర్ నట విశ్వరూపం చూపించారు. నెగెటివ్ షేడ్స్ కలిగిన ఆ పాత్రలో నత్తివాడిగాఎన్టీఆర్ డైలాగ్స్ఫ్యాన్స్ కి గూస్ బంప్స్ కలిగించాయి. రావణ పాత్రలో ఎన్టీఆర్ రెచ్చిపోయినటించారు.
దర్శకుడు బాబీ తెరకెక్కించిన ఈ చిత్రాన్ని ఎన్టీఆర్ బ్రదర్ కళ్యాణ్రామ్ స్వయంగా నిర్మించారు. సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం నిర్మాత కళ్యాణ్ రామ్ కి కాసులు కురిపించింది.
ఈ మూవీ విడుదలై నేటికి సరిగ్గా మూడేళ్లు. 2017 సెప్టెంబర్ 21న జై లవకుశ విడుదల కావడం జరిగింది. నివేదా థామస్, రాశి ఖన్నా హీరోయిన్స్ గా నటించగా, దేవిశ్రీ సంగీతం అందించారు. తమన్నాస్పెషల్ సాంగ్ లో ఎన్టీఆర్ తో ఆడిపాడింది.