దాదాపు ఆరేళ్ళ అనంతరం ఎన్టీఆర్ సోలోగా చేసిన చిత్రం దేవర. ఈ చిత్రం కోసం ఫ్యాన్స్ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. దేవర మూవీ ప్రధానంగా సముద్ర నేపథ్యంలో సాగుతుంది. దీంతో కెమెరా మెన్ బాగా కష్టపడాల్సి వచ్చింది. దేవర చిత్రానికి రత్నవేలు కెమెరా మెన్ గా పని చేశారు. ఈ క్రమంలో కొన్ని కీలక విషయాలు వెల్లడించారు.
రత్నవేలు ఓ మీడియా ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. చాలా కఠినమైన షాట్స్ దేవర చిత్రం కోసం చేయాల్సి వచ్చిందని ఆయన అన్నారు. స్క్రిప్ట్ నచ్చితేనే నేను సినిమాలకు పని చేస్తాను. నాకున్న హామీ అది. దేవర సముద్రం నేపథ్యంలో సాగే చిత్రం. కొన్ని షాట్స్ చిత్రీకరించించేందుకు చాలా కష్టపడ్డానని ఆయన అన్నారు.
దేవర మూవీలో దర్శకుడు కొరటాల శివ కోరిన విజువల్స్ ఇచ్చేందుకు చాలా సమయం పట్టిందని ఆయన అన్నారు. రోజంతా పని చేసిన ఒకటి రెండు షాట్స్ పూర్తి చేయలేకపోయామని అన్నారు. రత్నవేలు కామెంట్స్ వింటుంటే... దేవర మూవీ కోసం టీం ఏ స్థాయిలో పని చేసిందో అర్థం అవుతుంది.
దేవర సెప్టెంబర్ 27న విడుదలవుతున్న సంగతి తెలిసిందే. అర్థరాత్రి నుండి యూఎస్ లో ప్రీమియర్స్ ప్రదర్శించనున్నారు. ఇక యూఎస్ లో దేవర చిత్రానికి భారీ రెస్పాన్స్ దక్కుతుంది. హాట్ కేకుల్లా టికెట్స్ అమ్ముడుపోతున్నాయి. దేవర చిత్రానికి యూఎస్ తో పాటు ఆస్ట్రేలియాలో కూడా భారీ రెస్పాన్స్ దక్కుతుంది.
దేవర మూవీలో ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ చేస్తున్నాడు. తండ్రి కొడుకులుగా అలరించనున్నాడు. భారీ బడ్జెట్ తో దాదాపు రూ. 300 కోట్ల రూపాయలతో దేవర నిర్మించారు. ఎన్టీఆర్ కి జంటగా జాన్వీ కపూర్ నటిస్తుంది. సైఫ్ అలీ ఖాన్ ప్రధాన విలన్ రోల్ చేస్తున్నాడు.
దేవర చిత్రం నుండి రెండు ట్రైలర్స్ విడుదల చేశారు. రెండు ట్రైలర్స్ కి మంచి ఆదరణ దక్కింది. దీంతో దేవర చిత్రంపై అంచనాలు ఏర్పడ్డాయి. దర్శకుడు శివ దేవర చిత్రాన్ని రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు. కళ్యాణ్ రామ్ ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ లో దేవర చిత్రాన్ని భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు.
ఈ కాంబినేషన్ కి మరో ప్రాధాన్యత ఉంది. సీనియర్ ఎన్టీఆర్ మనవడు, శ్రీదేవి కూతురు జతకడుతోన్న చిత్రం. గతంలో ఎన్టీఆర్-శ్రీదేవి కాంబోలో అనేక బ్లాక్ బస్టర్స్ వచ్చాయి. దేవర చిత్రానికి ఇది ఓ ప్రత్యేకమైన అంశం. సౌత్ ఆడియన్స్ లో దీనిపై ఓ క్రేజ్ ఉంది.
ఏకంగా ఆరేళ్ళ తర్వాత ఎన్టీఆర్ నటించిన సోలో చిత్రం ఇది. ఎన్టీఆర్ సోలోగా నటించిన అరవింద సమేత వీర రాఘవ 2018లో విడుదలైంది. మధ్యలో ఎన్టీఆర్ ఆర్ ఆర్ ఆర్ మూవీ చేశాడు. అది మల్టీస్టారర్.
కాగా హిందీలో దేవర అడ్వాన్స్ బుకింగ్స్ ఆలస్యంగా ఓపెన్ అయ్యాయి. ఇది కూడా కాస్త ప్రభావం చూపింది. అయితే ఆర్ఆర్ఆర్ తో ఎన్టీఆర్ హిందీ ఆడియన్స్ కి పరిచయం అయ్యారు. కానీ ఇది సరిపోదు. బాహుబలి రెండు భాగాలుగా తెరకెక్కింది కాబట్టి ప్రభాస్ అక్కడ జనాల్లోకి బాగా వెళ్ళాడు.
పుష్ప చిత్రానికి కూడా ఇదే పరిస్థితి ఎదురైంది. కానీ హిందీలో మొదటి వారం తర్వాత పుష్ప పికప్ అయింది. బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇప్పుడు దేవర చిత్ర యూనిట్ కూడా హిందీ మార్కెట్ విషయంలో ఇలాంటి ఆశలే పెట్టుకుని ఉంది. పాజిటివ్ టాక్ వస్తే మాత్రం మంచి వసూళ్లు ఉంటాయి. హిందీలో దేవర చిత్రానికి కలసి వచ్చే మరో అంశం జాన్వీ కపూర్, సైఫ్ అలీ ఖాన్. వీళ్ళు కనుక మొదటి రోజు ఆడియన్స్ ని థియేటర్స్ కి తీసుకువచ్చి.. టాక్ పాజిటివ్ గా ఉంటే.. ఆ తర్వాత భారీ వసూళ్లు ఖాయం.