‘వార్2’ కోసం ఎన్టీఆర్ షాకింగ్ రెమ్యూనరేషన్? ఆ లిస్టులో చేరిపోయిన తారక్..

First Published | Apr 11, 2023, 3:44 PM IST

బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ - యంగ్ టైగర్ ఎన్టీఆర్ మల్టీస్టారర్ గా ‘వార్2’ రాబోతున్న  విషయం తెలిసిందే.  అయితే ఈ స్పైయూనివర్స్ లో నటించేందుకు తారక్ తీసుకున్న రెమ్యూనరేషన్ ఆసక్తికరంగా మారింది.
 

‘ఆర్ఆర్ఆర్’తో గ్లోబల్ స్టార్ గా క్రేజ్ దక్కించుకున్నారు యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR). వరల్డ్ వైడ్ గా తారక్ క్రేజ్ భారీగా పెరిగిపోయింది. ఈక్రమంలో ఆయన లైనప్ లోకి భారీ చిత్రాలు వచ్చి చేరుతున్నాయి. ప్రస్తుతం బిగ్ ప్రాజెక్ట్ అయిన యష్ రాజ్ ఫిల్మ్స్ స్పైయూనివర్స్ లో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తోంది.  
 

యష్ రాజ్ ఫిల్మ్స్ నిర్మిస్తున్న స్పై యూనివర్స్ లో ‘వార్’ చిత్రం ఎంతటి విజయాన్ని సాధించిందో తెలిసిందే.  హృతిక్ రోషన్ - ట్రైగర్ ష్రాఫ్ కలిసి మొదటి భాగంలో నటించగా.. War2లో మాత్రం  హృతిక్ రోషన్ - యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించబోతున్నారు. చిత్రానికి ఆయాన్ ముఖర్జీ  దర్శకత్వం వహించబోతున్నారు. 
 


‘వార్2’లో మొదట విజయ్ దేవరకొండ, ప్రభాస్ ల పేర్లు వినిపించాయి. కానీ ఆస్టార్లను కాదని ఫైనల్ గా ఎన్టీఆర్ ను ఎంపిక చేసుకున్నారంటే.. తారక్ క్రేజ్ ఏ స్థాయిలో ఉందో అర్థమవుతోంది.  అయితే అందుకు తగ్గట్టుగానే ఎన్టీఆర్ ఛార్జ్ చేయబోతున్నారని వినిపిస్తోంది.
 

హృతిక్ - ఎన్టీఆర్ సినిమా కోసం  ఏకంగా రూ.100 వరకు తీసుకుంటున్నట్టు ప్రచారం జరుగుతోంది. చివరిగా ‘ఆర్ఆర్ఆర్’కు ఎన్టీఆర్ హ్యయేస్ట్ గా రూ.45 కోట్ల వరకు అందుకున్నారు. కానీ ఇప్పటి నుంచి సినిమాకు వంద కోట్లపైనే రెమ్యూనరేషన్ ఉంటుందని తెలుస్తోంది.  
 

అయితే బాలీవుడ్ లో వందకోట్లు తీసుకునే హీరోలు  ఉన్న విషయం తెలిసిందే. ఇక  సౌత్ లో ప్రభాస్, విజయ్ దళపతి పేర్లు వినిపిస్తున్నాయి.  ఈలిస్టులో జూనియర్ ఎన్టీఆర్ సైతం చేరిపోబోతున్నారని అంటున్నారు. ఈక్రమంలో తారక్ అప్ కమింగ్ ఫిల్మ్స్ పైనా భారీ అంచనాలు, ఆసక్తి నెలకొని ఉంది.
 

ప్రస్తుతం క్రియేటివ్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో NTR30లో నటిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ ప్రారంభమై శరవేగంగా కొనసాగుతోంది. చిత్రానికి హాలీవుడ్ టెక్నీషియన్లు వర్క్ చేస్తున్నారు. జాన్వీ కపూర్ కథానాయిక. యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లపై సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు.  
 

Latest Videos

click me!