ఎన్టీఆర్‌ సినిమాలో ముగ్గురు మలయాళ హీరోలు.. ఎవరో తెలుసా? ప్రశాంత్‌ నీల్‌ అదిరిపోయే ప్లాన్‌

Published : Jul 27, 2025, 04:44 PM IST

ఎన్టీఆర్‌ హీరోగా ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో రూపొందుతున్న `డ్రాగన్‌` మూవీకి సంబంధించిన క్రేజీ అప్‌ డేట్‌ వచ్చింది. ఇందులో ముగ్గురు మలయాళ నటులు నటించబోతున్నారట. 

PREV
15
ఎన్టీఆర్‌, ప్రశాంత్‌నీల్‌ మూవీకి `డ్రాగన్‌` టైటిల్‌

ఎన్టీఆర్‌ హీరోగా ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్‌లో ఉన్నారు తారక్‌. హైదరాబాద్‌ సమీపంలోనే చిత్రీకరణ జరుగుతుందట. 

మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్‌ ఆర్ట్స్  నిర్మించే ఈ చిత్రానికి `డ్రాగన్‌` అనే టైటిల్‌ని అనుకుంటున్నారు. భారీ బడ్జెట్‌తో ఈ మూవీని రూపొందిస్తున్నారు ప్రశాంత్‌ నీల్‌. ఇందులో కన్నడ నటి రుక్మిణి వసంత్‌ని హీరోయిన్‌గా ఫైనల్‌ చేసినట్టు సమాచారం.

DID YOU KNOW ?
జూ ఎన్టీఆర్‌కి ఇష్టమైన హీరోయిన్‌
జూ ఎన్టీఆర్‌కి ఇష్టమైన హీరోయిన్‌ శ్రీదేవి. కుదిరితే ఆమెతో కలిసి సినిమా చేయాలని ఉండేదట తారక్‌కి. కానీ ఆ కోరిక తీరలేదు.
25
`డ్రాగన్‌`లో పృథ్వీరాజ్‌ సుకుమారన్‌

ఈ సినిమాకి సంబంధించిన ఆసక్తికర అప్‌ డేట్‌ వచ్చింది. మూవీలో ముగ్గురు మలయాళ నటులు నటించబోతున్నారట. పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ ముఖ్య పాత్రలో ఎంపికయ్యారట. ఆయనది నెగటివ్‌ రోల్‌ అని తెలుస్తుంది. 

పృథ్వీరాజ్‌ తెలుగు ప్రేక్షకులకు `సలార్‌` తో పరిచయం అయ్యారు. మహేష్‌ బాబు, రాజమౌళి మూవీలో ఆయనే విలన్‌గా నటిస్తున్నారు. ఇప్పుడు తారక్‌ `డ్రాగన్‌`లోనూ విలన్‌ పాత్ర పోషిస్తున్నట్టు సమాచారం.

35
`డ్రాగన్‌`లో టొవినో థామస్‌, బీజు మీనన్‌ కూడా

మరోవైపు `2018` సినిమాతో తెలుగులోనూ గుర్తింపు తెచ్చుకున్న టొవినో థామస్‌ కూడా ఇందులో ముఖ్య పాత్ర పోషిస్తున్నారట. మలయాళంలో ఆయన స్టార్‌ హీరోగా రాణిస్తున్న విషయం తెలిసిందే. 

తారక్‌ మూవీలో ఆయన ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నారట. ఆయనతోపాటు మలయాళంలో హీరోగా, విలన్‌గా, విభిన్నమైన పాత్రలు పోషిస్తున్న బిజు మీనన్‌ సైతం ఇందులో నటించబోతున్నట్టు సమాచారం. వీరంతా కన్ఫమ్‌ అయ్యారట.

45
భారీ కాస్టింగ్‌తో ఎన్టీఆర్‌ `డ్రాగన్‌`

ఈ చిత్రానికి దర్శకుడు కన్నడ, హీరోయిన్‌ కన్నడ. ఇలా మూడు భాషల ఆర్టిస్ట్ లు, టెక్నీషియన్లతో నిండిపోయింది ఎన్టీఆర్‌, ప్రశాంత్‌ నీల్‌ మూవీ. ఇదిలా ఉంటే ఈ సినిమా 1970 పీరియాడికల్‌ మూవీగా రూపొందుతుందట.

 ఆ పీరియడ్‌ టైమ్‌లో బెంగాల్‌ పాలిటిక్స్ ని ప్రతిబింబించేలా సినిమా సాగుతుందని తెలుస్తోంది. ఇందులో ఎన్టీఆర్‌ మాఫియా లీడర్‌గా కనిపిస్తారని సమాచారం.

55
మాఫియా డాన్‌గా ఎన్టీఆర్‌

ఎన్టీఆర్‌ ఇటీవల బయట సన్నగా మారి కనిపించారు. ఆయన లుక్‌ ఫ్యాన్స్ ని, జనరల్‌ ఆడియెన్స్ ని ఆశ్చర్యానికి గురి చేసింది. తారక్ ఏదైనా అనారోగ్యంతో బాధపడుతున్నాడా? అనే రూమర్లు కూడా తెరపైకి వచ్చాయి. 

అయితే ఆయన లుక్‌ `డ్రాగన్‌` మూవీ కోసమే అని తెలుస్తోంది. ఒక రియల్‌ లైఫ్‌ మాఫియాని ఆధారంగా చేసుకుని తారక్‌ పాత్రని రూపొందించినట్టు సమాచారం. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories