ఎన్టీఆర్‌-ప్రశాంత్‌ నీల్‌ మూవీపై షాకింగ్‌ అప్‌డేట్‌.. పూనకాలు తెప్పించే వార్త చెప్పిన `సలార్‌` డైరెక్టర్‌..

Published : Mar 27, 2024, 09:33 AM IST

ఎన్టీఆర్‌, ప్రశాంత్‌ నీల్‌ కాంబినేషన్‌లో ఓ సినిమా రాబోతుంది. ఈ మూవీకి సంబంధించి ఓ క్రేజీ అప్‌డేట్‌ వినిపిస్తుంది. దర్శకుడు తన ట్రెండ్‌నే రిపీట్‌ చేయబోతున్నారట.   

PREV
15
ఎన్టీఆర్‌-ప్రశాంత్‌ నీల్‌ మూవీపై షాకింగ్‌ అప్‌డేట్‌.. పూనకాలు తెప్పించే వార్త చెప్పిన `సలార్‌` డైరెక్టర్‌..

ఎన్టీఆర్‌ ప్రస్తుతం `దేవర` మూవీలో బిజీగా ఉన్నారు. ఈ మూవీ చిత్రీకరణ చివరి దశకు చేరుకుంది. దసరాకి ఆడియెన్స్ ముందుకు రాబోతుంది. ఈ మూవీని రెండు భాగాలుగా తీసుకురాబోతున్నారు దర్శకుడు కొరటాల శివ. మొదటి భాగం అక్టోబర్‌లో రిలీజ్‌ అవుతుంది. ఈ సినిమా విజయాన్ని బట్టి రెండో పార్ట్ ఉంటుంది. 
 

25

మరోవైపు నెక్ట్స్ తారక్‌.. `కేజీఎఫ్‌`, `సలార్‌` ఫేమ్‌ ప్రశాంత్‌ నీల్‌తో సినిమా చేయబోతున్నారు. ఎన్టీఆర్‌31గా ఈ మూవీ రాబోతుంది. ప్రస్తుతం ప్రశాంత్‌ నీల్‌.. ప్రభాస్‌తో `సలార్‌ 2` చేయబోతున్నారు. అనంతరం తారక్‌ మూవీని ప్రారంభించబోతున్నారు. ఈ ఏడాది చివర్లోగానీ, లేదంటే వచ్చే ఏడాది గానీ ఈ మూవీ స్టార్ట్ కానుందని తెలుస్తుంది. 
 

35

ఇదిలా ఉంటే ముందే ఎన్టీఆర్‌ మూవీని స్టార్ట్ చేయాలని దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ భావిస్తున్నట్టు మరో వార్త సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఏప్రిల్‌లో దీన్ని ప్రారంభిస్తారని అంటున్నారు. కానీ ఇటీవల పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ మాట్లాడుతూ త్వరలోనే `సలార్‌ 2` షూటింగ్‌ స్టార్ట్ అవుతుందని చెప్పారు. దీంతో ఎన్టీఆర్‌ మూవీ డిలే అవుతుందని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. 
 

45

అయితే ఎన్టీఆర్‌, ప్రశాంత్‌ నీల్‌ మూవీకి సంబంధించిన మరో క్రేజీ, షాకింగ్‌ అప్‌డేట్‌ బయటకు వచ్చింది. ఈ సినిమాని కూడా రెండు భాగాలుగా తీసుకురాబోతున్నారట దర్శకుడు. ఇటీవలో ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని ఆయన వెల్లడించారు. ఎన్టీఆర్‌ సినిమా కూడా రెండు భాగాలుగా ఉంటుందన్నారు. 

55

ప్రశాంత్‌ నీల్‌ `కేజీఎఫ్‌` నుంచి ఇదే ట్రెండ్‌ ఫాలో అవుతున్నారు. `కేజీఎఫ్‌`ని రెండు భాగాలుగా తీశారు. ఈ మూవీ సంచలన విజయం సాధించింది. రెండో భాగం ఏకంగా 1200కోట్లు వసూలు చేసింది. ఇక ప్రభాస్‌తో చేస్తున్న`సలార్‌` రెండు భాగాలుగా వస్తుంది.ఇప్పటికే మొదటి భాగం విడుదలైన 700కోట్లకుపైగా వసూళ్లని రాబట్టింది. త్వరలోనే `సలార్‌ 2`ని తెరకెక్కించబోతున్నారు. ఇదే ట్రెండ్‌లో తారక్‌ మూవీని తీసుకురాబోతున్నారట. ఈ వార్త ఎన్టీఆర్‌ ఫ్యాన్స్ కి గూస్‌ బంమ్స్ తెప్పించేలా ఉందని చెప్పొచ్చు. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories