ఇక టెక్నీషియన్ల విషయానికి వస్తే.. ప్రశాంత్ నీల్ దర్శకుడు కాగా, రవి బన్సూర్ సంగీతం అందించబోతున్నారు. భువన్ గౌడ కెమెరామెన్‌గా, టీఎల్ వెంకట చలపతి ఆర్ట్ డైరెక్టర్‌గా వర్క్ చేస్తున్నారట. ఉజ్వల్ కులకర్ణి ఎడిటర్‌గా, చేతన్ డిసౌజా స్టంట్స్ కొరియోగ్రాఫర్‌గా వర్క్ చేయబోతున్నట్టు తెలుస్తుంది.
ప్రస్తుతం ఈ టీమ్‌కి సంబంధించిన డిటెయిల్స్ నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఇందులో ఎంత వరకు నిజం ఉంది?ఎవరు కన్ఫమ్ అయ్యారనేది మాత్రం సస్పెన్స్. దీనిపై టీమ్ క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. వినిపిస్తున్న పేర్లలో ఎక్కువగా కన్నడ, మలయాళానికి చెందిన వారే ఉండటం గమనార్హం.