#NTRNEEL ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ మూవీ...కేక పెట్టించే అప్డేట్

Published : Jun 02, 2024, 02:40 PM IST

ఎన్టీఆర్‌ (NTR)తో తాను తెరకెక్కించబోయే సినిమా ఇప్పటి వరకు తాను తీసిన చిత్రాలకు అది విభిన్నంగా ఉంటుందని గతంలో ప్రశాంత్ నీల్ చెప్పారు. 

PREV
112
 #NTRNEEL ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ మూవీ...కేక పెట్టించే అప్డేట్


ప్రశాంత్ నీల్‌తో తార‌క్   ప్రాజెక్ట్‌ను ప్ర‌క‌టించిన దగ్గర నుంచి అభిమానుల ఆనందానికి అంతేలేదు. ఈ సినిమాను గ‌తేడాది ప్ర‌క‌టించగా ఇప్ప‌టివ‌ర‌కు పట్టాలెక్కలేదు. అయితే, ఈ క్రేజీ కాంబో షూటింగ్ ఎప్పుడు మొద‌ల‌వుతుందా ఎప్పుడెప్పుడు సినిమా నుంచి అప్డేట్‌లు వస్తాయా అని తారక్ అభిమామ‌లు ఎంతో ఆత్రుత‌గా ఎదురుచూస్తున్నారు. ఈ క్ర‌మంలో తాజాగా  ఈ మూవీ  కు సంబంధించి మేక‌ర్స్ క్రేజీ అప్‌డేట్ బయిటకు వచ్చింది. ఆ న్యూస్ వైరల్ అవుతోంది. అదేమిటంటే...

212


ఎన్టీఆర్ 31 షూటింగ్ దాదాపు 15 దేశాల్లో జరగబోతుందని సమాచారం. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా మొదలయ్యాయట. ఆగస్టు లేదా సెప్టెంబర్‌లో మెక్సికోలో ఈ సినిమా షూటింగ్ మొదలవుతుందని అంటున్నారు. ఇండియన్ సినిమాల్లో అత్యంత భారీ ప్రాజెక్టుల్లో ఒకటిగా ఎన్టీఆర్ 31 ఉంటుందని బజ్ క్రియేట్ అవుతుంది.

312
Junior NTR


 ప్ర‌శాంత్ నీల్‌ ప్ర‌స్తుతం స‌లార్-2 షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా షూటింగ్ పూర్తయిన వెంట‌నే తార‌క్ మూవీని సెట్స్‌పైకి తీసుకురానున్నాడు.  ఈ చిత్రాన్ని కూడా ప్ర‌శాంత్ నీల్ రెండు భాగాలుగా ప్లాన్ చేస్తున్న‌ట్లు స‌మాచారం. ఒకవేళ ఇదే నిజ‌మైతే ఎన్‌టీఆర్ అభిమానుల‌కు పండ‌గే అని చెప్పాలి. ఎందుకంటే ఇప్ప‌టికే ప్ర‌శాంత్ నీల్ కేజీఎఫ్ రెండు పార్టులుగా తీసి బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ అందుకున్నాడు. అలాగే స‌లార్ కూడా రెండు పార్టులుగా వ‌స్తుంది. ఫ‌స్ట్ పార్ట్ ఇప్ప‌టికే సూప‌ర్ హిట్ అయిన విష‌యం తెలిసిందే.

412
actor junior ntr new movie with director prashanth neel


భారీ ఎక్సపెక్టేషన్స్ ఉన్న  ఈ యాక్షన్ డ్రామాని ఎన్టీఆర్ ఆర్ట్స్ సహకారంతో మైత్రీ మూవీ మేకర్స్ భారీ స్థాయిలో నిర్మించబోతుంది. అలానే క్యాస్టింగ్‌ సెలక్షన్ పనుల్లో మూవీ టీమ్ ఉంది.  అయితే  చిత్రానికి టైటిల్ ఖరారు చేస్తున్నారనే వార్త బయిటకు వచ్చింది. దాంతో ఆ టైటిల్ ఏంటనేది హాట్ టాపిగ్ గా మారింది. 
 

512


 ఎన్టీఆర్‌ (NTR)తో తాను తెరకెక్కించబోయే సినిమా ఇప్పటి వరకు తాను తీసిన చిత్రాలకు అది విభిన్నంగా ఉంటుందని గతంలో ప్రశాంత్ నీల్ చెప్పారు. అందుకు తగ్గట్లుగానే టైటిల్ నుంచి అన్నీ విభిన్నంగా ఉండాలని ప్లాన్ చేస్తున్నారు. అలాగే కానీ, ఆ కథ ఏ నేపథ్యంలో సాగుతుందో చెప్పేందుకు నిరాకరించారు. ప్రేక్షకులు యాక్షన్‌ చిత్రమని భావిస్తున్నారని, జానర్‌ ఏదైనా అది వారికి బాగా కనెక్ట్‌ అవుతుందన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. 
 

612


ఈ సంవత్సరం  ద్వితీయార్థంలో ఈ చిత్రం  చిత్రీకరణ ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నామన్నారు.  ఈ సినిమాకు ‘డ్రాగన్’ అనే పవర్ ఫుల్ టైటిల్ పెట్టినట్టు టాలీవుడ్ లో వినిపిస్తుంది. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలంటే ఎదురుచూడాల్సిందే. 
 

712


ఒకవేళ టైటిల్ ‘డ్రాగన్’ అయితే అదిరిపోయే పర్ఫెక్ట్ టైటిల్ అవుతుంది అంటున్నారు ఎన్టీఆర్ ఫ్యాన్స్. ఇక KGF, సలార్ సినిమాలతో భారీ హిట్స్ కొట్టిన ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ సినిమా చేస్తుండటంతో ఈ సినిమాపై కూడా ఇప్పట్నుంచే అంచనాలు నెలకొన్నాయి. 
 

812


ప్రభాస్‌తో ‘సలార్’ సినిమా చేస్తున్న సమయంలోనే తన నెక్స్ట్ సినిమా జూ.ఎన్టీఆర్‌తో ఉంటుందని ప్రశాంత్ నీల్ ప్రకటించాడు. అంతే కాకుండా ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ లుక్ పోస్టర్‌ను కూడా విడుదల చేశారు. అయితే ఆ తర్వాత ఆ సినిమా గురించి ఎలాంటి అప్‌డేట్ రాలేదు.  అయితే  ప్రశాంత్ నీల్ తన తదుపరి సినిమా గురించి ఓ విషయం బయటపెట్టాడు.
 

912


ప్రశాంత్ నీల్ మాట్లాడుతూ.. “నేను జూనియర్ ఎన్టీఆర్ కోసం ఇప్పటివరకు చేయని పాత్రను, కథను సినిమా చేయబోతున్నాను. యంగ్ ఎన్టీఆర్ కూడా మునుపెన్నడూ చూడని విధంగా కనిపించనున్నాడు. ఈ కథ నా మామూలు స్టైల్‌లో ఉండదు, దానికి బదులుగా సినిమాలో ఎమోషన్‌ ప్రధాన అంశంగా ఉంటుంది అని అన్నారు. జూనియర్ ఎన్టీఆర్ కోసం నీల్ ఒక సాలిడ్ యాక్షన్ మూవీని రెడీ చేస్తాడని అభిమానులు అంటున్నారు. అయితే నీల్ యాక్షన్ ఎమోషనల్ స్టోరీని రెడీ చేస్తున్నాడని చెప్పుకొచ్చాడు

1012


ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్‌తో సినిమా చేసే పని మొదలుపెట్టాను. అయితే ఎన్టీఆర్ ‘దేవర’తో పాటు ఓ హిందీలో వార్ 2 సినిమాతో బిజీగా ఉన్నాడు. కాబట్టి ఎన్టీఆర్ తో నేను చేయబోయే సినిమాకు సరైన టైం కోసం వేచి చూడాల్సివస్తోంది. దాని గురించి ప్రస్తుతానికి మాట్లాడలేను, నా దృష్టి అంతా ‘సలార్’ సినిమా  పైనే అని అన్నాడు.
 

1112


 జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ‘దేవర’ చిత్రంలో నటిస్తున్నారు. కొరటాల శివ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. జాన్వీ కపూర్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమా రెండు భాగాలుగా విడుదల కానుంది. ఈ సినిమా కోసం హాలీవుడ్ యాక్షన్ కొరియోగ్రాఫర్ పనిచేస్తున్నారు. ఈ సినిమా తర్వాత జూ ఎన్టీఆర్ హృతిక్ రోషన్ తో వార్ 2 సినిమాలో నటించనున్నాడు. ఈ చిత్రానికి బాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్ సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించనున్నారు. ఈ రెండు సినిమాలు పూర్తయిన తర్వాతే ప్రశాంత్ నీల్-జూ ఎన్టీఆర్ కాంబినేషన్ మూవీ ప్రారంభం కానుంది. మైత్రి మూవీ మేకర్స్ సంస్థ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మించనుంది.

1212


 ‘కేజీయఫ్‌ 1’, ‘కేజీయఫ్‌ 2’ చిత్రాలతో ఈ దర్శకుడు దేశ వ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. ఆ ఘన విజయాల తర్వాత దర్శకత్వం వహించిన సినిమాకావడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. 2021లోనే ఎన్టీఆర్‌తో సినిమా చేస్తున్నట్లు ప్రకటించారాయన. #NTR31, #NTRNEEL అనేవి వర్కింగ్‌ టైటిల్స్‌గా ఉన్నాయి. ఎన్టీఆర్‌ ప్రస్తుతం ‘దేవర’ (Devara)తో బిజీగా ఉన్నారు. శివ కొరటాల దర్శకత్వం వహిస్తున్న ఆ సినిమా తొలి భాగం 2024 ఏప్రిల్‌ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది.
  

Read more Photos on
click me!

Recommended Stories