బాలకృష్ణకి పద్మభూషణ్‌ పురస్కారంపై ఎన్టీఆర్‌ పోస్ట్.. బాబాయ్‌ గురించి అబ్బాయిలు ఏమన్నాడంటే?

Published : Jan 25, 2025, 10:02 PM IST

బాలకృష్ణకి కేంద్ర ప్రభుత్వం పద్మ భూషణ్‌ అవార్దుని ప్రకటించింది. ఈ నేపథ్యంలో బాబాయ్‌కి అబ్బాయిలు ఎన్టీఆర్‌, కళ్యాణ్‌ రామ్‌, రవితేజ, నాగవంశీ వంటి సినీ ప్రముఖులు విషెస్‌ తెలిపారు.   

PREV
15
బాలకృష్ణకి పద్మభూషణ్‌ పురస్కారంపై ఎన్టీఆర్‌ పోస్ట్.. బాబాయ్‌ గురించి అబ్బాయిలు ఏమన్నాడంటే?

బాలకృష్ణకి ప్రతిష్టాత్మక పురస్కారం లభించింది. కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అందించే పద్మ భూషణ్‌ పురస్కారం వరించింది. తాజాగా రిపబ్లిక్‌ డే సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులను ప్రకటించిన విషయం తెలిసిందే. సినిమా రంగానికి చెందిన ప్రముఖులకు పద్మ అవార్డులను ప్రకటించారు. అందులో భాగంగా బాలకృష్ణకి పద్మ భూషణ్‌ పురస్కారాన్ని ప్రకటించారు. 
 

25

బాలకృష్ణకి పద్మ అవార్డు ప్రకటించడంతో సినిమా ప్రముఖులు స్పందిస్తూ అభినందనలు తెలియజేస్తున్నారు. ఈ క్రమంలో అబ్బాయి ఎన్టీఆర్‌ స్పందించారు. బాబాయ్‌కి అభినందనలు తెలిపారు. సోషల్‌ మీడియా ద్వారా ఆయన విషెస్‌ పోస్ట్ చేశారు.

 

ఇందులో ఎన్టీఆర్‌ చెబుతూ, ప్రతిష్టాత్మక పద్మ భూషణ్‌ అవార్డుతో సత్కరించబడిన బాల బాబాయ్‌కి హృదయపూర్వక అభినందనలు. ఈ గుర్తింపు మీరు సినిమాకు చేసిన అసమానమైన కృషికి, మీ అవిశ్రాంత ప్రజాసేవకు నిదర్శనం` అని తెలిపారు తారక్‌. 
 

35

ప్రస్తుతం ఎన్టీఆర్‌ పోస్ట్ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. ఇటీవల కాలంలో బాలకృష్ణకి, ఎన్టీఆర్‌కి పడటం లేదనే రూమర్లు వినిపించాయి. ఇటీవల `అన్‌ స్టాపబుల్‌` టాక్‌ షోలో ఎన్టీఆర్‌ ప్రస్తావన తీసుకురావద్దని గెస్ట్ లకు బాలయ్య చెప్పాడనే రూమర్స్ వచ్చాయి.

వీరిద్దరికి పడటం లేదని, తారక్‌ని బాలయ్య దూరం పెట్టారనే వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో ఇప్పుడు బాబాయ్‌కి ఎన్టీఆర్‌ విషెస్‌ చెప్పడం విశేషం. ఇది ఫ్యాన్స్ ని ఫుల్‌ ఖుషీ చేస్తుంది. 
 

45

నందమూరి కళ్యాణ్‌ రామ్‌ కూడా స్పందించి విషెస్‌ తెలిపారు. ఆయన చెబుతూ, ప్రతిష్టాత్మక పద్మ భూషణ్‌ అవార్డుని అందుకున్నందుకు నా బాబాయ్‌ నందమూరి బాలకృష్ణకి హృదయపూర్వక అభినందనలు. ఈ గౌరవం మీరు సినిమా ప్రపంచానికి చేసిన అసాధారణ కృషికి, సమాజ సేవలో చేసిన అవిశ్రాంత కృషికి నిజమైన గుర్తింపు` దఅని వెల్లడించారు కళ్యాణ్‌ రామ్‌.

ఇద్దరు అబ్బాయిలు ఇలా వెంటనే స్పందించి బాలయ్య బాబాయ్‌కి విషెస్‌ చెప్పడం నందమూరి అభిమానుల్లో ఆనందం వెల్లువిరుస్తుంది. వీరితోపాటు రవితేజ, నాగవంశీ, డీవీవీ ఎంటర్టైన్‌మెంట్స్ ఇలా సినీ ప్రముఖులు స్పందించి బాలయ్యకి విషెస్‌ చెబుతున్నారు. 

55
NTR - Balakrishna

బాలకృష్ణ ఇటీవల `డాకు మహారాజ్‌` సినిమాతో విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ఈ సక్సెస్‌ ఊపులో ఉన్న ఆయన ఇప్పుడు `అఖండ 2` షూటింగ్‌లో పాల్గొంటున్నారు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఈ మూవీ రూపొందుతుంది.

ప్రస్తుతం ఇది హైదరాబాద్‌లో షూటింగ్‌ జరుపుకుంటుంది. ఈ చిత్రాన్ని పాన్‌ ఇండియా మూవీగా విడుదల చేయాలని భావిస్తున్నారు. ఇదే నిజమైతే ఇదే బాలయ్య తొలి పాన్‌ ఇండియా మూవీ కాబోతుందని చెప్పొచ్చు. ఆ తర్వాత గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో సినిమా ఉండబోతుందట. 

read  more: ఎన్బీకే థమన్‌కి బాలయ్య బిగ్‌ షాక్‌, ఆ సినిమా నుంచి ఔట్‌?

also read: వెంకటేష్‌ ఫస్ట్ పాన్ ఇండియా మూవీ.. సంచలన దర్శకుడు ప్లానింగ్‌?
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories