ఇంతకు ముందు వరకూ ఎన్టీఆర్ సినిమాకు 30 కోట్ల వరకూ తీసుకున్నాడు. మహేష్ బాబు,పవన్ లాంటి హీరోలు ఇప్పటికే 50 కోట్ల మార్క్ ను దాటి... 70 కోట్లకు రీచ్ అవ్వగా.. పాన్ ఇండియా స్టార్ గా ఎన్టీఆర్ కూడా ముందు ముందు ఇంకా రేటు పెంచే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఆర్ఆర్ఆర్ తో తారక్ క్రేజ్ అమాంతం పెరిగింది. అంతేకాకుండా ట్రిపుల్ఆర్ ప్రమోషన్లలో జరిగిన ప్రెస్ మీట్‌లలో తారక్ అన్ని భాషల్లో మాట్లాడడంతో ప్రతి రాష్ట్రంలో ఈయనకు మంచి క్రేజ్ ఏర్పడింది.