టాలీవుడ్ లో తనకంటూ స్పెషల్ ఇమేజ్ సాధించింది మలయాళ ముద్దు గుమ్మ అనుపమా పరమేశ్వరన్. తన కెరీర్ గురించి కొన్ని విషయాలు రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది.
తెలుగులో స్టార్ హీరోలతో, చిన్న హీరోలతో కూడా సినిమాలు చేస్తూ.. తెలుగింటి పిల్లగా మారిపోయింది అనుపమా పరమేశ్వరన్. అటు సినిమాలు ఇటు సోషల్ మీడియాను బ్యాలన్స్ చేస్తున్న అను.. తన గురించి కొన్ని విషయాలు మీడియాతో పంచుకన్నారు.
28
అబ్బాయిలంతా పిసినారులంటోంది అనుపమా పరమేశ్వరన్. ఎంతుకంటే తన కాలేజీ రోజుల్లో చాలా ప్రేమలేఖలు వచ్చేవని. ఎవరైనా కవితాత్మకంగా రాస్తే చూడాలని ఉండేదట. కాని అబ్బాయిలంతా చాక్లెట్ రేపర్స్ మీద, ఒకటీ రెండు పదాలతో ప్రేమలేఖలు ముంగించేవారు అంటోంది అనుపమా.
38
ఇప్పటికీ తనకు కెమెరా ముందు నిలబడటం సరిగ్గా రాదు అంటోంది అనుపమా పరమేశ్వరన్. ఆడియష్స్ అంటు ఇప్పటికీ చాలా భయమట. అయితే ఓ అసిస్టెంట్ డైరెక్టర్ తన ఇబ్బందిని గమనించి అద్దం ముందు నించుని ప్రాక్టీస్ చేయమనిచెప్పాడట. అలా అద్దం ముందు ప్రాక్టీస్ చేయబట్టే.. ప్రేమమ్ కి సెలక్ట్ అయ్యానంటోంది అనుపమ.
48
అసలు తను ఇండస్ట్రీకి రావడమే విచిత్రంగా జరిగిందంటోంది అనుపమా పరమేశ్వరన్. తాను సినిమాల్లో నటించడం ఇంట్లో వాళ్ళకు అస్సుల ఇష్టం లేదట. నిజానికి తను సినిమాల్లోకి రావడానికి తన ఫ్రెండ్ కారణం అంటోంది అను. తన ఫోటోలను ప్రేమమ్ ఆడిషన్స్ కు పంపించిందట తన స్నేహితురాలు. అయితే ఇంట్లో వాళ్లను ఒప్పించే సరికి తల ప్రాణం తోకకి వచ్చిందంటోంది.
58
అనుపమా పరమేశ్వరన్ మంచి ఫుడీ అని చాలా తక్కువ మందికి తెలుసు. ఫలానా చోట ఫుడ్ బాగుంటుంది అని తెలిస్తే వెంటనే అక్కడ వాలి పోతుందట అను. అయితే ఏదైనా మితంగానే తింటుందట. అదుకే ఇప్పటికీ తన ఫిజిక్ ను కాపాడుకోగలుతున్నా అంటోంది.
68
ఇక అనుపమా మల్టీ టాలెంటెడ్ కూడా. తను పాటలు కూడా పాడేస్తుంది. కాని ఇంత వరకూ ఏ సినిమాలో పాడలే కాని.లేటెస్ట్ తెలుగు పాటలన్నీఇంట్లోనే పాడేస్తుందట. ఎవరైనా మ్యూజిక్ డైరెక్టర్ అవకాశం ఇస్తే పాటపాటానికి నేను రెడీ అంటోంది అనుపమా.
78
ఇక తనకు డ్రీమ్ రోల్ అంటూ ఏదీ లేదంటోంది. కాని తనకు చాలా ఇష్టమైన డైరెక్టర్ మణిరత్నం అంటోంది. కాకపోతే తను లైఫ్ లో ఒక్క సారి అయినా మణిరత్నం సినిమాలో నటించాలని ఉందటన అనుపమకు.
88
ఈమలయాళ బ్యూటీకి పెట్స్ అంటే ప్రాణం. కుక్కులు పిల్లులు ఇవి ఎక్కడ కనిపించినా పలకరిస్తుంది. వాటికి సరదాగా హాయ్ చెపుతుంది. అంతే కాదు పెట్స్ తో టైప్ పాస్ చేయడం అంటే అనుపమకు చాలా ఇష్టం. కాస్త ఖాళీ టైమ్ దొరికినా ఆమె చేసే పని ఇదే.