గ్రీన్ కలర్ శారీలో ప్రణీత సుభాష్‌ కైపెక్కించే పోజులు.. సంతూర్‌ సోప్‌ మమ్మీలా ఉన్నావంటూ నెటిజన్ల కామెంట్లు

Published : Jan 20, 2023, 07:01 AM IST

కన్నడ సోయగం ప్రణీత సుభాష్‌ పెళ్లై, తల్లైన తర్వాత మరింత యాక్టివ్‌గా ఉంటుంది. ఆమె ఫిట్‌నెస్‌ పరంగానూ, యాక్టివిటీస్‌లోనూ చురుకుగా ఉంటుంది. సోషల్‌ మీడియాలో మరింత యాక్టివ్‌గా ఉంటూ ఆకట్టుకుంటుంది.   

PREV
15
గ్రీన్ కలర్ శారీలో ప్రణీత సుభాష్‌ కైపెక్కించే పోజులు.. సంతూర్‌ సోప్‌ మమ్మీలా ఉన్నావంటూ నెటిజన్ల కామెంట్లు

తన ఫిట్‌నెస్ ఏమాత్రం తగ్గలేదని చాటుకుంటూ గ్లామర్‌ ట్రీట్‌ ఇస్తున్న ప్రణీత(Pranitha Subhash) తాజాగా శారీలో హోయలు పోయింది. కన్నడ ట్రెడిషనల్‌కి సంబంధించి శారీ బ్రాండ్‌ `లతాపుట్టన్నా` కి చెందిన శారీ కట్టుకుని వయ్యారాలు ఒలకబోసింది. ఆ ఫోటోలను సోషల్‌ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంది. 
 

25

గ్రీన్‌ కలర్‌ శారీలో ప్రణీత మరింత అందంగా, మరింత ముద్దుగా, మరింత క్యూట్‌గా ఉంది. హాట్ నెస్‌ మాత్రం తగ్గేదెలే అనిపిస్తుండటం విశేషం. ప్రస్తుతం ప్రణీత శారీ ఫోటోలు నెటిజన్లకి కనువిందు చేస్తున్నాయి. సామాజిక మాధ్యమాల్లో రచ్చ చేస్తున్నాయి. 
 

35

ప్రణీత సుభాష్‌ ఈ నయా ఫోటోలపై నెటిజన్లు స్పందిస్తున్నారు. ఫన్నీ కామెంట్లుచేస్తున్నారు. ఇలా సంతూర్‌ సోప్‌ మమ్మీలా ఉన్నావని, సంతూర్‌ సోప్‌ వాడుతుంటారా? అని, తరగని అందం ప్రణీత సొంతమని, ఇలానే ఉంటే కుర్రప్రపంచం కొంప కొల్లేరే అంటూ రకరకాల కామెంట్లు చేస్తున్నారు. ఏదేమైనా ప్రణీత అందం మరింత ఓవర్‌ లోడ్‌ అవుతుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. 
 

45

కన్నడకి చెందిన ఈ అందాల భామ తెలుగులోనూ మెరిసింది. పవన్‌ కళ్యాణ్‌తో `అత్తారింటికి దారేదీ`లో సెకండ్‌ హీరోయిన్‌గా నటించింది. `రభస`లో ఎన్టీఆర్‌కి జోడీగా సెకండ్‌ హీరోయిన్‌గానే కనువిందు చేసింది. `బావ` సినిమాలో  హీరో సిద్ధార్థ్‌తో, `పాండవులు పాండవులు తుమ్మెద`లో మంచు మనోజ్‌తో, `డైనమైట్‌`లో మంచు విష్ణుతో, `బ్రహ్మోత్సవం`లో కీలక పాత్రలో మెరిసింది. `హలో గురు ప్రేమ కోసమే`లోనూ సెకండ్‌ హీరోయిన్‌గానే కనిపించింది. చివరగా `ఎన్టీఆర్‌ః కథానాయకుడు`లో కృష్ణకుమారి పాత్రలో మెరిసింది ప్రణీత. 
 

55

గతేడాది సైలెంట్‌గా పెళ్లి చేసుకున్న ఈ భామ కుమార్తెకి జన్మనిచ్చింది. ప్రస్తుతం ఓ వైపు మాతృత్వాన్ని ఎంజాయ్‌ చేస్తుంది. ఇంకోవైపు ఫిట్‌నెస్‌పై ఫోకస్‌ పెట్టింది. తన ఫిట్‌నెస్‌ తగ్గలేదనే విషయాన్ని చాటుకుంటుంది. మరోవైపు సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటుంది. గ్లామర్‌ షో చేస్తూ నెటిజన్లని ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం ఆమె కన్నడలో `రమణ అవతార` చిత్రంలో నటిస్తుంది. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories