MaheshBabu `ఒక్కడు`తో పోటీ పడి చిత్తైపోయిన ఎన్టీఆర్‌ మూవీ ఇదే? రవితేజకి చుక్కలు.. శ్రీకాంత్ ఒక్కడే నిలబడ్డాడు

Published : Jan 07, 2026, 02:21 PM IST

మహేష్‌ బాబు `ఒక్కడు` మూవీతో పోటీ పడి జూ ఎన్టీఆర్‌ దారుణమైన డిజాస్టర్‌ గా నిలిచింది. అదే సమయంలో మాస్‌ మహారాజా రవితేజ నటించిన మూవీ గట్టిగా దెబ్బతిన్నది. 

PREV
15
`ఒక్కడు`తో పోటీ పడి డిజాస్టర్‌ అయిన సినిమాలు

ప్రస్తుతం టాలీవుడ్‌లో సంక్రాంతి సినిమాల హడావుడి కనిపిస్తుంది. ఈ సంక్రాంతికి తెలుగులో ఐదు సినిమాలు విడుదలవుతున్నాయి. అయితే సంక్రాంతికి వచ్చిన సినిమాల్లో  కొన్ని  బాగా ఆడతాయి. బ్లాక్‌బస్టర్స్ గా నిలుస్తాయి. కానీ మరికొన్ని మూవీస్‌ డిజాస్టర్‌గా మారతాయి. ఈ పోటీలో విన్‌ అయిన మూవీకి కలెక్షన్ల వర్షం కురుస్తుందని చెప్పొచ్చు. అయితే గతంలో సంక్రాంతికి చాలా సినిమాలు పోటీపడ్డాయి. అలా మహేష్‌ బాబు `ఒక్కడు` మూవీ కూడా సంక్రాంతికే విడుదలైంది. మరి అప్పుడు దీనితో ఏ ఏ సినిమాలు పోటీ పడ్డాయి. వాటి ఫలితాలేంటో చూద్దాం.

25
సంక్రాంతికి బ్లాక్‌ బస్టర్‌గా `ఒక్కడు`

సూపర్‌ స్టార్‌ మహేష్‌ మహేష్‌బాబుకి ఫస్ట్ కమర్షియల్‌ బ్రేక్‌ ఇచ్చిన మూవీ `ఒక్కడు`. గుణశేఖర్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రమిది. ఇందులో భూమిక హీరోయిన్‌గా నటించింది. కబడ్డీ నేపథ్యంలో రూపొందిన లవ్‌ అండ్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ చిత్రమిది. ఇందులో ప్రకాష్‌ రాజ్‌ విలన్‌గా నటించాడు. ఈ మూవీ మహేష్‌ బాబు కెరీర్‌లో అతి పెద్ద హిట్‌గా నిలిచింది. `ఒక్కడు` మూవీ 2003 జనవరి 15న విడుదలైంది. పెద్దగా అంచనాలు లేకుండా విడుదలైన ఈ మూవీ బాక్సాఫీసు వద్ద సంచలనంగా నిలిచింది.  ఏకంగా సుమారు రూ.30కోట్ల డిస్ట్రిబ్యూషన్‌ షేర్‌ని రాబట్టడం విశేషం. అంటే దానికి డబుల్‌ కలెక్షన్లని సాధించిందని చెప్పొచ్చు. ఎనిమిది నంది అవార్డులు సొంతం చేసుకుంది. అంతేకాదు ఇది ఏకంగా ఆరు భాషల్లో రీమేక్‌ అయ్యింది. అన్ని భాషల్లోనూ బ్లాక్‌ బస్టర్‌ గా నిలిచింది.

35
`ఒక్కడు`తో పోటీ పడి డిజాస్టర్‌గా నిలిచిన `నాగ`

`ఒక్కడు`కి పోటీగా వచ్చిన మూవీ `నాగ`. ఎన్టీఆర్‌ హీరోగా నటించిన చిత్రమిది. డీకే సురేష్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రమిది. పొలిటికల్‌ యాక్షన్‌ మూవీగా రూపొందింది. ఇందులో యువ నాయకుడిగా తారక్‌ నటించారు. సదా హీరోయిన్‌ గా నటించింది. ఈ మూవీ కూడా సంక్రాంతి పండగ సందర్భంగా 2003లో జనవరి 10న విడుదలైంది. కానీ బాక్సాఫీసు వద్ద డీలా పడింది. సంక్రాంతికి అంతో ఇంతో ఆడేది. కానీ ఆ తర్వాత మహేష్‌బాబు `ఒక్కడు` దెబ్బకి డిజాస్టర్‌గా మిగిలిపోయింది. మొత్తానికి మహేష్‌.. తారక్‌ని గట్టి దెబ్బ కొట్టాడని చెప్పొచ్చు.

45
రవితేజకి హిట్‌ లేకుండా చేసిన `ఒక్కడు`

అదే ఏడాది సంక్రాంతికి వచ్చిన మరో మూవీ `ఈ అబ్బాయి చాలా మంచోడు`. రవితేజ హీరోగా వచ్చిన రొమాంటిక్‌ కామెడీ చిత్రమిది. అగస్త్యన్‌ దర్శకత్వం వహించారు. బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్‌ నిర్మించారు. ఇందులో రవితేజకి జోడీగా సంగీత హీరోయినగా నటించింది. వాణి మరో పాత్ర పోషించింది. ఈ మూవీ అదే ఏడాది జనవరి 14న రిలీజ్‌ అయ్యింది. సంక్రాంతి పోటీలో వచ్చిన ఈ మూవీకి పాజిటివ్‌ టాక్‌ వచ్చింది.  కానీ `ఒక్కడు` వల్ల గట్టిగా దెబ్బతిన్నది. హిట్‌కావాల్సిన మూవీ కేవలం యావరేజ్‌గా మిగిలిపోయింది.

55
`ఒక్కడు`ని తట్టుకొని బ్లాక్‌ బస్టర్‌ అయిన `పెళ్లాం ఊరెళితె

అదే సంక్రాంతికి జనవరి 15న `ఒక్కడు` రిలీజ్‌ రోజునే మరో మూవీ వచ్చింది. అదే `పెళ్లాం ఊరెళితె`. శ్రీకాంత్‌, వేణు తొట్టంపూడి హీరోలుగా నటించారు. ఇందులో సంగీత, రక్షిత హీరోయిన్లుగా నటించారు. ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో రూపొందిన చిత్రమిది. మంచి ఫ్యామిలీ, కామెడీ మూవీగా ఇది రూపొందింది. కుటుంబ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఓ వైపు `ఒక్కడు` దుమ్మురేపుతున్నా, దాన్ని తట్టుకుని నిలబడింది. బ్లాక్‌ బస్టర్‌గా నిలిచింది. ఇలా 2003 సంక్రాంతికి `ఒక్కడు`తో పోటీ పడి ఎన్టీఆర్‌ `నాగ` మూవీ డిజాస్టర్‌ కాగా, రవితేజ `ఈ అబ్బాయి చాలా మంచోడు` యావరేజ్‌గా నిలిచింది. శ్రీకాంత్‌ `పెళ్లాం ఊరెళితే` బ్లాక్‌ బస్టర్‌ అయ్యింది.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories