Junior NTR Devara upcoming film update out
ఎన్టీఆర్ (NTR) హీరోగా దర్శకుడు కొరటాల శివ తెరకెక్కించిన చిత్రం ‘దేవర’ (Devara) త్వరలో రిలీజ్ కాబోతున్న సంగతి తెలిసిందే. దేవర చిత్రం పార్ట్ 1 ఈ నెల 27న విడుదల కానుంది. ‘జనతా గ్యారేజ్’ తర్వాత ఎన్టీఆర్- కొరటాల శివ కాంబోలో తెరకెక్కిన సినిమా కావడంతో ముందు నుంచీ ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది.
విజువల్స్ అద్భుతంగా ఉంటాయని, చివరి 40 నిమిషాలు సినిమాలో హైలైట్ అంటూ ముంబయిలో జరిగిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో ఎన్టీఆర్ అంచనాలు రెట్టింపు చేశారు. ఈ సినిమాతో జాన్వీ కపూర్ టాలీవుడ్‌లోకి వస్తున్నారు. సైఫ్ అలీఖాన్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాపై అభిమానులు ఎంత తీవ్రమైన కోరిక పెట్టుకున్నారంటే....
‘దేవర’ చూసేవరకు తనను బతికించాలని ఓ క్యాన్సర్ పేషెంట్ చివరి కోరిక కోరుతున్నాడు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కౌశిక్ (19) కొంతకాలంగా బోన్ క్యాన్సర్‌తో బాధపడుతున్నాడు. అతడు జూనియర్ ఎన్టీఆర్ వీరాభిమాని కావడంతో చనిపోయేలోపు ‘దేవర’ (Devara) చూడాలని కోరుకుంటున్నట్లు అతని తల్లిదండ్రులు తెలిపారు. ఈ మేరకు తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో వారు మీడియా సమావేశం నిర్వహించారు.
‘నా కుమారుడికి చిన్నప్పటినుంచి జూనియర్ ఎన్టీఆర్ అంటే చాలా ఇష్టం (NTR Fan Request). ఇప్పుడు కూడా చివరి కోరికగా ‘దేవర’ చూడాలని అడుగుతున్నాడు. సెప్టెంబర్ 27 వరకు తనను బతికించాలని డాక్టర్లను వేడుకుంటున్నాడు. అది ఒక్కటే అతని ఆఖరి కోరిక’ అంటూ కౌశిక్ తల్లి కన్నీటి పర్యంతమయ్యారు.
తన కుమారుడి వైద్యానికి రూ.60లక్షలు ఖర్చు అవుతుందని ప్రభుత్వం, దాతలు సాయం చేయాలని ఆమె కోరారు. ఈ వీడియోను షేర్ చేస్తున్న తారక్ అభిమానులు ఆయన్ని ట్యాగ్ చేస్తున్నారు.
కుర్రాడి తండ్రి శ్రీనివాసులు టీటీడీలో కాంట్రాక్ట్ డ్రైవర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం బెంగుళూరులోని కిడ్‌వై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కౌశిక్ విషయం సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్‌గా మారింది.
తమ కొడుకు చివరి కోరిక తీర్చాలని తాము ప్రయత్నిస్తున్నామని.. తమకు ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తమకు సాయం చేయాలని కోరుతున్నారు. ఇప్పటికే స్నేహితులు, సన్నిహుతుల ద్వారా కొంత డబ్బు సమకూరినా ఇంకా డబ్బు కావాల్సి ఉన్నట్లు తెలుస్తోంది.
బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 అప్ డేట్స్ కోేసం ఇక్కడ క్లిక్ చేయండి.
Devara Trailer
ఇప్పటికే దేవర చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు యూ/ఏ సర్టిఫికెట్ జారీ చేసింది. (Devara Movie RunTime) నిడివి: 2 గంటల 57 నిమిషాల 58 సెకన్లు. ఇటీవల బాక్సాఫీసు ముందుకొచ్చిన పలు చిత్రాల నిడివి దాదాపు 3 గంటలు ఉండటం గమనార్హం. కంటెంట్ బాగుంటే రన్‌టైమ్ ఎంతున్నా ప్రేక్షకుల ఆదరణ దక్కుతుందనే విషయాన్ని ‘కల్కి’ (180.56 నిమిషాలు), ‘సరిపోదా శనివారం’ (2: 50 గంటలు)లాంటి చిత్రాలు మరోసారి నిరూపించాయి.