ఈ హీరోయిన్స్ భర్తలకు మించిన కోటీశ్వరులు! ఒక్కొక్కరి ఎన్ని వందల కోట్ల ఆస్తులు ఉన్నాయో తెలుసా?

First Published | Sep 12, 2024, 11:49 AM IST

బాలీవుడ్ హీరోలు కోట్లకు అధిప‌తులన్న సంగ‌తి తెలిసిందే. అయితే కొంత‌మంది స్టార్ హీరోల‌ భార్య‌లు మాత్రం త‌మ భ‌ర్త‌ల‌ కంటే రెట్టింపు ఆస్తుల‌ను క‌లిగి ఉన్నారు.  
 

బాలీవుడ్ న‌టీమ‌ణులు

బాలీవుడ్‌ స్టార్ హీరోలు కోట్లకు పడగెత్తిన ధ‌న‌వంతులు. అయితే కొందరు హీరోలు తమ భార్య‌ల ఆస్తుల ముందు దిగదుడుపు. అత్యంత ధ‌న‌వంతులైన హీరోలు, వారి భార్యల ఆస్తుల వివరాలు ఇక్కడ ఉన్నాయి. కొందరు హీరోయిన్స్ తమ భర్తల నికర ఆస్తుల విలువకు రెట్టింపు కలిగి ఉన్నారు.   

కత్రినా కైఫ్

కత్రినా కైఫ్ : భర్త విక్కీ కౌశ‌ల్ కంటే కత్రినా కైఫ్ 6 రెట్లు ఎక్కువ ఆస్తులు క‌లిగి ఉన్నారు. విక్కీ కౌశల్ నిక‌ర ఆస్తుల విలువ రూ. 41 కోట్లు కాగా, కత్రినా కైఫ్ నిక‌ర ఆస్తుల రూ. 224 కోట్లు. విక్కీ కౌశల్ వయసులో తనకంటే ఐదేళ్లు పెద్దదైన కత్రినా కైఫ్ ని వివాహం చేసుకున్నారు. 2021లో వీరు పెళ్లి పీటలు ఎక్కారు. కత్రినా కైఫ్ తెలుగులో మల్లీశ్వరి, అల్లరి పిడుగు చిత్రాల్లో నటించింది. తిరిగి మళ్ళీ ఆమె తెలుగులో నటించలేదు. 


ప్రీతి జింటా

ప్రీతి జింటా : హీరోయిన్ ప్రీతి జింటా రిచెస్ట్ బాలీవుడ్ హీరోయిన్స్ లో ఒకరు. ప్రీతి జింటా భ‌ర్త జీన్ గుడ్‌నో ఆస్తుల విలువ  రూ. 25 కోట్లు అని సమాచారం. ఇక ప్రీతి జింటా ఆస్తుల విలువ రూ. 250 కోట్లు. అంటే భర్త కంటే పది రెట్లు అధిక సంపద ఆమె కలిగి ఉన్నారు. ఈమె ఐపీఎల్ జట్లలో ఒకటైన కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ ఫ్రాంచైజ్ ఓనర్. తెలుగులో ప్రీతి జింటా ప్రేమంటే ఇదేరా, రాజకుమారుడు చిత్రాల్లో నటించింది.  
 

దీపికా ప‌దుకొణే

దీపికా ప‌దుకొణే : బాలీవుడ్ లేడీ సూప‌ర్ స్టార్ దీపికా ప‌దుకొణే ఆస్తులకు, భర్త ర‌ణ్‌వీర్ సింగ్ ల ఆస్తులకు మధ్య రూ. 255 కోట్ల వ్యత్యాసం ఉంది. ర‌ణ్‌వీర్ సింగ్ ఆస్తుల విలువ రూ. 245 కోట్లు కాగా, దీపికా ప‌దుకొణే నెట్ వర్త్ రూ. 500 కోట్లు. దీపికా ఫస్ట్ టైం కల్కి 2898 AD చిత్రంతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. ప్రభాస్ హీరోగా నటించిన కల్కి వరల్డ్ వైడ్ రూ. 1200 కోట్ల వసూళ్లు రాబట్టింది. కల్కి రెండవ భాగం విడుదల కావాల్సి ఉంది. 

ఆలియా భ‌ట్

అలియా భ‌ట్ : విన‌డానికి మీకు ఆశ్చ‌ర్యంగా అనిపించొచ్చు, కానీ ఇది నిజం. ర‌ణ్‌బీర్ క‌పూర్ మొత్తం ఆస్తుల విలువ రూ. 345 కోట్లు కాగా, అలియా భ‌ట్ ఆస్తుల విలువ రూ. 550 కోట్లు. అలియా భట్ తెలుగులో ఒకే ఒక చిత్రం చేసింది. రాజమౌళి తెరకెక్కించిన ఆర్ ఆర్ ఆర్ మూవీలో రామ్ చరణ్ ప్రియురాలు సీతగా కనిపించింది. అయితే అలియా పాత్రకు పెద్దగా స్క్రీన్ స్పేస్ లేదు. 

ఐశ్వ‌ర్య రాయ్

ఐశ్వ‌ర్య రాయ్ : రిచెస్ట్ హీరోయిన్స్ లిస్ట్ లో మొద‌టి స్థానంలో ఐశ్వ‌ర్య రాయ్ ఉన్నారు. ఈమె బాలీవుడ్‌లో అత్యంత ధ‌న‌వంతురాలైన న‌టి. ఈమె ఆస్తుల విలువ ఏకంగా రూ. 800 కోట్లు. అయితే అభిషేక్ బ‌చ్చ‌న్ ఆస్తుల విలువ కేవలం రూ. 280 కోట్లు మాత్రమే. ఇటీవల అభిషేక్-ఐశ్వర్య విడిపోతున్నారంటూ వార్తలు వచ్చాయి. అనంతరం కలిసి కనిపించిన ఈ జంట పుకార్లకు చెక్ పెట్టారు. 

బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 అప్ డేట్స్ కోేసం ఇక్కడ క్లిక్ చేయండి.

Latest Videos

click me!