తెలుగు సినిమా పై చెరగని ముద్ర వేసిన నటుల్లో చిరంజీవి ఒకరు. ఎలాంటి సినిమా నేపథ్యం లేకుండా పరిశ్రమలో అడుగుపెట్టి మెగాస్టార్ అయ్యాడు. ఎన్టీఆర్ తర్వాత నెంబర్ స్థానాన్ని కైవసం చేసుకున్న చిరంజీవి... దశాబ్దాల పాటు అగ్ర హీరోగా కొనసాగారు. చిరంజీవి ఎవర్ గ్రీన్ స్టార్. ఆయన మేనియా, మార్కెట్ ఏ మాత్రం తగ్గలేదు.
కాగా చిరంజీవి అసలు పేరు శివ శంకర్ వరప్రసాద్. నటులకు ఫ్యాన్సీ నేమ్ ఉంటే బాగుంటుంది. జనాల్లోకి వెళ్ళేలా, ఈజీగా పలికేలా, స్టైలిష్ గా కూడా ఉండాలి. శివ శంకర్ వరప్రసాద్ స్క్రీన్ మీద అంతగా బాగోదు. స్క్రీన్ నేమ్ గా ఏం పెట్టుకోవాలనే ఆలోచనలో పడ్డారట చిరంజీవి. శివ... శంకర్... ప్రసాద్ లలో ఒకటి తీసుకుందాం అంటే, అప్పటికే ఉన్న నటుల పేర్లను తలపిస్తున్నాయని అనుకున్నారట.