బ్యాంకాక్ బీచ్, అక్కడ ఓ మహిళ, పూరి జగన్నాధ్ కథలు రాయడానికి అక్కడికే ఎందుకు వెళతాడో తెలుసా?

First Published | Oct 15, 2024, 12:39 PM IST


డైరెక్టర్ పూరి జగన్నాధ్ కథలు రాయడానికి బ్యాంకాంక్ వెళతారు. దీనికి ఒక కారణం ఉందట. ఆ సీక్రెట్ ఓ సందర్భంలో పూరి జగన్నాధ్ బయటపెట్టాడు. 
 

కథలు రాయడానికి ఒక్కో దర్శకుడిది ఒక్కో పంథా. పూరి జగన్నాధ్ మాత్రం థాయిలాండ్ వెళతాడు. అక్కడే కొత్త కథలు రాస్తారు. అసలు థాయిలాండ్ రాజధాని బ్యాంకాంక్ వెళ్లడం వెనుక బలమైన కారణం ఉందట. 
 

దర్శకుడు పూరి జగన్నాధ్ చాలా మంది హాట్ ఫెవరేట్ దర్శకుడు. సక్సెస్ ఫెయిల్యూర్స్ తో సంబంధం లేకుండా ఆయన్ని అభిమానిస్తారు. టాలీవుడ్ కి తన మార్క్ హీరోయిజం ని పూరి జగన్నాధ్ పరిచయం చేశాడు. ఇక పూరి జగన్నాధ్ కథలు, డైలాగ్స్ యూనిక్ గా ఉంటారు. సూటిగా సుత్తి లేకుండా పూరి జగన్నాధ్ వన్ లైనర్స్ రాస్తారు. 

అలాగే జెట్ స్పీడ్ లో స్క్రిప్ట్ పూర్తి చేసి, మూవీ కంప్లీట్ చేస్తాడు. కేవలం రెండు వారాల్లో పూరి జగన్నాధ్ స్క్రిప్ట్ పూర్తి చేస్తాడు. ఆరు నెలల్లోపే షూటింగ్ పూర్తి చేసి సినిమా విడుదల చేస్తాడు. పూరి జగన్నాధ్ దగ్గర డైరెక్షన్ నేర్చుకో అని మా ఆవిడ చెప్పిందని దర్శకుడు రాజమౌళి ఓ వేదికపై ఓపెన్ గా చెప్పాడు. 
 



ఇక విజయేంద్ర ప్రసాద్ తన వాల్ పేపర్ గా పూరి జగన్నాధ్ ఫోటో పెట్టుకుంటాడట. ఒక రచయితగా పూరి జగన్నాధ్ అంటే నాకు ఈర్ష్య. నా శత్రువుగా భావిస్తాను. అందుకు నా శత్రువును గుర్తు చేసుకోవడానికి పూరి జగన్నాధ్ ఫోటో పెట్టుకున్నానని ఆయన వెల్లడించారు. వివి వినాయక్ సైతం పూరి జగన్నాధ్ గట్స్ ని ఉద్దేశిస్తూ ఆసక్తికర కామెంట్స్ చేశాడు. 

జయాపజయాలను అసలు పూరి జగన్నాధ్ పట్టించుకోడు. ఆర్థికంగా పాతాళానికి పడిపోయాడు. ధైర్యం కోల్పోకుండా తిరిగి కమ్ బ్యాక్ అయ్యాడని వివి వినాయక్ ఓ ఇంటర్వ్యూలో అన్నాడు. పూరి మ్యూసింగ్స్ పేరుతో పూరి జగన్నాధ్ చేసే వీడియోలకు మంచి ఆదరణ దక్కింది. పూరి మాటల్లో జీవిత సారం కనిపిస్తుంది. 

కాగా పూరి జగన్నాధ్ కి ఒక అలవాటు ఉంది. ఆయన కథలు రాసేందుకు బ్యాంకాక్ వెళతాడు. బ్యాంకాక్ మీకు చాలా ఇష్టమైన ప్రదేశం. ఎందుకని అడగ్గా.. అక్కడ బీచ్ లో కూర్చుని నేను కథలు రాస్తాను.. అని పూరి జగన్నాధ్ సమాధానం చెప్పారు. ఇండియాలో బీచ్ లు ఉన్నాయి. అలాగే ఇతర దేశాల్లో కూడా సముద్ర తీరాలు ఉన్నాయి. బ్యాంకాక్ మాత్రమే వెళ్ళడానికి రీజన్ ఏమిటని అడిగితే. 

బ్యాంకాక్ కూడా కాదు పక్కనే ఉన్న పటాయా బీచ్ అంటే నాకు చాలా ఇష్టం. బీచ్ పక్కనే రోడ్ ఉంటుంది. చక్కగా కుర్చీలు, గొడుగులు ఏర్పాటు చేస్తారు. హాయిగా కూర్చోవచ్చు. అక్కడ ఒక ముసలావిడ, ఆమె ఫ్యామిలీ ఉంటుంది. వాళ్లకు తెలుసు నాకు ఏం కావాలో? వాటర్, కొబ్బరి నీళ్లు సప్లై చేస్తుంటారు. ఆ ముసలావిడ ఫ్యామిలీతో నాకు అనుబంధం ఉంది. ఆ పటాయా బీచ్ లో కూర్చుని కథలు రాయడం అలవాటుగా మారింది.. అని వెల్లడించాడు. 
 

ఇక పూరి జగన్నాధ్ కెరీర్ పరిశీలిస్తే... ఇస్మార్ట్ శంకర్ తో ఆయన కమ్ బ్యాక్ అయ్యారు. 2019లో విడుదలైన ఆ చిత్రం సూపర్ హిట్. రూ. 75 కోట్ల వరల్డ్ వైడ్ గ్రాస్ రాబట్టింది. దెబ్బకు పూరి జగన్నాధ్ ఆర్థిక కష్టాలన్నీ పోయాయి. అయితే లైగర్ తో ఆయనకు భారీ షాక్ తగిలింది. విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన యాక్షన్ డ్రామా లైగర్ నిరాశపరిచింది. 

లైగర్ విజయం సాధించి ఉంటే పూరి జగన్నాధ్ పరిస్థితి వేరుగా ఉండేది. డబుల్ ఇస్మార్ట్ మూవీతో మరో కుదుపుకు లోనయ్యాడు. ఇటీవల విడుదలైన డబుల్ ఇస్మార్ట్ కనీస ఆదరణకు నోచుకోలేదు. రామ్ పోతినేని-పూరి కాంబో ఈసారి సక్సెస్ కాలేదు. ప్రస్తుతం పూరి జగన్నాధ్ చేతిలో చిత్రాలు లేవు. అధికారికంగా ఎలాంటి ప్రాజెక్ట్ ప్రకటించలేదు. 

బిగ్ బాస్ హౌజ్ నుంచి ఈ వారం బయటకు వెళ్లేది ఎవరు?

Latest Videos

click me!