శోభన్‌ బాబుకి జయలలిత మూడు వేల కోట్లు దానం చేసిందా? ఆ కారణంతోనే ఎంజీఆర్‌ సొమ్మంతా సోగ్గాడికి పెట్టిందా?

First Published May 25, 2024, 8:59 PM IST

శోభన్‌బాబు అంటే జయలలితకి ఎంతో ప్రేమ. ఆ ప్రేమ కారణంగానే ఆయన్ని ఎంతో ప్రత్యేకంగా భావించేది. అంతేకాదు వేల కోట్లు ఆయనకు పంచిపెట్టిందట జయలలిత. 
 

మొదటితరం నటీనటులకు సంబంధించిన విషయాలు ఇప్పటి తరం ఆడియెన్స్ కి ఆసక్తికరం. అప్పుడు ఏం జరిగింది? వాళ్ల పర్సనల్‌ లైఫ్‌ ఎలా ఉండింది? సినిమా షూటింగ్‌లో ఎలాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయనేది ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. అందులో భాగంగా తెలుగు తెర సోగ్గాడిగా వెలిగిన శోభన్‌బాబుకి సంబంధించిన విషయాలు ఇప్పుడు వైరల్‌గా మారుతున్నాయి. 
 

శోభన్‌బాబు అంటే అందగాడు. ఎంతో మంది హీరోయిన్లు ఆయన్ని ఇష్టపడే వారు. కానీ ఆయన మాత్రం తాను పెట్టుకున్న కట్టుబాట్లకి కట్టుబడి ఉన్నాడు. జీవితాంతం అదే క్రమశిక్షణ కలిగిన జీవితాన్ని గడిపారు. ఎలాంటి చెడు అలవాట్లకి లోను కాలేదు. అయితే శోభన్‌బాబుని అలనాటి తార, మాజీ తమిళనాడు సీఎం జయలలిత ఎంతగానో ఇష్టపడేది. శోభన్‌బాబు ఓకే చెబితే పెళ్లి చేసుకునేంత ఇష్టం. కానీ సున్నితంగా తిరస్కరించాడు సోగ్గాడు. 

కానీ ఆయనపై ప్రేమని మాత్రం మరువలేదు. తన లైఫ్‌లో శోభన్‌బాబుని ప్రత్యేకంగానే భావించింది జయలలిత. అయితే ఆమె తమిళనాడు మాజీ సీఎం ఎంజీఆర్‌కి క్లోజ్‌ అయ్యారు. ఆయనతోనే ఉండిపోయారు. ఎంజీఆర్‌ని కూడా ఆమె పెళ్లి చేసుకోవాలనుకుంది. కానీ అప్పటికే ఆయనకు మ్యారేజ్‌ అయ్యింది. దీంతో ఆయన రాజకీయ నీడలో ఆయనకు తోడుగా ఉంది. రాజకీయాల్లో సపోర్టివ్‌గా ఉంది. 

ఆ సమయంలో శోభన్‌బాబుకి వేల కోట్లు దానం చేసిందట జయలలిత. అప్పట్లో ఎంజీఆర్‌ సీఎంగా ఉన్న సమయంలో స్విస్‌ బ్యాంకుల్లో డబ్బుని దాచేవారట. అలా సుమారు 3వేల కోట్లు స్విస్‌ బ్యాంక్‌ల్లో దాచాడట. ఆ వివరాలను తన తలపైన పెట్టుకునే టోపీలో దాచుకునేవాడట. ఈ క్రమంలో అవి జయలలిత చూసిందట. వాటిని తీసుకుని ఆ మనీని ఎలా ప్రాసెస్‌ చేయాలనేది అన్ని తెలుసుకుని ఆ అమౌంట్‌ని శోభన్‌బాబుకి ఇచ్చేసిందట. 

అప్పటికే తన వద్ద కోట్లు ఉన్నాయి, నేనేం చేసుకుంటా అని, శోభన్‌బాబు మనతోనే ఉంటాడు, ఎప్పటికైనా అవసరం వస్తాడని చెప్పి, ఆ మొత్తాన్ని శోభన్‌బాబుకి ఇచ్చిందట జయలలిత. ఆ అమౌంట్‌తో శోభన్‌బాబు ల్యాండ్‌ కొన్నాడట. కొన్ని వందల ఎకరాల ల్యాండ్‌ కొని డెవలప్‌ చేశాడు. దాన్ని జయలలిత, శోభన్‌బాబు పంచుకున్నారట. అలా జయలలిత, శోభన్‌బాబు మధ్య ఇంత జరిగిందని చెప్పాడు సీనియర్‌ రైటర్‌ తోటపల్లి మధు. ఓ యూట్యూబ్‌ ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాన్ని బయటపెట్టాడు. మరి ఇందులో నిజమెంతా అనేది తెలియాల్సి ఉంది. 
 

జయలలిత నటిగా కెరీర్‌ని ప్రారంభించి ఎంజీఆర్‌ అండంతోనే రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆయనకు తోడుగా ఉంటూ రాజకీయంగా ఎదిగింది. ఎంజీఆర్‌ చనిపోయిన తర్వాత ఆయన రాజకీయ వారసత్వాన్ని తీసుకుని సీఎం అయ్యింది. ఆల్‌ ఇండియా అన్నా డీఎంకే నుంచి ఆరు సార్లు సీఎం అయ్యింది. 2016లో అనారోగ్యంతో కన్నుమూసిన విసయం తెలిసిందే. 
 

click me!