దివంగత, అతిలోక సుందరి శ్రీదేవి కుమార్తెగా జాన్వీ కపూర్ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన విషయం తెలిసిందే. నెమ్మదిగా సినిమాలు చేసుకుంటూ వస్తోంది. వరుస చిత్రాలతో అలరిస్తోంది.
కెరీర్ విషయంలో ఏమాత్రం తొందరపడకుండా ఆచితూచీ అడుగులు వేస్తోంది. తన పాత్రకు ప్రాధాన్యత ఉంటేనే నటిస్తోంది. ఇంట్రెస్టింగ్ గా కథలను ఎంచుకుంటూ వస్తోంది.
’ధాఖడ్’ చిత్రంతో హీరోయిన్ గా మారిన ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్ పలు సినిమాలు చేసింది. ప్రస్తుతం టాలీవుడ్ ఎంట్రీకి సిద్ధమవుతోంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR) సరసన జాన్వీ ‘దేవర’ (Devara)లో నటిస్తున్న విషయం తెలిసిందే.
అయితే ఈ సినిమాపై తాజాగా అప్డేట్ అందించింది జాన్వీ కపూర్. ఇంకా షూటింగ్ పూర్తికాలేదని, నాలుగు పాటలు చిత్రీకరించాల్సి ఉందని చెప్పింది. తన షూటింగ్ పార్ట్ ఇంకా చాలా వరకు ఉందని చెప్పుకొచ్చింది.
Janhvi Kapoor Jr. NTR
అలాగే ఈ సినిమా కోసం తను ప్రత్యేకంగా తెలుగు భాషను నేర్చుకుంటున్నట్టు తెలిపారు. తానే సినిమాకు తెలుగు భాషలో సరళంగా డబ్బింగ్ చెప్పుకోవాలని ’దేవర‘ విషయంలో కీలక నిర్ణయం తీసుకుందంట.
దీంతో ప్రస్తుతం తెలుగు భాషలపై పట్టు సాధించే పనిలో జాన్వీ కపూర్ నిమగ్నమై ఉంది. తన సినిమా షూటింగ్ లు చేసుకుంటూనే మరోవైపు ఇండస్ట్రీలో జరుగుతున్న సినిమా ఫంక్షన్లకు కూడా హాజరవుతోంది. నయా లుక్స్ తో ఆకట్టుకుటోంది.