చిన్న తప్పుకి అల్లు అర్జున్ ని ఘోరంగా అవమానించిన స్టార్ హీరోయిన్.. బన్నీ ఫ్యాన్స్ జీర్ణించుకోవడం కష్టమే

First Published | Nov 3, 2024, 3:37 PM IST

ఇండస్ట్రీలో కొందరు హీరోయిన్లు వివాదాలకు దూరంగా ఉంటారు. కొందరు మాత్రం తమ ఇగో హర్ట్ అయ్యేలా ఎవరైనా తప్పు చేస్తే వదిలిపెట్టరు. అల్లు అర్జున్ ని అవమానించేలా ఒక స్టార్ హీరోయిన్ గతంలో మాట్లాడింది.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రేంజ్ ఇప్పుడు వేరు. పాన్  స్థాయిలో బన్నీ పేరు మోత మోగుతోంది. పుష్ప 2 చిత్రం డిసెంబర్ 5న రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. కాస్త పాజిటివ్ టాక్ వస్తే చాలు.. రికార్డులు ప్రవాహం తప్పదని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇదిలా ఉండగా ఇండస్ట్రీలో కొందరు హీరోయిన్లు వివాదాలకు దూరంగా ఉంటారు. కొందరు మాత్రం తమ ఇగో హర్ట్ అయ్యేలా ఎవరైనా తప్పు చేస్తే వదిలిపెట్టరు. 

NTR

అల్లు అర్జున్ ని అవమానించేలా ఒక స్టార్ హీరోయిన్ గతంలో మాట్లాడింది. బన్నీ పేరెత్తకుండా ఆమె చేసిన వ్యాఖ్యలు పెద్ద వివాదం అయ్యాయి. ఆ హీరోయిన్ సింపుల్ గా కామెంట్స్ చేసినప్పటికీ బన్నీ ఫ్యాన్స్ మాత్రం బాగా హర్ట్ అయ్యారు. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరో కాదు.. కళ్ళతోనే నటించగల సత్తా ఉన్న నిత్యా మీనన్. నిత్యా మీనన్ ఎన్టీఆర్ తో కలసి జనతా గ్యారేజ్ చిత్రంలో నటించింది. అంతకంటే ముందు అల్లు అర్జున్ తో కలసి సన్నాఫ్ సత్యమూర్తి అనే చిత్రంలో నటించింది. 


సన్నాఫ్ సత్యమూర్తి యావరేజ్ కాగా.. జనతా గ్యారేజ్ మంచి హిట్ గా నిలిచింది. జనతా గ్యారేజ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నిత్య మీనన్ చేసిన వ్యాఖ్యలు అల్లు అర్జున్ ని అవమానించేలా ఉన్నాయి. నిత్యామీనన్ మాట్లాడుతూ తాను నటించిన ఫస్ట్ పెద్ద హీరో సినిమా ఇదే అని తన ప్రసంగంలో తెలిపింది. దీనితో ఎన్టీఆర్ అభిమానులు ఒక్కసారిగా కేరింతలు కొట్టారు. 

కానీ అప్పటికే నిత్యా మీనన్ అల్లు అర్జున్ తో సన్నాఫ్ సత్యమూర్తి చిత్రంలో నటించింది ఉంది. అల్లు అర్జున్ కూడా స్టార్ హీరోనే. కానీ తాను నటించిన తొలి స్టార్ హీరో సినిమా జనతా గ్యారేజ్ అని చెప్పడం బన్నీ అభిమానులకు మింగుడు పడలేదు. అంటే నిత్యా మీనన్ దృష్టిలో అల్లు అర్జున్ స్టార్ హీరో కాదా అనే చర్చ జరిగింది. ఉద్దేశపూర్వకంగానే బన్నీని అవమానించేలా నిత్యా మీనన్ కామెంట్స్ చేసింది అని చాలా మంది భావించారు. 

నిత్యా మీనన్ బన్నీని అవమానించేలా కామెంట్స్ చేయడానికి ఆమె ఇగో హర్ట్ అయింది అనే రూమర్స్ అప్పట్లో వినిపించాయి. సన్నాఫ్ సత్యమూర్తి చిత్రంలో నిత్య మీనన్ సెకండ్ హీరోయిన్ గా నటించింది. సెకండ్ హీరోయిన్ కంటే క్యారెక్టర్ ఆర్టిస్ట్ తరహాలో ఆమె పాత్ర ఉంటుంది. సమంతతో హై లైట్ చేస్తూ నిత్యా మీనన్ పాత్రని త్రివిక్రమ్ నెగిటివ్ గా చూపించారు. ఆ చిత్రంలో నిత్యాకి సెకండ్ హీరోయిన్ అనే హోదా కూడా ఉండదు. దీనితో నిత్యా మీనన్ బాగా హర్ట్ అయింది. 

జనతా గ్యారేజ్ లో కూడా సమంత, నిత్యా మీనన్ ఇద్దరూ హీరోయిన్లు. ఇందులో మాత్రం కొరటాల శివ నిత్యా పాత్రకి కాస్త ఇంపార్టెన్స్ ఇచ్చారు. సమంత పాత్ర మధ్యలోనే ఎండ్ అవుతుంది. నిత్యా మీనన్ మాత్రం మెయిన్ హీరోయిన్ అన్నట్లుగా చివరి వరకు ఉంటుంది. ఆ ఉద్దేశంతోనే బన్నీని తగ్గించేలా నిత్యా మీనన్ పరోక్షంగా అవమానించినట్లు అప్పట్లో చర్చ జరిగింది. త్రివిక్రమ్ చేసిన పొరపాటు వల్ల నిత్యా మీనన్ బన్నీని అవమానించింది అని అంతా చెప్పుకున్నారు. 

Latest Videos

click me!