
ప్రస్తుతం టాలీవుడ్‌లో స్టార్ (Tollywood Heroes)హీరోలంతా ఒక్కొక్కరు మూడు నాలుగు సినిమాలతో బిజీగా ఉన్నారు. మరో రెండుమూడేళ్లు బిజీ అనేంతగా సినిమాలను లైనప్‌తో పెట్టారు. పాన్ ఇండియా సినిమాలతో దూసుకెళ్తున్నారు. `బాబు బాగా బిజీ` అని మేనేజర్లు, అసిస్టెంట్లు చెప్పుకునే స్థితిలో ఉన్నారు. ఏకకాలంలో రెండు మూడు సినిమాల షూటింగ్‌లో పాల్గొంటూ క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు. జయాపజయాలకు అతీతంగా షూటింగ్‌లతో పరుగులు పెడుతున్నారు.
కానీ అందుకు భిన్నమైన పరిస్థితిలో ఉన్నారు ఎన్టీఆర్(Ntr), అల్లు అర్జున్(Allu Arjun). కక్కలేక మింగలేకపోతున్నారు. దిక్కుతోచని స్థితిలో.. ఏం చేయాలో అర్థం కాక తలలు పట్టుకుంటున్నారు. మిగతా హీరోలు బ్యాక్ టూ బ్యాక్ సినిమాల షూటింగ్‌లో బిజీగా ఉంటే వీరిద్దరు మాత్రం ఇంట్లో సేద తీరుతున్నారు. పిల్లలు, ఫ్యామిలీతో కాలక్షేపం చేస్తున్నారు. వీరిద్దరికే ఎందుకీ పరిస్థితి అనేది చూస్తే..
ఎన్టీఆర్ చివరగా `ఆర్‌ఆర్‌ఆర్`(RRR) చిత్రంతో బ్లాక్ బస్టర్ అందుకున్నారు. రాజమౌళి రూపొందించిన ఈ పాన్ ఇండియా చిత్రంలో రామ్‌చరణ్‌తో కలిసి నటించారు. ఈ చిత్రం ఈ ఏడాది బిగ్గెస్ట్ హిట్ చిత్రాల్లో రెండవదిగా నిలిచింది. సుమారు రూ.1150కోట్లు వసూలు చేసింది. తారక్ కి ఇండియాలోనే కాదు అంతర్జాతీయంగానూ గుర్తింపు తెచ్చింది. ఈ సినిమా తర్వాత ఆయన వరుసగా సినిమాల లైనప్ పెట్టుకున్నారు. ఆయన కోసం దర్శకులు వెయిట్ చేస్తున్నారు.
వెంటనే ఎన్టీఆర్.. కొరటాల శివ(Koaratala Siva) దర్శకత్వంలో ఎన్టీఆర్30(NTR30) చిత్రంలో నటించాల్సి ఉంది. ఇప్పటికే ప్రారంభం కావాల్సిన ఈ చిత్రం ఇంకా డిలే అవుతుంది. స్క్రిప్ట్ వర్క్ పూర్తి కాకపోవడంతో షూటింగ్ స్టార్ట్ కాలేదు. దీంతో ఎన్టీఆర్ రిలాక్సేషన్ మూడ్‌లోనే ఉండిపోతున్నాడు. నెక్ట్స్ `కేజీఎఫ్`(KGF) ఫేమ్ ప్రశాంత్ నీల్(Prashanth Neel)తో చేయాల్సి ఉన్నా ఆయన `సలార్`తో బిజీగా ఉండటంతో ఆ సినిమాని కూడా పట్టాలెక్కించే పరిస్థితి లేదు.
అయితే అపజయాలు లేని దర్శకుడు కొరటాల శివకి `ఆచార్య` (Acharya)రూపంలో పెద్ద షాక్ తగిలింది. చిరంజీవితో చేయాలన్న డ్రీమ్ నెరవేరింది. కానీ అనేక నష్టాలను తీసుకొచ్చింది. ఆస్తులమ్ముకునే పరిస్థితిని తీసుకురావడం బాధాకరం. ఈ సినిమా పరాజయంతో డబ్బులన్నీ వెనక్కివ్వాల్సి రావడం అత్యంత బాధాకరం. దీంతో తీవ్రంగా మానసికంగా కుంగిపోతున్నారు కొరటాల శివ. ఈ కారణంగా ఎన్టీఆర్‌తో చేయాల్సిన స్క్రిప్ట్ పై దృష్టిపెట్టలేకపోతున్నారు.
పైగా `ఆచార్య` పరాజయం చెందడం, మరోవైపు `ఎన్టీఆర్30`ని పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కించబోతున్న నేపథ్యంలో లార్జ్ స్కేల్‌లో స్క్రిప్ట్ ఉండేలా మరింత కేర్ తీసుకుంటున్నారట. `ఆచార్య` విషయంలో జరిగిన తప్పులు మళ్లీ జరగకుండా ఉండేందుకు కాస్త టైమ్ తీసుకుని పర్‌ఫెక్ట్ గా కథని రెడీ చేస్తున్నారట. అయితే ఈ విషయంలో ఎన్టీఆర్ కూడా కొరటాలకి ఫ్రీడమ్ ఇచ్చారని టాక్. టైమ్ అయితే ఇచ్చాడు కానీ ఖాళీగా ఉండాల్సిన పరిస్థితిని తలచుకుని కక్కలేక మింగలేక అనే పరిస్థితిలో ఉన్నట్టు ఫిల్మ్ నగర్ భోగట్టా.
ఆల్మోస్ట్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ది కూడా ఇదే పరిస్థితి. ఆయన `పుష్ప`(Pushpa) చిత్రంతో దేశ వ్యాప్తంగా సత్తా చాటారు. సుకుమార్ రూపొందించిన ఈ సినిమా సుమారు రూ.350కోట్లు వసూలు చేసింది. ఊహించని కలెక్షన్లతో సౌత్, నార్త్ అన్ని భాషల మేకర్స్ కి షాకిచ్చింది. దీనికి కంటిన్యూగా రెండో పార్ట్ (పుష్ప 2)(Pushpa2) తీయబోతున్నారు. మొదటి భాగం విడుదలై ఎనిమిది నెలలు పూర్తయినా సెకండ్ పార్ట్ ఇంకా పట్టాలెక్కలేదు. దీంతో అప్పట్నుంచి ఖాళీగానే ఉంటున్నారు అల్లు అర్జున్.
`పుష్ప` మొదటి భాగం విజయంతో రెండో పార్ట్ పై అందరిలోనూ భారీ అంచనాలున్నాయి. పైగా `కేజీఎఫ్` లాంటి సినిమాలతో పోల్చుకుంటున్నారు అభిమానులు. మేకర్స్ కూడా మరో బిగ్గెస్ట్ సినిమా రాబోతుందనే ఆశలతో ఉన్నారు. పాటలు, డైలాగ్‌లో దేశ వ్యాప్తంగా, అంతర్జాతీయ స్థాయిలోనే పాపులర్ కావడంతో ఆ అంచనాలు మరింతగా పెరిగాయి. దీంతో వాటిని రీచ్ కావాలంటే రెండో భాగం దానికి మించి, ఊహించని స్థాయిలో ఉండాలి. దీంతో దర్శకుడు సుకుమార్(Sukumar) టీమ్‌పై బాగా ఒత్తిడి పెరిగింది. అందుకోసం ఆయన మరింత టైమ్ తీసుకుని స్క్రిప్ట్ పై వర్క్ చేస్తున్నారు.
ఈ విషయంలో బన్నీ నుంచి సుకుమార్‌కి, టీమ్‌కి ఫ్రీడమ్ ఉంది. కానీ ఖాళీగా ఉన్న పరిస్థితి విషయంలోనే బన్నీ కక్కలేక మింగలేకపోతున్నారట. ఇంకా ఎప్పుడు స్టార్ట్ అవుతుందనేదానిపై క్లారిటీ లేదు. గాసిప్ లు వైరల్ అవుతున్నాయి, తప్ప అధికారికంగా మాత్రం ఎప్పుడు షూటింగ్ అనేది క్లారిటీ లేదు. అయితే ఎన్టీఆర్‌తో పోల్చితే బన్నీ కాస్త రిలీఫ్‌నిచ్చే విషయం ఏంటంటే ఆయన ఈ గ్యాప్‌లో చేయాల్సిన యాడ్స్ చేస్తున్నారు. యాడ్స్ ద్వారా బిజీగా ఉంటున్నారు. ఎన్టీఆర్ ఎక్కువగా యాడ్స్ చేయరు. చాలా అరుదుగానే కనిపిస్తుంటారు. యాడ్స్ అనేది పెద్ద మ్యాటర్ కాదు కాబట్టి ఆల్మోస్ట్ ఎన్టీఆర్, బన్నీ ఇద్దరూ ఒకేలాంటి ఫీలింగ్‌తో ఉన్నారని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.
అయితే ఇద్దరు హీరోల అభిమానులు మాత్రం చాలా సహనంతో భరిస్తున్నారు. అభిమాన హీరోల పరిస్థితి చూసి లోలోపల మదన పడటం తప్ప వాళ్లూ ఏం చేయలేక, ఏం అనలేకపోతున్నారు. ఏం చేసినా మంచి సినిమా తీయడం కోసమేగా అని, బెస్ట్ సినిమా అందించడం కోసమే కదా అని వారిని వారు సర్ది చెప్పుకుంటూ శాంతిస్తున్నారు. మరి ఈ వెయిటింగ్‌కి ఎప్పుడు ముగింపు పడుతుంది. ఈ ఇద్దరు పాన్ ఇండియా స్టార్లు ఎప్పుడు బిజీ అవుతారనేది ప్రస్తుతానికి సస్పెన్స్.