#Boycott Liger:ట్రెండింగ్ లో 'బాయ్‌ కాట్ లైగర్', అసలు కారణాలు ఇవే?

Published : Aug 20, 2022, 09:14 AM IST

అమీర్ ఖాన్, అక్షయ్ కుమార్, అనురాగ్‌ కశ్యప్ లాంటి వాళ్లనీ వదలని ఈ సెగ ఇప్పుడు లైగర్ కీ తప్పడం లేదు. బాయ్ కాట్ లైగర్ అన్న హ్యాష్ ట్యాగ్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ  ట్రెండ్ వెనక ఉన్నదెవరు..అసలు కారణాలు ఏమిటి  

PREV
19
 #Boycott Liger:ట్రెండింగ్ లో 'బాయ్‌ కాట్ లైగర్',  అసలు కారణాలు ఇవే?
Image: Ananya Pandey/Instagram


బాయ్‌కాట్ బాలీవుడ్.. ఇండియాలో ట్రెండింగ్ లో ఉన్న హ్యాష్‌ట్యాగ్ . ఇప్పటికే వరుస ఫెయిల్యూర్లతో ఉన్న బాలీవుడ్ ను బాయ్‌కాట్ హ్యాష్‌ట్యాంగ్ మరింత టెన్షన్ పెడుతోంది. ఆమీర్ లాల్‌సింగ్ చడ్డా దగ్గర నుంచి అక్షయ్ రక్షాబంధన్, షారుఖ్ పఠాన్.. ఇలా టాప్ హీరోలే లక్ష్యంగా రోజుకో హ్యాష్‌ట్యాగ్ ట్రెండింగ్‌లోకి వస్తోంది.  తాజాగా ఆ సెగ లైగర్ చిత్రానికి కూడా తగులుతోంది. 

29
Liger Movie


 విజయ్ దేవరకొండ, దర్శకుడు పూరి జగన్నాథ్ కలయికలో రూపొందిన 'లైగర్' సినిమా చాలా భారీ ఎత్తున విడుదల అవుతోంది. ఈ సినిమాపై మాత్రం నార్త్ ఇండియన్ ఆడియన్స్ ఇప్పుడు సోషల్ మీడియాలతో మండి పడుతున్నారు.ఈ 'లైగర్' సినిమాపై నార్త్ ఇండియన్ ఆడియన్స్ నుంచి వ్యతిరేకత రావడానికి రెండు కారణాలు ప్రధానంగా చెప్పుకోవచ్చు. అందులో ఒకటి... కరణ్ జోహార్. 

39
Liger Movie

 మరొకటి హీరోయిన్ అనన్యా పాండే. సీనియర్ యాక్టర్ చుంకీ పాండే కుమార్తెగా ఆవిడ ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్ అయ్యారు. ఆమెకు కరణ్ జోహార్ ఆశీసులు కూడా ఉన్నాయి. ఇక ఆమెపై కోపం కూడా సినిమా మీదకు మళ్లిందని చెప్పవచ్చు.
 

49
Liger Movie


అలాగే ఇప్పుడు కొత్తగా మరో వివాదం కూడా మొదలైంది. అది విజయ్ దేవరకొండ ...లాల్ చంద్ చద్దా సినిమాని బోయ్ కాట్ చేయటం గురించి ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వూలో కామెంట్స్ చేయటం. చాలా మంది సినీ కార్మికలు ఇలా సినిమాని బోయ్ కాట్ చేయటం వలన నష్టపోతారని అన్నారు. అయితే సినిమా రిలీజ్ కు ముందే వాళ్లకు పేమెంట్ ఇచ్చేస్తారు కదా..వాళ్లు నష్టపోయేదేముంది..ఇలా అమీర్ ఖాన్ ని సపోర్ట్ చేయటానికి సంభంధం లేని లాజిక్ లు తీస్తున్నారని కొందరు ఈ పిలుపు ఇస్తున్నారు.

59


అంతేకాకుండా విజయ్ దేవరకొండ రీసెంట్ గా హైదరాబాద్ లో జరిగిన ఓ ప్రెస్ మీట్ లో టేబుల్ కాళ్లు పెట్టి కూర్చోవటాన్ని కూడా ..ఆడియన్స్ ని తక్కువ చేసి చూస్తున్నాడని కొందరు వేలెత్తి చూపుతు...బోయ్ కాట్ ట్రెండ్ ని సపోర్ట్ చేస్తున్నారు. 

69


ఇవన్నీ ఒకెత్తు అయితే రీసెంట్ గా .... విజయ్ దేవరకొండ టూర్ పూర్తయ్యాక ఇంట్లో పూజలు జరిపించుకున్నారు. ఆ పూజ ఫొటోలు ట్వీట్ చేసారు. అవి చూసిన జనం..పూజ చేయటానకి వచ్చిన ముగ్గురు అర్చకులు నిలబడి ఉంటే విజయ్, హీరోయిన్ మాత్రం సోఫాలో కూర్చున్నారని బోయ్ కాట్ కి పిలుపు ఇస్తున్నారు.

79


ఇవన్నీ ఇలా ఉంటే సినిమాలో 'ఆ... ఫట్', 'అకిడి పకిడి...' పాటలపై కూడా నెటిజన్స్ విమర్శలు చేస్తున్నారు. 'ఆ... ఫట్' పాటలో హిందీ లిరిక్స్ అనేవి వివాదానికి కారణం అయ్యాయి. హిందీలో 70లలో వచ్చిన ఒక సినిమాలోని రేప్ సన్నివేశంలో డైలాగులను ఫన్నీగా ఉపయోగించారని ఒకరు  దీని గురించి ట్వీట్ చేశారు. మరి కొంత మంది కూడా లిరిక్స్ మీద అనేక రకాల విమర్శలు అనేవి చేస్తున్నారు. ఇదొక కారణం.

89


 టాలెంటెడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ మరణం తర్వాత ఆయనపై చాలా తీవ్ర విమర్శలు వ్యక్తం అయ్యాయి. స్టార్ హీరోలు, హీరోయిన్లు ఇంకా సినిమా ఇండస్ట్రీకి చెందిన పిల్లల వారసుల్ని ఎంకరేజ్ చేస్తున్నారని ఉత్తరాది ప్రేక్షకులు ఆయన సినిమాలను బాయ్‌కాట్‌ చేయడం స్టార్ట్ చేస్తున్నారు. 'లైగర్' సినిమా నిర్మాతల్లో కరణ్ జోహార్ ఒకరు కావడంతో ఈ సినిమాపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాయ్‌కాట్‌ చేయమని ట్విట్టర్ సాక్షిగా కూడా పిలుపు ఇస్తున్నారు. 

99


 బాలీవుడ్ సిల్వర్ స్క్రీన్‌కు  సక్సెస్ దూరం అవుతున్న వేళ.... మరింత ఉక్కిరి బిక్కిరి చేస్తున్న అంశం బాయ్‌కాట్ హ్యాష్‌ట్యాగ్. ఈ స్థాయి వ్యతిరేకతను హిస్టరీలోనే ఫస్ట్ టైం బాలీవుడ్ ఫేస్ చేస్తోంది. ఓ వైపు సౌత్ సినిమాలు ఇంటర్‌నేషనల్ స్థాయిలో రికార్డుల మొత మోగిస్తూ దూసుకు వెళుతుంటే.. మరోవైపు, వందల కోట్ల పెట్టుబడులు, తిరుగులేని ఇమేజ్ ఉన్న టాప్ హీరోలతో హిట్ పక్కా అనుకున్న సినిమాలు బాక్సాఫీస్‌ ముందు బొక్కబోర్లా పడుతున్నాయి.  బోయ్ కాట్ బాలీవుడ్ అని ట్రెండ్ అవుతున్నాయి. 

click me!

Recommended Stories