Savitri: సావిత్రికి మందు అలవాటు చేసింది జెమినీ గణేషన్‌, కమెడియన్‌ కాదు.. తెరవెనుక ఉన్న కిలాడీ లేడీ ఎవరంటే?

Published : Aug 25, 2026, 07:08 PM IST

మహానటి సావిత్రి ఆల్కహాల్‌కి బానిసైన విషయం తెలిసిందే. ఆమె తాగుడికి బానిస కావడానికి జెమినీ గణేషన్‌ కారణమంటుంటారు. కానీ ఆయన కాదు తెరవెనుక ఒక లేడీ ఉందట. ఆమెనే మహానటిని ఈ రొచ్చులోకి దించిందట.

PREV
15
సావిత్రి జీవితం ఒక గుణపాఠం

మహానటి సావిత్రి నటన చాలా మందికి స్ఫూర్తి. ఆమె జీవితం అనేక మందికి గుణపాఠం. ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదనే దానికి సావిత్రి జీవితాన్నే ఉదాహరణగా చెబుతుంటారు. తన చేతులారా తన జీవితాన్ని ఆమె నాశనం చేసుకుందనేది అప్పటితరం మాట. కానీ సావిత్రి జీవితంలో చాలా ఇంట్రెస్టింగ్‌ అంశాలున్నాయి. ఆమె గురించి ఇప్పటితరం కూడా తెలుసుకోవాలని ఆతృతగా ఉంటారు. అదే సమయంలో ఆమె గురించి ఒక్కొక్కరు ఒక్కోలా స్పందిస్తున్నారు. ఒక్కో వెర్షన్‌ వెల్లడిస్తున్నారు. ఎంత తోడినా ఏదో ఒక కొత్త విషయం బయటపడుతూనే ఉంటుంది.

25
సావిత్రి మందుకి బానిస కావడానికి కారణం జెమినీ గణేషన్‌ కాదు

తాజాగా సావిత్రి గురించి మరో ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు సీనియర్‌ నటుడు ఏచూరి చలపతిరావు. సావిత్రి.. మందుకి బానిసగా మారి కోమాలోకి వెళ్లి కన్నుమూసిన విషయం తెలిసిందే. అయితే ఆ మందుని అలవాటు చేసింది ఆమె భర్త జెమినీ గణేషన్‌ అని అంతా అంటుంటారు. కానీ అది నిజం కాదు, కమెడియన్‌ జేపీ చంద్రబాబు అనే కొత్త విషయం ఆ మధ్య బయటకు వచ్చింది. తాజాగా మరో ఇంట్రెస్టింగ్‌ విషయం బయటకు వచ్చింది. సావిత్రికి మందుకి అలవాటు చేసింది జెమినీ గణేషన్‌ కాదు, జేపీ చంద్రబాబు అసలే కాదట. దాని వెనుక ఒక కన్నింగ్‌ లేడీ ఉందట.

35
సావిత్రిని చెడగొట్టింది లేడీ కమెడియన్‌

సురభి బాల సరస్వతి అని ఒక ఆర్టిస్ట్ ఉండేదట. ఆమె కామెడీ వేషాలు వేసేదట. రేలంగి వంటి వారికి జోడీగా చాలా సినిమాలు చేసిందట. సురభి అనే డ్రామా కంపెనీ నుంచి ఆమె సినిమాల్లోకి వచ్చిందట. దీంతో ఆమె పాడగలదు, నటించగలదు.. చూడ్డానికి మగాళ్లలా ఉంటుందట. ఆమె గొంతు కూడా మగాళ్లలా ఉంటుందట. స్టేజ్‌పై ఆమె కృష్ణుడి వేషాలు చాలా వేసిందట. ఆమె నిర్మాత గోపాలరావు వద్ద కొన్నాళ్లు ఉందట. ఆ తర్వాత సావిత్రి ఉన్న ఇంటికి దగ్గర్లోనే అద్దెకు ఉండేదట. ఎస్వీఆర్‌ ఇంటి సందులో ఆమె ఇళ్లు ఉండేదట. సావిత్రి ఇంటికి ఎదురుగా ఎస్వీఆర్‌ ఇళ్లు ఉండేదట. బాలసరస్వతికి మందు అలవాటు ఉందట. రోజూ ఎన్ని బుడ్లైనా తాగుతుందట. షూటింగ్‌లు ఉంటే వెళ్తుందట. లేదంటే రోజంతా మందే తాగుతుందట.

45
సావిత్రి కంట్రోల్‌ తప్పింది అప్పుడే

అయితే ఖాళీగా ఉందంటే ఎవరో ఒకరి ఇంటికి వెళ్లేందుకు ప్రయత్నం చేసేదట. కానీ ఎవరూ ఆమెని దగ్గరకు రానిచ్చేవారు కాదు. దూరం పెట్టేవారట. కానీ సావిత్రి ఆమె మాయ మాటలకు పడిపోయిందట. రోజూ ఇంటికి పిలిపించుకునేదట. అయితే ఆమెకి ఉన్న మందు అలవాటుని సావిత్రికి అలవాటు చేసిందట. సావిత్రి వద్దే ఉంటే అక్కడే భోజనం చేసేదట. రోజంతా అక్కడే గడిపేదట. సావిత్రి ఖరీదైన మందు తీసుకుంటుంటే, అది కాదు, ఇది చూడు అని చెప్పి తన నాటు సరుకుని పరిచయం చేసిందట. దానికి అలవాటు పడ్డ సావిత్రి వదల్లేకపోయిందట. రెగ్యూలర్‌గా తాగడం స్టార్ట్ చేసిందట. జెమినీ గణేషన్‌ ఎప్పుడైనా ఒకటి రెండు పెగ్‌లు మాత్రమే తీసుకోవాలని చెప్పేవాడు. మందుకు రెస్పెక్ట్ ఇచ్చేవారు, కానీ బాలసరస్వతి కారణంగా సావిత్రి పూర్తిగా మందుకి బానిస అయ్యిందని, దాన్నుంచి బయటపడలేకపోయిందని చెప్పారు ఏచూరి చలపతిరావు.

55
బీఎన్‌ రెడ్డి వార్నింగ్‌ ఇచ్చినా సావిత్రి వినలేదు

ఒకసారి సావిత్రికి కథ చెప్పడానికి బీఎన్‌ రెడ్డి గారు ఇంటికి వచ్చారు. ఆ సమయంలో సావిత్రి, బాలసరస్వతి పడుకొని ఉన్నారు. ఏదో ముచ్చట్లు చెప్పుకుంటూ కనిపించారు. ఆమెని చూసి బీఎన్‌ రెడ్డిగారు షాక్ అయ్యారు. ఏంటి ఇక్కడ ఉన్నావంటే.. అక్కని చూడ్డానికి వచ్చిన అని చెప్పిందట. ఆ సమయంలోనే ఆయన ఆమెకి వార్నింగ్‌ ఇచ్చాడు. అదే సమయంలో సావిత్రికి కూడా వార్నింగ్‌ ఇచ్చాడట. ఇది మంచి పద్ధతి కాదు, నువ్వు మహానటివి, ఇలా ఉండకూడదు. ఈ రొచ్చులో నుంచి బయటకు రావాలి. నీలాంటి నటి మళ్లీ పుట్టదు అని చెప్పి వెళ్లిపోయాడట. కానీ సావిత్రి దాన్నుంచి బయటపడలేకపోయింది. ఆ తర్వాత అనారోగ్యానికి గురై కోమాలోకి వెళ్లి కన్నుమూసిన విషయం తెలిసిందే.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories